Tuesday, August 19, 2025

679. బాల్యం ఆవిరి

 

బాల్యం ఆవిరి


చినుకై   జారినా       . . .    చిగురై  ఊగినా 

  మెరుపై  మెరిసి నా   . . .   ఉరుమై ఉరిమినా 

  ప్రతి క్షణం  నాది లే   . . .   నాది లే  .


• నా    ఊపిరి     ఉరకలు

  ఊహల కు     కానరావు .

• నా    కన్నుల    భాసలు 

  కవితల కు     తీసిపోవు .

• నా    ప్రేమ     భావనలు

  బంధనాలు     కాలేవు .

• నా  మాట    మధురాలు

  మందారాలు    కాలేవు.


• చినుకై జారినా        . . .   చిగురులా  ఊగినా

  మెరుపై  మెరిసి నా  . . .   ఉరుమై   ఉరిమినా

  ప్రతి  క్షణం  నాది లే  . . .   నాది లే  .


• ఆవిరైన    బాల్యానందం 

  వెంటాడుతుంది    ఈ నాడు .

  ఆదమరవ   నీయక 

  పిలుస్తుంది    ఈ పల్లవి లో .


• ఊహించని  ఈ  కాలం

  ఊయలూపుతుంది    ఊసుల తో.

  అలుపెరుగని    ఓ   పక్షి

  ఎన్నో తీరాలు   దాటి  పోతుంది .


• చినుకై   జారినా       . . .    చిగురులా ఊగినా

  మెరుపై   మెరిసి నా  . . .   ఉరుమై   ఉరిమినా

  ప్రతి క్షణం   నాది లే   . . .   నాది లే


• ఒకే  జన్మ లో    బాల్యాలు 

  రేయి   పగలై   నాయి .

  తొలి    బాల్యం 

  ముళ్ల  గులాబీ   అయితే 

  మలి    బాల్యం 

  బురద  కలువ  అయింది .

• ఆ   జ్ఞాపకాల     ఆవిరు లే

  ఈ  పరిమళాల   పులకింతలు .


• చినుకై     జారినా      . . .   చిగురులా ఊగినా

  మెరుపై   మెరిసి నా    . . .  ఉరుమై  ఉరిమినా

  ప్రతి క్షణం  నాది లే     . . .  నాది లే .


యడ్ల శ్రీనివాసరావు 19 August 2025 7:30 pm.


No comments:

Post a Comment

695 . కొడుకా ఓ కొడుకా !

  కొడుకా    ఓ     కొడుకా ! • కొడుకా  ఓ  కొడుకా  !   కొడుకా  ఓ  కొడుకా  ! • అమ్మవారి   కంటే    ముందు   నీ   అమ్మను   కొలువ  రా  . . .  • పండ...