Wednesday, August 20, 2025

680. జీవ దాహం

 

జీవ దాహం


• దేహము లో    దాహము

  దైవమయిన   వేళ

  జపమే    జలము .

• ఆత్మ కు     ఆకలి

  దైవమయిన   వేళ

  ఆధ్యాత్మిక తే   పరమాన్నము .


• ఆకలి దప్పికల    జీవితము

  దేహం   ఆత్మ ల   జీవము .

• ప్రేమ  తపముల   సంయోగము

‌ పరమాత్ముని   చేరు   మార్గము .


• శివుని     ధ్యానమే

‌  నరుని వికర్మలకు   విముక్తి.

• శివుని    ధర్మమే

  స్వర్గ   స్థాపనకు   శక్తి .


• దేహము లో      దాహము

‌  దైవమయిన     వేళ

  జపమే    జలము .

• ఆత్మ కు     ఆకలి

  దైవమయిన    వేళ

  పరమాత్మ యే    పరమాన్నము .


• దర్శకుడెవరో    తెలియని  నాడు

‌  నాటకం లో

  నీ పాత్ర     ఓ బూటకం .

• శివుని  సూక్ష్మం    ఎరుగని   వాడు

‌  జన్మం లో

  జీవమై  నా    ఓ  నిర్జీవమే .


• దేహము లో     దాహము

  దైవమయిన   వేళ

‌  జపమే     జలము .

• ఆత్మ కు     ఆకలి

‌  దైవమయిన    వేళ

  పరమాత్మ యే    పరమాన్నము .


యడ్ల శ్రీనివాసరావు 21 Aug 2025 11:30 AM.


No comments:

Post a Comment

683. అందరిలో అందరూ కొందరు.

  అందరిలో అందరూ కొందరు • అందరికీ   ఉంటారు      ఎందరో    కొందరు .   ఆ   కొందరి లో   ఎందరో    కొందరే    ఆప్తులు . • కొందరికే   ఉంటారు       కో...