ఆత్మ స్థితం
• ఆత్మ నైన నేను
పరమాత్మ ను చూస్తున్నాను .
• సూక్ష్మ బిందువైన నేను
శివుని స్మృతి యాత్ర ను చేస్తున్నాను .
• ఈ దేహం లో నేను ఉన్నాను .
ఈ దేహం
దహనమైనాక కూడా ఉంటాను .
• నా పేరు ఆత్మ .
మరణం లేని చైతన్యం నేను .
• ఆత్మ నైన నేను
పరమాత్మ ను చూస్తున్నాను .
• సూక్ష్మ బిందువైన నేను
శివుని స్మృతి యాత్ర ను చేస్తున్నాను .
• ఒకా నొక నాడు . . .
నా తండ్రి పరమాత్మ ను
విడిచి భూమి పై కి వచ్చాను .
• జన్మలు తీసుకున్నాక
బంధనాల వలలో
బందీ అయ్యాను .
• కర్మల గుహ్యం తెలియక
మాయ లో ఎన్నో
వికర్మలు చేశాను .
• భవ బంధాల లో ఎన్నడూ
సత్యత కాన రాలేదు
సరికదా . . . అవి
కర్మ బుణాలని తెలిసింది .
• ఐహిక భోగాల లో ఎన్నడూ
సుఖశాంతులు కాన రాలేదు
సరికదా . . . అవి
నీటి బుడగ లని తెలిసింది .
• ఈ గందర " గోళం " లో . . .
నా తండ్రి పరమాత్మ ను మరచి
అనాధ లా అయ్యాను .
• ఆత్మ నైన నేను
పరమాత్మ ను చూస్తున్నాను .
• సూక్ష్మ బిందువైన నేను
శివుని స్మృతి యాత్ర ను చేస్తున్నాను .
• ఈ దేహం లో నేను ఉన్నాను .
ఈ దేహం
దహనమైనాక కూడా ఉంటాను .
• నా పేరు ఆత్మ .
మరణం లేని చైతన్యం నేను .
గుహ్యం = రహస్యం
ఐహిక = ప్రాపంచిక
గోళం = భూమి
యడ్ల శ్రీనివాసరావు 6 Sep 2025 , 10:00 AM.
No comments:
Post a Comment