వినాయకుని విశిష్టత
• ప్రస్తుతం అంతా గణపతి నవరాత్రుల సందడి జరుగుతుంది. విగ్రహాలను నిలబెట్టడం లో వీధి వీధిలో పోటీ, చందాలను వసూలు చేయడం లో (అనేక ప్రాంతాలలో ) భక్తి పేరుతో దౌర్జన్యం , మండపం లో దేవుని పాటలు ఉదయం ఒక గంట మిగిలిన రోజంతా డి.జే. వికారీ పైత్యపు పాటలు . . .
చివరి రోజు లడ్డూ వేలం పాటలో హంగు ఆర్భాటం , ఇక ఆఖరి ఘట్టం నిమజ్జనం ఊరేగింపు లలో తాగి తందనాలు , గుడ్డలు చింపుకొని డాన్సులు , డి.జే లలో వికారీ సాహిత్య సినిమా పాటలు …. ఇది నేటి కాలంలో మనిషి భక్తి పేరుతో ప్రత్యక్షంగా దేవుని కోసం సృష్టించుకున్న సంస్కృతి .
కానీ విచిత్రం ఏమిటంటే , ఇదే నేడు మానవులందరికీ చాలా ఆహ్లాదకరం . ఈ విధమైన వ్యవహారాల తో చేస్తున్న గణపతి పండుగ యే అనేకులకు ఓ విశిష్టత , ఒక పెద్ద వినోదం (ఎంటర్టైన్మెంట్) . ఎందుకంటే వారందరి జీవితాలు ఒత్తిడి తో నిండిపోయాయి కాబట్టి ఈ రకమైన వినోదం అవసరం .
• నేడు గణపతి గురించి ఇంతకు మించి గొప్ప గా చెప్పుకోవడానికి, సమాజం లో మనిషి దగ్గర ఏమైనా సమాధానం ఉందా ? . . . అంటే అది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది. ఎందుకంటే, నేడు అందరూ కాస్త అటుఇటుగా చూస్తున్నది, చేస్తున్నది, ప్రోత్సాహిస్తున్నది ఇదే కదా . భగవంతుని పై ఈ భక్తి ఒక వినోదం , కాలక్షేపం . అందుకే ఇది కలికాలం, మాయా కాలం, పోయే కాలం, వినాశన కాలం .
• అసలు వినాయకుడు గురించి మనం మన తరాలకు ఏం చెపుతున్నాం ? అంటే ఒక అద్భుతమైన కధ . ఇది కల్పితమా ? వాస్తవమా? అనేది మనిషి చిన్ని మేధస్సు కు తెలియదు . . . శివుడు తపస్సు చేసి చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంతలో పార్వతీ దేవి ఒక బాలుడు ని కాపలా పెట్టి స్నానానికి వెళ్ళింది. ఆ బాలుడు శివుడి ని అడ్డగించడం వలన శివుడు కోపంతో ఆ చిన్న బాలుడి తల నరికేశాడు. ఆ తర్వాత పార్వతి దేవి ఏడుస్తూ ఉంటే శివుడు ఏనుగును చంపి , దాని తలను ఆ బాలుడికి అతికించాడు . అసలు వింటుంటే, వినాయక వ్రత కల్ప పుస్తకం లో ఇదంతా చదువుతూ ఉంటే ... ఆహా ఎంత అద్భుతం . అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనిషి మనస్సాక్షి గుడ్డిది అయిపోయింది కాబట్టి .
• ఇలాంటి కధలు ఎవరు రాసారో, ఎందుకు రాసారో ఆ భగవంతుడికి కూడా తెలియదు .
• శివుడు సృష్టి కర్త . పరంజ్యోతి బిందు శక్తి స్వరూపుడు . శివుడు పరమాత్మ. శివుని కి దేహం లేదు కాబట్టి లింగాకారం చూపించారు. మరి శివుడు తపస్సు చేయడం ఏంటి ? ఆ తపస్సు ఎవరి కోసం చేసాడు ? సరే … సాధారణంగా తపస్సు పూర్తి చేసినవారు క్రోధం , అహం వంటివి జయించి శాంతమైన మనసు తో ఉంటారు. అటువంటిది , కనికరం లేకుండా అహం తో చిన్న బాలుడి తల , లోక రక్షకుడు అయిన శివుడు నరకడం ఏంటి ? వీటికి మనలో సమాధానాలు ఉన్నాయా ? ఆలోచించండి.
• అసలు శివుడు కి, శంకరుడికి తేడా గ్రహించ లేని స్థితిలో కధలు రాశారు. శివుడు సృష్టి చేస్తాడు . బ్రహ్మ విష్ణు శంకరులు శివుని యొక్క సృష్టి రచన . బ్రహ్మ ద్వారా స్థాపన , విష్ణువు ద్వారా పాలన , శంకరుని ద్వారా వినాశనం (మంచి కోసం, రీ సైక్లింగ్) జరుగుతుంది . శంకరుడు కూడా శివుని ని ధ్యానం తో స్మృతి చేస్తాడు.
☘️☘️☘️☘️☘️☘️☘️
• ఇకపోతే . . . వినాయకుడు . . . గణపతి .
ఓం గం గణపతయే నమః.
" ఓం " ఆత్మ నైన నేను
“ గం ” అనే స్వరం ఉచ్ఛారణ చేయడం వలన
“ గణ ” (గుణములు) శరీర నరముల చైతన్య స్థితి ని
“ పతియే ” నాయందు నిర్వహించు వానికి
“ నమః “ ప్రణామములు .
• ఈ గణపతి మంత్ర నామం నిత్యం సవ్యంగా 108 సార్లు , ఆ పైన ఉచ్చరించడం వలన మానవుని నరములు చైతన్యం అయి, మూలాధారం (నాభి కింది స్థానం) నుంచి సహస్రారము (తల పై) వరకు అనంతమైన విశ్వ శక్తి ప్రవహించును.
తద్వారా బుద్ధి వికాసం చెంది , ఆలోచనలు శ్రేష్టం అగును. అప్పటి వరకు మనిషి కలిగి ఉన్న ఆలోచనలలో చైతన్య శక్తి లేకుండుట వలన , ఏర్పడిన విఘ్నాలు ఆటంకాలు సమస్తం తొలగును. సమస్యలకు పరిష్కారం లభించును. అందుకే బుద్ధి కి చిహ్నం గా గణపతి ని చూపిస్తారు. నరములు చైతన్యం అవడం వలన గణిత శాస్త్రం లో ప్రావీణ్యం పొందుతారు .
గరిక గడ్డి తాకడం , వాసన పీల్చడం వలన నరముల లో దోషం నివారణ అగును . అందుకే గణపతి కి గరిక నివేదిస్తారు .
☘️☘️☘️☘️☘️☘️
• గణపతి కి ఏనుగు తల ఆపాదించి చూపించడం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. అదే మానవుని శ్రేయస్సు . రాబోయే యుగాలలో మనిషి బుద్ధి పూర్తిగా వికారాల లో మునిగి భ్రష్టు తో ఉంటుందని ముందే గ్రహించిన మునులు , అందు నుంచి బుద్ధి విముక్తి కోసం వినాయకుని పూజించమని తెలిపారు.
• విశాలమైన ఏనుగు చెవులు వలే , మనిషి తన చెవులను చేసి అనంతమైన సృష్టి జ్ఞాన విషయాలు వినాలని .
• ఏనుగు కళ్ల వలే మనిషి తన కళ్లు పెద్దవి గా చేసి జీవితం లో ప్రతీ అంశం పట్ల సూక్ష్మ దృష్టి , దూరదృష్టి , కలిగి ఉండాలని .
• ఏనుగు తల అంత విస్తారం గా మనిషి బుద్ధి మంచి ఆలోచనలతో కలిగి ఉండాలని .
• గణపతి పొట్ట అంత ఎక్కువగా మనిషి తనలో జ్ఞానాన్ని ఇముడ్చు కోవాలని .
• మనిషి స్థిరం గా ఉన్న ప్రదేశం లోనే ఉండి , ఏనుగు తొండం చాపి నట్లు గా సుదీర్ఘమైన శుద్ద సంకల్పాలు లోక కల్యాణం కోసం చేయాలని .
• మనిషి ఇన్నీ దైవీ గుణాలు కలిగి ఉంటూ , అహంకారం , ఆడంబరం లేకుండా ఉండాలని ఉద్దేశం తో అంత పెద్ద గణపతి ఆకారానికి చిన్న పీట చూపించారు.
• ఇక చివరిగా ఎలుక వినాయకుని వాహనం. అసలు ఇది వాస్తవానికి సాధ్యమే నా ? ఆలోచించండి . . . దీని సూక్ష్మార్థం వినాయకుడి అంత భారీ శరీరం మోసేది సూక్ష్మమైన ఎలుక వలే , అన్ని సుగుణాలు, లక్షణాలు, కలిగిన మనిషి శరీరాన్ని నడిపించేది సూక్ష్మమైన ఆత్మ అని తెలియ చేయడానికి ఎలుక తో వినాయకుడిని సృష్టించారు .
వినాయకుడిని పూజించడం వలన మనిషి మహా జ్ఞాని అవుతాడు .
ప్రతీ శుభకార్యానికి ముందు , వినాయకుని పూజ చేయడం వలన . . . మనిషి బుద్ధి లో ఉన్న వ్యర్ద (నెగెటివ్) ఆలోచనలు సంకల్పాలు సమాప్తం అయి , పాజిటివ్ ఆలోచనలు వృద్ధి చెంది , సత్బుద్ధి నొందడం ద్వారా మంచి శక్తి పొంది తలపెట్టిన శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం గా పూర్తి కాబడతాయి .
• నేటి మానవుడే , ఒకప్పటి సత్య, త్రేతా యుగాలలో దేవతా లక్షణాలు, దివ్య శక్తులు, బుద్ధులు కలిగి ఉండేవాడు . తరువాత కాలంలో ద్వాపర కలియుగాలలో ఆ మానవుడు అసురుడి లక్షణాలు కలిగి ఉంటాడు . అందుకు నిదర్శనం పైన ఉదహరించిన వికారమైన చేష్టలతో , బుద్ధి హీనత తో చేయకూడని విధంగా గణపతి భక్తి చేయడం.
భగవంతుని కోసం చేసే భక్తి పూజ వెనుక , దాగి ఉన్న సత్యమైన సూక్ష్మం తెలుసుకుంటేనే శ్రేష్ట ఫలితం లభిస్తుంది .
ఈశ్వరుని జ్ఞానం పరమ సత్యం .
సత్యాన్ని మనిషి అనేక సార్లు వింటాడు, చదువుతాడు , తెలుసుకుంటాడు. కానీ ఆచరించడు . ఎందుకంటే ఆచరిస్తే అందరితో వివాదాలు తలెత్తుతాయి అనే భయం .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 4 Sep 2025 , 9:30 PM .
No comments:
Post a Comment