Friday, September 12, 2025

688 . ఇతరుల కోసం చింతించడం

 

ఇతరుల కోసం చింతించడం 


ఇతరుల కోసం చింతించడం వారి పట్ల శ్రద్ధ చూపడమేనా ?  . . . 

• బాల్యం నుండి ఆందోళన (Tension) చెందడం మరియు చింతించడం (Over Thinking) అంటే శ్రద్ధ చూపడం (Caring) అని తప్పుగా నమ్ముతూ వచ్చాం .  మనం  బాల్యం లో తల్లిదండ్రులతో   పెరుగుతాము . మనం పుట్టిన వెంటనే , నిజానికి మనం పుట్టకముందే , తల్లి కడుపులో ఉన్నప్పుటి  నుంచి  కూడా వారితో ఉన్నప్పుడు , వారు తమ ఆలోచనలు, పదాలు మరియు చర్యల ద్వారా ఈ నమ్మకాన్ని మనపై ప్రసరింప చేస్తారు .

ఆత్మలైన  మనం ,  తల్లి తండ్రుల భావాలను ప్రసరింప చేయటమే  కాకుండా వాటిని గ్రహిస్తాము .

మనం పెరిగేకొద్దీ , మన స్నేహితులు , తోబుట్టువులు , జీవిత భాగస్వామి మొదలైన వారితో సహా  మనం కలిసి ఉన్న  ప్రతి ఒక్కరి నుండి  ఈ తప్పుడు విశ్వాసం  సూక్ష్మంగా మరియు  శారీరక స్థాయిలో  మనకు చేరి నెమ్మదిగా  మనం దీనిని అంగీకరించడం ప్రారంభిస్తాము .

• ఇతరులపై ఆందోళన (Tension) మరియు చింతన (Over Thinking) చూపించడం అనేదే శ్రద్ధ వహించడం (Caring), అనే నమ్మకం పూర్తిగా నిజం అని భావించి మన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు కూడా ప్రసారం చేస్తాం. అందుకే ఎంతో కొంత ఈ నమ్మకం ప్రకారం జీవించని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరు.


• పైన పేర్కొన్న ఆందోళన (Tension)మరియు చింతన(Over Thinking) అంటే శ్రద్ద చూపడం(Caring) అనే ఈ నమ్మకం , సాధారణంగా మనం ఆఫీసు నుండి ఇంటికి తిరిగి రావడానికి కొన్ని నిమిషాలు ఆలస్యం అయినప్పుడు చూడవచ్చు . ఇంటికి చేరుకున్న తర్వాత, మన కుటుంబ సభ్యులు మనం ఎక్కడ ఉన్నాము మరియు ఎందుకు కాల్ చేయలేదని అనేక ప్రశ్నలు అడుగుతారు . వారు ఆ సమయంలో చేసిన అనేక ప్రతికూల ఆలోచనలు (Negative Thoughts) అంచనాల గురించి కూడా తెలియజేస్తారు . . . ఎందుకు? ఎందుకంటే వారు మన గురించి ఆందోళన (Tension ) చెందారు. వారు ఆవిధంగా ఆందోళన చెందారని వినిన  మనం ఆశ్చర్యపోతాము .

ఎందుకంటే వారు అంత గట్టిగా ఆలోచించడం వలన మనకి ఆలస్యం అయింది అని కాదు కాని,   మేము మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నందున మేము మీ కోసం చింతిస్తున్నామని  మన కుటుంబ సభ్యులు వివరిస్తుంటారు .

 కానీ చింతించడం అంటే పట్టించుకోవడం కాదు. చింత అంటే భయం లేదా ఆందోళన . సంరక్షణ అంటే ప్రేమ లేదా పట్టించుకోవటం . ఈ రెండు కూడా పూర్తిగా వ్యతిరేక భావోద్వేగాలు .  అవి ఒకే  సమయంలో కలిసి ఉండజాలవు .


☘️☘️☘️☘️☘️☘️


• ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటంలో చింతించడం కంటే నిజమైన ప్రేమ ఎలా ప్రయోజనకరంగా అవుతుందో  మనం చూద్దాం.

మనమంతా సూక్ష్మ స్థాయిలో, కనిపించని విధంగా ఒకరికొకరం అనుసంధానం (Attach) అయి ఉన్నాము,  ఈ అదృశ్య రీతిలోనే (Invisible) మన అందరి మధ్య నిరంతరం కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. మనం ఇతరులకు శక్తిని పంపడమే కాకుండా ఇతరులు ప్రసరించే శక్తిని కూడా తీసుకుంటాము . మన జీవితంలో ప్రతికూల పరిస్థితులలో ఇది సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఎలా పని చేస్తుందో ఒక ఉదాహరణతో ఈ విధంగా చెప్పవచ్చు.

• మీ అబ్బాయి క్లాస్ టీచర్ , ఫోన్ చేసి స్కూల్  ప్లే గ్రౌండ్ లో  ఆడుకుంటుండగా , మీ బాబు గాయపడ్డాడని  చెప్పారనుకుందాం .  ఆందోళన తో చింతించాల్సిన పని లేదని ఆమె మీకు చెప్పి ,  వచ్చి మీ బాబు ను స్కూల్ నుండి తీసుకొని వెళ్ళమని చెప్పారు .

ఈ సమయంలో మీ బాబు బహుశా భయం , ఒత్తిడి, ఆందోళన మరియు దుఃఖం యొక్క ప్రతికూల శక్తిని తన నుంచి బయటకు ప్రసరింపజేస్తున్నాడు .

బాబు క్షేమంగా ఉన్నాడని టీచర్ ఫోన్ లో మీకు తెలియచేసినప్పటి నుంచి,  మీ బాబు మీలో ఉన్న ఆధ్యాత్మిక  లేదా   మానసిక శక్తిని సహజంగా పొందుతూ ఉంటాడు . ఎందుకంటే మీరు మీ బాబు గురించి, ఆ క్షణం నుండి ఆలోచించడం మొదలు పెట్టారు కాబట్టి .

మీరు బాబు ను తీసుకురావడానికి  తన స్కూల్ కు  డ్రైవింగ్  చేస్తున్నారు.  ఈ సమయంలో, మీరు తనకు దూరంగా ఉన్నందున అతను ఉన్న పరిస్థితి గురించి మీకు కొంత అవగాహన మాత్రమే ఉంటుంది. యదార్థ పరిస్థితి గురించి ఆలోచించడం ఊహించడమే అవుతుంది మరియు ఇది మీ మానసిక శక్తిని వృధా చేయడం అవుతుంది.

• మీరు ప్రతికూల ఊహలలో ఉండి, అంటే మీరు ఆందోళన చెంది భయపడుతూ ఉంటే, మీరు అతనికి అదే భయం యొక్క ప్రకంపనలను , ప్రతికూల శక్తిని పంపుతున్నారు, దానినే అతను తీసుకోబోతున్నాడు .

  మీ  నుంచి వెలువడుతున్న ఆందోళన అతనికి ఏవిధంగానూ శక్తిని ఇవ్వకపోగా  అతనిని బలహీనపరచి , అది  తిరిగి  డ్రైవింగ్‌ లో ఉన్న మిమల్ని భంగపరుస్తుంది .

 వాస్తవానికి  మీరు చింతించాల్సిన పని లేదని ఇది వరకే టీచర్ మీకు చెప్పింది , అయినా మీ బాబు కొంచెం కష్టమైన భావోద్వేగ పరిస్థితిలో ఉన్నాడని మీరే  అనుకుంటారు.


• అసలు ఇప్పుడు అతనికి ఏం కావాలి ? మీరు పాఠశాలకు చేరుకోవడానికి, అతనికి సహాయాన్ని అందించడానికి కొంత సమయం తీసుకుంటారు కనుక అతనికి ఇప్పుడు మీ సూక్ష్మమైన శక్తి చాలా  అవసరం.

 మీరు ఆందోళన లేదా సంరక్షణ అని తప్పుగా పిలవబడే భయం యొక్క మీ ప్రతికూల ప్రకంపనలా ? . . .  లేదా . . .   మీ నిస్వార్ధ  ప్రేమ, మీ శుభాశీస్సులా ?

దూరం గా  ఉన్న మీరు అతనికి సహాయాన్ని ఇవ్వడానికి ఏమి పంపుతారు ? చింతన తో కూడిన ప్రకంపనలా (Vibrations)  లేక అతనికి మీరిచ్చే శుభాశీస్సులుగా  ప్రేమ ప్రకంపనలా ? ఆలోచించండి .

మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ  యొక్క ప్రేమ ప్రకంపనలు మిమ్మల్ని  మరియు బాబు ను సానుకూల స్థితిలో ఉంచుతాయి.

• అసలు, సంరక్షణ లేదా పట్టించుకోవటం అంటే ఏమిటి? సంరక్షణ అంటే మీరు మరొకరికి సహాయం చేయడానికి మీ సానుకూల అంతర్గత ఆధ్యాత్మిక కాంతిని పంపడం . 

ఆందోళన వలన ఖచ్చితంగా ప్రయోజనం ఉండదు .

• ఒకరి శ్రేయస్సు కోసం , మనలోని శుభకరమైన ఆలోచనలను ఆలోచిస్తూ ఉంటే, ఆ ప్రకంపనలు వారికి చేరుతాయి. ఇలాగే ప్రతికూల తో (Negative ) ఆలోచనలు చేస్తే అవి కూడా వారికి చేరుతాయి .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 


యడ్ల శ్రీనివాసరావు  13 Sep 2025 , 5:00 AM.


No comments:

Post a Comment

688 . ఇతరుల కోసం చింతించడం

  ఇతరుల కోసం చింతించడం  ఇతరుల కోసం చింతించడం వారి పట్ల శ్రద్ధ చూపడమేనా ?  . . .  • బాల్యం నుండి ఆందోళన (Tension) చెందడం మరియు చింతించడం (Ov...