Sunday, August 24, 2025

681. సత్య యుగపు స్వర్గం

 

సత్య యుగపు స్వర్గం




• మురిపించే     మురళి

  మైమరిపించే   రవళి

  ఇది

  వేణు  గానాల   హోళీ.


• మురిపించే     మురళి

  మైమరిపించే   రవళి

  ఇది

‌  వేణు గానాల   హోళీ.


• గోపిక ల  నాట్యం తో  నిండెను  బృందావనం

  గోవుల   మౌనం తో   అయ్యెను  శాంతివనం .


• మధురమైన   మాధవుని   జ్ఞానామృతం

‌  మకరందమై   విరిసెను  అంతటా  మధువనం .


• మురిపించే     మురళి

‌  మైమరిపించే   రవళి

  ఇది

‌  వేణు గానాల   హోళీ.


• మురిపించే     మురళి

‌  మైమరిపించే   రవళి

  ఇది

  వేణు గానాల    హోళీ .


• పరిమళాల     పవిత్రం

  నందుని     వనం .

• సుగంధాల     సారభం

  ఈ   శ్రీ కృష్ణుని       స్వర్గం .

 

• ఆనంద   కేళీలు

  అడుగడుగునా  రమణీయం .

• సంబరాల    అంబరం

  ఈ సత్య యుగపు   కోలాటం .


• దుఃఖమెరగని      దివ్యం

   అబూ     పర్వతం .

• భువి లోని    దివి  అయింది 

   ఈ  వైకుంఠ  వాసం  .

• ఇది   ఆత్మ  పరమాత్మ ల  సంగమాల 

   కైలాస   మానస  సరోవరం .

  

• మురిపించే      మురళి

‌  మైమరిపించే    రవళి

  ఇది

  వేణు   గానాల   హోళీ.



ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 


యడ్ల శ్రీనివాసరావు 24 August 2025 10:00 AM.


No comments:

Post a Comment

683. అందరిలో అందరూ కొందరు.

  అందరిలో అందరూ కొందరు • అందరికీ   ఉంటారు      ఎందరో    కొందరు .   ఆ   కొందరి లో   ఎందరో    కొందరే    ఆప్తులు . • కొందరికే   ఉంటారు       కో...