అందరిలో అందరూ కొందరు
• అందరికీ ఉంటారు
ఎందరో కొందరు .
ఆ కొందరి లో
ఎందరో కొందరే ఆప్తులు .
• కొందరికే ఉంటారు
కోరుకున్న వారు .
ఆ వారి లోని
అందరే శ్రేయోభిలాషులు .
• అందరిలో అందరూ
కాలేరు హితులు .
• కొందరిలో కొందరే
అవుతారు సన్నిహితులు.
• అందరికీ ఉంటారు
ఎందరో కొందరు .
• కొందరికే ఉంటారు
కోరుకున్న వారు .
• అన్నీ ఉన్నా ఏమీ
లేనట్లు ఉంటారు కొందరు .
• ఏమీ లేకున్నా అన్నీ
ఉన్నట్లు ఉంటారు మరికొందరు .
• అందరిలో అందరూ
మహా మహా నటులు .
• కొందరిలో కొందరే
మౌనమైన ప్రేక్షకులు .
• అందరికీ ఉంటారు
ఎందరో కొందరు .
• కొందరికే ఉంటారు
కోరుకున్న వారు .
• మనుషుల తో ఆటలు
ఆడువారు కొందరు .
• మనసులతో ఆటలు
ఆడువారు మరికొందరు .
• కాలక్షేపాలకు
కలిసే వారు కొందరు .
• కాలక్షేమాన్ని
తెలిపే వారు మరి కొందరు.
• అందరిలో అందరూ
సుందరాంగులు .
• కొందరిలో కొందరే
నిమిత్తమాత్రులు .
• అందరికీ ఉంటారు
ఎందరో కొందరు .
• కొందరికే ఉంటారు
కోరుకున్న వారు .
యడ్ల శ్రీనివాసరావు 29 August 2025 , 9:30 PM.
No comments:
Post a Comment