తల్లి తండ్రులు – పిల్లలు – ఉపాధ్యాయులు
• నేటి మన పూర్తి జీవితానికి మన పిల్లలు మరియు మన తల్లి తండ్రుల బంధమే మనకు పునాది. పిల్లలు అందరూ తమ చిన్నతనంలో అలవర్చుకునే అలవాట్లు వారి తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. తరచుగా తల్లిదండ్రులు పిల్లలపై ,తమకు సానుకూలంగా(అనుకూలంగా) ఉండే అలవాట్లను రుద్దుతుంటారు .
• పిల్లలు కోపం తెచ్చుకున్నా, అబద్ధాలు చెప్పినా, టి.వి, ఇంటర్‌నెట్ వంటి సైన్సు మాధ్యమాలలో తప్పుడు సమచారాన్ని చూసినా లేక చిన్న వయసులో తప్పుడు స్నేహం చేసినా, తాగుడు, ప్రొగ తాగడం వంటి అలవాట్లు ఉన్నా తల్లిదండ్రులు పిల్లలను తిడుతూ ఉంటారు.
• తల్లిదండ్రులు ఏర్పరచిన నియమాలను పిల్లలు పాటిస్తూ , పిల్లలు వారి ఆలోచనల స్వభావ సిద్ధంతో తీసుకువచ్చే మార్పులకు తల్లిదండ్రులు చాలాసార్లు సంతృప్తి చెందరు. ఇది పిల్లలు-తల్లిదండ్రుల బంధాన్ని చాలా ఇబ్బందిపాలు చేస్తుంది . వారి మధ్య మానసిక దూరం పెంచుతుంది .
• తల్లిదండ్రులు తమ బాగు కోసమే చెప్తున్నారన్న విషయం తెలిసినా గానీ పిల్లలు ఎందుకు వారి మాట వినరు?
మాటలకన్నా శక్తివంతమైనవి, పిల్లల భౌతిక స్థాయి పై ప్రభావం చూపించేది తల్లిదండ్రుల యొక్క వ్యక్తిత్వం . ఇది పిల్లలపై అదృశ్యంగా ( పైకి కనిపించని ) ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల మాటలకన్నా వారి వ్యక్తిత్వమే పిల్లలకు త్వరగా చేరుకుంటుంది.
• తల్లిదండ్రులు మార్పును చెప్తారు గానీ మార్పును స్వయం తాము అవలంబించరు. ఏ చెడు అలవాట్లనైతే పిల్లలలో వద్దు అని తల్లిదండ్రులు చెప్తున్నారో అవి వారిలో ఉంటున్నాయి . కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము మొదలైనవి … ఇవి పిల్లల సూక్ష్మ స్థాయికి చేరుకుంటూ ఉంటాయి.
ఈ ప్రతికూల గుణాలు , శక్తులు పిల్లల మనసులను తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు, శిక్షణలకన్నా ఎక్కువగా ప్రభావితం చేసి, మాటలవలన పొందే ప్రయోజనాన్ని శూన్యంగా చేస్తున్నాయి.
• పిల్లలకు ఉండే మరో ముఖ్యమైన బంధం గురించి ఆలోచిస్తే, వారికి వారి స్కూలు టీచరుతో ఉన్న బంధం. పిల్లలపై ఉపాధ్యాయులకున్న ఆపేక్షలు, మంచిగానీ చెడుగానీ, అవి పిల్లల విద్యా సామర్థ్యాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడింది . విద్యార్థులలో తక్కువ సమర్థత ఉంది అని అనుకునే కంటే . . . టీచర్లు మరియు పిల్లలలో మంచి సమర్థత ఉంది, వారు మంచి ఫలితాలను తీసుకువస్తారన్న నమ్మకాన్ని కనబరిచినప్పుడు పిల్లలు కూడా తమ సమర్థతకు ఏ మాత్రం తగ్గకుండా తమ మానసిక శక్తి తో పని చేసి మంచి ఫలితాలను పొందుతారు.
• తరచుగా పాఠశాలలో, పిల్లల సమర్థత గురించి ఉపాధ్యాయులు మాట్లాడే మాటలకు, ఆలోచించే ఆలోచనలకు పొంతన ఉండటం లేదు . ఉపాధ్యాయుల మాటలు చూస్తే వారికి విద్యార్థులపై పూర్తి నమ్మకము, ఆశ ఉన్నట్లుగా మాట్లాడుతారు, కానీ వారి ఆలోచనలలో మాత్రం అంతటి సానుకూలత ఉండటం లేదు అనేది నిజం .
పిల్లలు ఫెయిల్ అవుతారేమో అన్న భయంతో కూడిన ప్రతికూల ఆలోచన ఉపాధ్యాయులలో ఉన్నప్పుడు వారు మాటలతో ఎంత ప్రోత్సాహకరంగా మాట్లాడినా కానీ పిల్లల మనసుపై ప్రతికూలత యొక్క ప్రభావమే పడుతుంది. దీని కారణంగా పరీక్షలలో పిల్లలు తక్కువ సమర్థంగా ఉంటున్నారు .
నేటి కాలంలో పాఠశాల విద్య బోధన అనేది విలువలకు తిలోదకాలు ఇచ్చేసింది . దీని వలన సమాజ శ్రేయస్సు కి అన్ని విధాలా జరగవలసిన నష్టం జరగడం అనేది ఇప్పటికే ఆరంభం అయింది . దాని ఫలితం నిత్యం అశాంతి, హింస, కామము , క్రోధము తో కూడిన సంఘటనలు వార్తలలో చూస్తూ ఉన్నాం .
దురదృష్టం ఏమిటంటే ఇదంతా నేడు సహజం అని అనుకుంటూ మనం జీవించడం.
యడ్ల శ్రీనివాసరావు 1 Sep 2025 5:00 AM.
No comments:
Post a Comment