శివగణం
• శివమే బీజం
శివుని కి వశమే మోక్షం .
• శివమనే స్వరము లో
శుభమనే వరము
ప్రసన్నం . . . ప్రసన్నం .
• శివం . . . శివం
• శివమనే ధ్వనము తో
సప్త ధాతువుల యోగం
చైతన్యం . . . చైతన్యం .
• శివం . . . శివం .
• శివమే బీజం
శివుని కి వశమే మోక్షం .
• మనము న ఈ నాదము నదము యైన
జీవము జలము లా జారేను .
• తలపు న ఈ తపన తరుముతు ఉన్నా
ప్రతికూలము కరుణ తో కరిగేను .
• శివమే బీజం
శివుని కి వశమే మోక్షం .
• శివమనే పలుకు తో
శిరము న కంపనలు
శీతలం . . . శీతలం .
• శివం . . . శివం .
• శివమనే పదము తో
నర నరము న నవ్యత కు
శ్రీకారం . . . శ్రీకారం .
• శివం . . . శివం .
• చిత్రమైన ఈ విచిత్రం
చిత్రము చూడని స్మృతి స్మరణం .
• విశ్వాంతర ఓం కారం
మన గుండె లయల శక్తి తరంగం .
• శివమే బీజం
శివుని కి వశమే మోక్షం .
• శివమే బీజం
శివుని కి వశమే మోక్షం .
భావం
• శివుడే సృష్టి కి మూలం.
• శివుని కి దాసోహం అవడమే , అనుభవిస్తున్న పరిస్థితి నుంచి విముక్తి .
• శివం అని అంటున్న స్వరానికి , శుభం కలిగే వరం ప్రసన్నం అవుతుంది.
• శివం అని అంటున్న ధ్వని వలన శరీర పోషణకు అవసరమైన ఏడు ముఖ్య పదార్థాలు (సప్తధాతువులు) , రసము, రక్తము, మాంసము, మేధస్సు (బుద్ధి), అస్థి (ఎముక), మజ్జ (కొవ్వు) , మరియు శుక్రము (వీర్యము) శుద్ధి అయి చైతన్యం అగును.
• మనసు లో శివ నాదం నదిలా ప్రవహిస్తూ ఉన్నచో మనిషి ప్రాణం (ఆత్మ) నీటి వలే తేలికగా జారుతూ ప్రవహిస్తూ , దుఃఖం లో కూరుకు పోకుండా జనన మరణాలు పొందును .
• మనిషి ఆలోచనల లో శివం అనే కోరిక విపరీతంగా పెరిగినట్లయితే ప్రతికూలమైన విఘ్నాలు అన్నీ సజావుగా సహజంగా తొలగిపోతాయి .
• శివం అని పలకడం వలన శిరస్సు లో ఆలోచనల అలజడులు అన్నీ చల్లారును .
• శివం అనే పదం వలన మనిషి లోని నర నరాలు తనకే తెలియని కొత్తదనానికి శ్రీకారం చుడతాయి .
• ఆశ్చర్యం అనిపించే ఈ విశిష్టతలు అన్నీ శివుని యొక్క రూపం చూడకుండానే మనసు తో స్మృతి చేయడం వలన సాధ్యం .
• విశ్వం యొక్క మూలం లో అనుక్షణం ప్రతి ధ్వనించే “ ఓం ” అనే శబ్దం , మనిషి గుండె కొట్టుకోవడానికి శక్తిని ఇస్తున్న తరంగం .
విశ్వం లో ఉన్న సమస్త మానవాళికి , దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు 🙏
శివ బాబా (తండ్రి) సహకారం తో . . .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 27 August 2025 2:00 AM.
No comments:
Post a Comment