Monday, May 30, 2022

191. మధురమైన రోజు ….మరపు రాని రోజు

 

మధురమైన రోజు ….మరపు రాని రోజు



• మధురమైన రోజు 

  మరపు రాని రోజు

• జన్మకు ఒక రోజు

  అదే జీవితానికి అర్థం తెలిసిన రోజు.


• పడిలేచే బాల్యం 

  పలకలతో గడిచింది.

• కలలు కన్న కౌమారం 

  కలవరమై కరిగింది.

• ఉప్పొంగే యవ్వనం 

  ఉరకలతో పొర్లి పారింది.

• రంగుల జీవితం 

  ఆశల హరివిల్లు తో నిండింది.


• మధురమైన రోజు

  మరపు రాని రోజు.

• జన్మకు ఒక రోజు

  అదే జీవితానికి అర్థం తెలిసిన రోజు.


• పడిలేచే మనసులతో 

  జీవన పయనమే సాగింది.

• మనసులు మను‌షులు 

  ఒకటి కాదని కాలమే చెప్పింది.

• ఆటపాట లాశలన్ని 

  ఆటుపోటులు అయ్యాయి.

• దిశ లేని ఈ తార వెలుగు 

   అడవి పాలయ్యింది.


• మధురమైన రోజు రానే వచ్చింది.

• మరపురాని రోజు అవనే అయ్యింది.


• పరమాత్ముని అంశ 

  ఆ రోజు  ఈ తారనే తట్టింది.

• దిశ లేని తారకి 

  ఆ సుదర్శనమే  దశ  అయ్యింది.

• కర్మ బంధనాలు అన్నీ 

  బుణపాశములని చెప్పింది.

• నిదురించే ఆత్మను 

  మేలుకొలుపు చేసింది.

• చీకటి లో నీడను 

  చూసే భాగ్యమే కలిపించింది.




• మధురమైన రోజు 

  మరపు రాని రోజు

• జన్మానికి ఒక రోజు

  అదే జీవితానికి అర్థం తెలిసిన రోజు.


యడ్ల శ్రీనివాసరావు 30 May 2022 9:00 PM.




Sunday, May 29, 2022

190. ఏడుకొండల వాడా... ఏమియు నిండని వాడ

 

ఏడుకొండల వాడా... ఏమియు నిండని వాడ


• ఏడు కొండల వాడా… ఏమియు నిండని వాడ

• నిత్య సేవలతో   

  నీకు   నిత్య కళ్యాణము  

  చేయ   కమల  కాంతుల  వాడా.

• కనక   కాంతల తోడ   

   పవళించి   పాలించే  పుడమిని   

   నీ పాదముల నీడ.



• ఏడు కొండల వాడా …. ఏమియు నిండని వాడ

• సిలుగు   ముడుపు  కట్టిన   వారికి 

  సిరులు  మదుపుగ   పెట్టిన వాడ.

• కాలినడకన    చేరు    వారికి   

  కోటి అభయముల  నిచ్చు వాడ ...  కోదండ వాడ.



• ఏడు కొండల వాడా …. ఏమియు నిండని వాడ

• నిలువు   దోపిడి  నిచ్చినా   

   కుండ నిండని వాడ. ...  ఏడుకొండల వాడ.

• నల్ల బంగారమై   నల్లమల లో   

   వెలసిన   నవనీత    నీరజోదరుడా.



• ఏడు కొండల వాడా …. ఏమియు నిండని వాడ

• చంద్రకాంతుల చేత  

  పారిజాతములు  పూయించి 

  నిత్య  వైభోగము తో   వెలిగే   వైకుంఠ  వాసా  

  శ్రీ నివాస   శ్రీ   శ్రీ నివాస.

• ఏకాదశి నాడు   గరుత్మంతుని  తోడ  

  ముక్కోటి   దేవతలతో  

  భువికి  చేరిన  వాడ  ….  వైకుంఠ నాధ.



• ఏడు కొండల వాడా…ఏమియు నిండని వాడ.

• ఆది శేషమున  శయనించి 

  చిబుకము   చిన్న   బుచ్చుకొని  

  చిలిపిగా చూసేవు    

  శ్రీమహాలక్ష్మిని .... శ్రీమంతుడా.

• గిల్లి కజ్జాల తో 

  గిరులు  గిరులు   తిప్పించి 

  గుజ్జను  గుళ్లు  ఆడించే  

  ఆనంద వాస   శ్రీ శ్రీ నివాస.



• ఏడు కొండల వాడా …. ఏమియు నిండని వాడ

• భూదేవి భారమును 

  శ్రీదేవి  సిరులతో   తుల్యము  చేసిన వాడ  

  తామర   కనుల వాడ.

• మనువు   మనసు కి  కాదు   మూలం 

  మనసు  మనసుకే   నన్న  

  కలి  సత్యవాస   శ్రీ శ్రీ నివాస.


ఏడు కొండల వాడా… ఏమియు నిండని వాడ... 

• శ్రీ నివాస …. శ్రీ శ్రీ నివాస ... శ్రీ వెంకటేశా.



సిలుగు = కష్టము, బాధ.

నీరజోదరుడు =ముత్యము వంటి వాడు.

తుల్యం = సరి సమానము


యడ్ల శ్రీనివాసరావు 29 May 2022 , 10:30 PM.








Saturday, May 28, 2022

189. చిత్రం….శివయ్య...విచిత్రం

 


చిత్రం….శివయ్య....విచిత్రం


• ఎంత దూరమయా….ఎంత భారమయా

  ఎంత వేదనయా.…ఎంత రోదనయా…. శివా


• నీ జాడ కోసం ఏడేడో వెతికితి

  నీ నీడ కోసం ఏడెడో సాకితి

  నీ ఆన కోసం ఎన్నాళ్ళ వేచితి

  నీ చూపు కోసం ఎన్నేళ్ళో చూసితి


• శివా ఇది యేమి చిత్రం….

  ఇది యే నీ విచిత్రం హర.


• ఎంత దూరమయా….ఎంత భారమయా

  ఎంత వేదనయా.…ఎంత రోదనయా…. శివా


• దూర భారము ఎరుగక 

   నా మనసు దివ్యమున

• కొలువు కాచిన నిన్ను 

  కానలేకున్నానయా శివా

• అల్పుడనై ఉన్నాను 

   హర…హర హర.


• వేద రోదనల నడుమ

  నా బుద్ది తేజమున

• నిలిచిన  నీడ వై  ఉన్నా   

  స్పర్శలేకున్నానయా  శివా….

• మందకోడి నై ఉన్నాను శివ…శివ శివ.


• ఎంత దూరమయా….ఎంత భారమయా

• ఎంత వేదనయా.…ఎంత రోదనయా…. శివా


• నీ జాడ కోసం ఏడేడో వెతికితి

  నీ నీడ కోసం ఏడెడో సాకితి


• నీ జాడ కోసం 

  జగమంత వెతికితే

• జగమునే నా లోన   లో లోన  

   జాగృతం చేసావయా.


• నీ నీడ కోసం 

  నేలంత సాకితే

• వెన్ను లో దన్ను యై 

   వెన్నంటి నెలవుగా నిలిచావయా.


• శివా ఇది యేమి చిత్రం….

  ఇది యే నీ విచిత్రం హర.


• ఎంత దూరమయా….ఎంత భారమయా

• ఎంత వేదనయా.…ఎంత రోదనయా…. శివా


• నీ ఆన కోసం ఎన్నాళ్ళ వేచితి

  నీ చూపు కోసం ఎన్నేళ్ళో చూసితి.


• నీ ఆన కోసం  ఎన్నాళ్ళ వేచిన

  ధ్యానము న   భావనలు 

  నీ ఆనలే  నని  తెలియలేదయా.


• నీ చూపు కోసం   ఎన్నేళ్ళో  చూసినా

  కనులు ముందే నీవు 

  నిలిచి ఉన్నావని తెలియలేదయా.

  మాయ ముసుగులో కానలేదయా  శివయ్య.


• శివా ఇది యేమి చిత్రం….

  ఇది యే నీ విచిత్రం హర.


యడ్ల శ్రీనివాసరావు 28 May 2022 11:30 pm.







Friday, May 27, 2022

188. ఊహలు ఊసులు

 

ఊహలు ఊసులు


ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• జపించిన జపము తో నిజమాయెను కలలు.

• కరుణించిన కాలము లో కలిసిపోయెను కవళికలు.


స్పర్శ కి స్పర్శ తోడైన  నీడంతా ఆయెను వెన్నెల వాడ.

• సిరి రాగము ల తోడ శృంగారము జాడై నిజమాయెను ఊహలు.




ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• ఆరేసిన అందంతో మెరిసెను మెరుపుల కాంతులు.

• ఆశల జల్లులతో తడిచెను తలంబ్రాల సొగసులు.


శ్వాస  కి  శ్వాస  జతైన  వేళన   ఊపిరులే  ఆయెను చిరు చెమటలు.

• కురులు తెరలుగా ఎగిరి ముఖమును తాకుతుంటే నిజమాయెను ఊసులు.




ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• ఇసుక తిన్నె చందముగా విరిసెను కాంతన కటి కనకము.

• ఒలికిన ఒయ్యారము ఒరిగెను నెలవంక లా


• ధ్యాస తో ధ్యాస లీనమైన ఊహలే  ఆయెను హేలలు.

• తారలు తమ ఉనికి కై వెతికినపుడు నిజమాయెను ఈ ఊహలు ఊసులు.


ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.



కవళికలు = మార్పులు

వాడ = ప్రదేశం.

హేలలు = విలాసాలు , శృంగార చేష్టలు


యడ్ల శ్రీనివాసరావు 27 May 2022 11:00 PM.





Thursday, May 26, 2022

187. నీ సేవ కే _ నీ బాట కే

 


 నీ సేవ కే _ నీ బాట కే



• ఈ జీవితం   నీ సేవ కే

  ఈ జీవితం    నీ బాట కే

• ఓ బాబ

  శివబాబా

  బ్రహ్మ బాబా

• ఈ జీవితం   నీ సేవ కే

  ఈ జీవితం    నీ బాట కే

• జ్ఞానమనే   సంపదనిచ్చావు

   ప్రేమతో     శాంతినిచ్చావు

   నీ బడి కే    పిలిచావు

   నీ ఒడి లో   నిలిపావు.


• ఓ బాబ

  శివబాబా

  బ్రహ్మ బాబా

• ఈ జీవితం నీ సేవ కే

  ఈ జీవితం నీ బాట కే

• దారి  తెలియని  అంధుడినై

  దుఃఖం లో   దహనమవుతుంటే

  జ్యోతి వై   దారి చూపి  

  సంధుడి లా    స్పూర్తితో   

  సహనం  నింపావు.


• అయిన  వారి   ఆగడాలకు 

  ఆత్మక్షోభణ   మవుతుంటే.

  పరమాత్ముని  వై వచ్చి 

  ఆత్మకు  అసలు  వాడివయ్యావు.


• ఓ బాబ

  శివబాబా 

  బ్రహ్మ బాబా

• ఈ జీవితం నీ సేవ కే

  ఈ జీవితం నీ బాట కే

• జ్ఞానమనే   ధనమునిచ్చావు

   ప్రేమతో    శాంతినిచ్చావు.

   నీ బడి కే     పిలిచావు

   నీ ఒడి లో   నిలిపావు.


• జీవించి  ఉన్న   జీవితం లో

  నాడు   జీవి పడే   నరకము నే   చూసాను.

• జీవం  చాలించిన   జీవినై 

  నేడు జీవితము లో 

  స్వర్గము నే చూస్తున్నాను.


• నీ సేవతో ఎదగాలని

  నీ చెంతనే ఒదగాలని

  అడుగుతు నే ఉన్నాను

  ప్రకృతి ని 

  వేడుకుంటూ నే    ఉన్నాను.


• ఓ బాబ

  శివబాబా

  బ్రహ్మ బాబా

• ఈ జీవితం   నీ సేవ కే

  ఈ జీవితం   నీ బాట కే

• ఈ బంధ  బంధీఖాన నుండి 

  ధర్మం గా   విముక్తి  చేసి

• వెను   చూడనీక

   నీ వెంట  తీసుకుపో

• మాట ఇవ్వు బాబా

  బాట చూపు బాబా.

• ఓ బాబ

  శివబాబా

  బ్రహ్మ బాబా.


యడ్ల శ్రీనివాసరావు 26 May 2022 10:00 PM.









Wednesday, May 25, 2022

186. Human Communication Nature Influence

 


Human Communication Nature Influence


• మన పూర్వీకులు, జ్ఞానులు, యోగులు, మునులు మానవాళి మనుగడకు అవసరమైన జీవన విధానాన్ని పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ భారత గ్రంధాల్లో పొందు పరిచారు. వారు భవిష్యత్తు ను మొత్తం దివ్య జ్ఞానం తో గ్రహించి లోక కళ్యాణం కోసం రాసారు. ఆ రోజుల్లో తాటాకు పత్రాలు సమాచార సాధనం లా వాడారు.


• అసలు సమాచారం ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయాలంటే మీడియం అనేది చాలా అవసరం. ఉదాహరణ కు సెల్ ఫోన్ లు. మానవుడు అభివృద్ధి అనేది సైన్స్ సాధనాల వలనే సాధ్యం అవుతుంది అనే భ్రమ లో ఉంటాడు. ఇది మనిషి లోని అజ్ఞానికి నిదర్శనం అనిపిస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో మునులు యోగ సాధన ద్వారా ఉన్న చోట నుంచి ఎంతో దూరంలో ఉన్న వారికి సమాచారం, కేవలం యోగశక్తి తో మనసులో తలుచుకుని పంపించేవారు. ఇది నేటికీ చాలా మంది లో కనిపిస్తుంది. ఎలా అంటే మనం అదే పనిగా గాని, లేదా అకస్మాత్తుగా ఎవరినైనా తలచుకుంటే వెంటనే రెండు మూడు రోజుల్లో వారే మనకు ఎదురు పడడం, లేదా మనకు వారే ఫోన్ చేయడం వంటివి జరుగుతుంది. దీనినే టెలీపతీ అంటారు. ఇది ఎక్కువగా meditation, sixth sense, intuitive power ఉన్నవారికి అనుభవం అవుతుంది. అంటే మనిషి ఆలోచన విద్యుత్ అయస్కాంత శక్తి. తరంగం వలె మారి ప్రకృతి లో కి ప్రవేశించి సంకల్పం సిద్ధి ద్వారా చేయవలసిన వారికి చేరి, వారి చేత మిమ్మల్ని ఏదో విధంగా తిరిగి సమాధానం ఇచ్చే లా చేస్తుంది. కాని మనిషి ఇది గ్రహించలేడు. ఎందుకంటే ఇదంతా కంటికి కనపడని చర్య.


• ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించ వలసింది ప్రకృతి గురించి. చాలా మంది ప్రకృతి అంటే ఆరుబయట కనిపించే ప్రపంచం అనుకుంటారు. ప్రకృతి అంటే పంచభూతాల సమ్మేళనం. ఈ సృష్టి ని నడిపించేందుకు దేవుడు తయారుచేసిన మీడియం. ఈ ప్రకృతి మీద ఆధారపడి ఈ సమస్త సృష్టి, జీవరాశులు మనుగడ సాధిస్తున్నాయి. కానీ అటువంటి ప్రకృతిని, నేటి కలి కాలంలో మనిషి చిన్నచూపు చూస్తు , అభివృద్ధి అనే ముసుగులో నాశనం చేస్తూ సృష్టి వినాశనం కోరుకుంటున్నాడు. చెట్లు నరకడం, మైనింగ్ గనులు తవ్వకం, పరిశ్రమల కాలుష్యం ఇలా ఎన్నో.


• ఒక మనిషి తనను ఎవరైనా బాధపడితే సహించలేక తిరిగబడతాడు. అటువంటిది ప్రకృతి ని నాశనం చెయ్యాలనుకున్నప్పడు, ప్రకృతి తిరిగిబడితే జీవి అనేదే మిగలదు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే మన చిన్నతనానికి ఇప్పటికీ ఈ 40, 50 సంవత్సరాల కాలంలో మనిషి చేసిన పొరపాట్ల వలన ప్రకృతి లో వాతావరణ మార్పులు చాలా వచ్చాయి. చూస్తూనే ఉన్నాం.


• ఏ మార్పు కైనా, మనిషి ఆలోచనా విధానం మూలకారణం. ఎలా అంటే ఒక మంచి ఆలోచన మనిషిని నిత్యం ఆనందంగా ఉంచుతుంది. అంటే పాజిటివ్ శక్తి ద్వారా వెలువడే తరంగాలు ప్రకృతి ఆమోదించి చైతన్యం అయి తిరిగి మనిషి కి సంతోషం ఇస్తుంది.

• ఈ రోజు వరకు కూడా సృష్టి లో మానవాళి ఎంతో కొంత ఇలా నడుస్తుంది అంటే కారణం కేవలం కేవలం కొంతమంది వలనే. వారు ఎవరో కాదు, యోగులు, ధ్యానులు, జ్ఞానులు వారు వెలువరించే పాజిటివ్ శక్తి ని ప్రకృతి తీసుకుని చైతన్యం అవుతుంది కాబట్టి నెగెటివ్ ఎనర్జీ ఉన్నవారు అంటే చెడు , దుష్ట ఆలోచనలను ప్రకృతి లో కి వెలువరించే వారు కూడా విర్రవీగుతూ ప్రశాంతంగా మనుగడ సాగిస్తున్నారు.


• నేటి కాలంలో మనిషి జీవన వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అందరికి తెలుసు. అనారోగ్యం, దుఃఖం, ఆహరకొరత ఇలా ఎన్నో సమస్యలు. దీనికి మనిషే స్వార్థం తో కూడిన ఆలోచనలు కారణం. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు, అని తెలిసినా పరిధి దాటి ఒక మంచి ఆలోచన ప్రకృతిలోకి విడవలేక పోతుంటారు.


• ఉదాహరణకు ఒక పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థం కలుషితమై ఆ చుట్టుపక్కల ప్రాంతం నివాసయోగ్యం కాకుండా పోతుంది. అలాగే మనిషి చేసే వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ ఆలోచనలు తెలియకుండానే ప్రకృతిని నిరంతరం కలుషితం చేస్తున్నాయి.


• ఒక చిన్న కుటుంబం లో ఎవరైనా సరిగా లేకపోయినా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయి నాశనం అవుతుంది. మరి అలాంటిది ఈ ప్రకృతి కుటుంబం లో ఉన్న ప్రతీ మనిషి సవ్యమైన, సక్రమమైన, హాని కలిగించని ఆలోచనలు కలిగి ఉంటేనే కదా ప్రకృతి సజీవమై చైతన్యం అవుతుంది , మనిషి జీవనం సుఖవంతం చేస్తుంది.


• దీనికి ప్రతీ మనిషి చేయవలసింది ఒకటే ధ్యానం, యోగం. ఖర్చు లేని దివ్యౌషధం. ప్రతీ రోజు ఒక అరగంట ధ్యానం యోగం చేస్తూ, మన మెదడు కి విశ్రాంతి కలిగించడం వలన ( electro magnetic system) కరెక్ట్ గా పనిచేస్తు మంచి ఆలోచనలు ఉద్భవించి మంచి శక్తి కలుగుతుంది. ప్రకృతి కూడా మనిషి కి సంహరిస్తుంది. లేకపోతే, తల్లి ప్రకృతి కి పిల్లలైన మనం వికృతం లా కనబడతాం. ఒక యంత్రం విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేయడం వలన కొంతకాలానికి సామర్థ్యం తగ్గిపోతుంది. అదే మధ్యలో విశ్రాంతి ఇవ్వడం వలన యంత్రం ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా నిత్యం లేచినా, పడుకొని ఉన్నా మనిషి మెదడు ఏదోక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. ధ్యానం చేయడం వలన వ్యర్ద ఆలోచనలు పోయి పూర్తిగా తాజా గా అవుతుంది.


• నిజం చెప్పాలంటే అభివృద్ధి అనే ముసుగులో అంధుడిలా నేటి మనిషి జీవనం గడుస్తుంది. ఎందుకంటే తనచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితి మరియు తన లో లో ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితి నేటి మనిషి దుస్థితి. ఇది మాయ యొక్క గొప్పతనం.


• ఒకసారి ఆలోచించండి చాలా మంది మనుషుల మధ్య, కుటుంబాలు మధ్య గొడవలు సమస్యలు చూస్తుంటాం. ఇవి ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించండి. కొందరు చెప్పేది అహం వలన అంటారు . అది సరికాదు. మనుషుల మధ్య సమన్వయం లోపించడం వలన, అంటే సరియైన మాట తీరువు లేక పోవడం వలన, లేదా చెప్పాలనుకున్నది ఎదుటి వారు అర్దం చేసుకోలేకపోవడం వలన పరస్పరం కమ్యూనికేషన్ లోపం ఏర్పడటం వలన సమస్యలు వస్తున్నాయి. మనిషి ఆలోచన లో బలం ఉంటే మాట స్పష్టంగా వస్తుంది. అప్పుడు అది ఇతరులు సరిగా అర్ధం చేసుకోగలరు. కమ్యూనికేషన్ సరిగా లేకపోతే అస్తవ్యస్తం అవుతుంది. ఇదే మనిషి దుఃఖానికి అతి పెద్ద సమస్య. ప్రతీరోజూ కొంత సమయం మంచి పుస్తకం చదవడం చాలా ఉన్నతిని కలిగిస్తుంది. ఇదంతా మనిషి తన కోసం, మన భావి తరాల సుందర జీవితం కోసం. నిజాన్ని అంగీకరించడం నేర్చు కోవాలి. సాటి మనిషికి ఉపయోగపడే తెలియని విషయాలను చెప్పి సహాయం చెయ్యాలి.


• రాను రాను మనిషి సాటి వారికి మంచిని పెంచడం లోను, పంచడం లోను చాలా శక్తి హీనుడు అవుతున్నాడు. అందుకు ఉదాహరణ నేటి కుటుంబ వ్యవస్థ లోని పిల్లల పెంపకం. మా వాడు నా మాట వినడు అని చాలా సహజం గా చెప్పుకునే పరిస్థితి వింటున్నాం. మరి మనం పిల్లలు గా ఉన్నప్పుడు అలాగే ఉన్నామా. ఏమైనా అంటే కాలం మారింది అని తెలివి తక్కువ సమాధానం చెప్పి తప్పించుకుంటాం. మారింది కాలంం కాదు, ఆ కాలాన్ని అర్దం చేసుకోలేక మనమే మారాం. ఎందుకంటే మనిషి తన ఓటమి తానుగా అంగీకరించడు.


• మనిషి ఇంకా ఈ భూమి కొన్నాళ్ళు సుభిక్షంగా ఉండాలంటే , ప్రతి మనిషి ఆలొచన స్పష్టం గా, అర్థవంతం గా, పారదర్శకంగా తనపట్ల మరియు ఇతరుల పట్ల ఉండాలి. అప్పుడు ప్రకృతి లో కమ్యూనికేషన్ వ్యవస్థ సారవంతం అయి, ఎన్నో విపత్తులను ఆపగలదు. ప్రతీరోజూ ధ్యానం చెయ్యాండి. మీ ఆరోగ్యం, కుటుంబం, సృష్టి ని కాపాడుకోండి.


యడ్ల శ్రీనివాసరావు 25 May 2022 4:00 pm.




Tuesday, May 24, 2022

185. అందం_మకరందం

 

అందం_మకరందం


 జీవితమే అందం

• నేను…..

• ఎగిరే తుమ్మెద నైతే  ఎద కేమి భారం.

• నడిచే హంస నైతే    నగవు కేమి రోగం.

• పలికే కోకిల  నైతే    ప్రేమ కేమి భావం.

• విరిసే నెమలి నైతే   అందాని కేమి శోకం.

• ఒదిగే పాలపిట్ట నైతే  సంతోషాని కేమి లోపం.

• ముసిరే గోరింక నైతే  ఆలింగనాని కేమి తాపం.



జీవనమే మకరందం


• రంగుల పువ్వుల రాజసం….

• రసరంజన జీవన పోషకం.


• పచ్చని పొలాలు సౌందర్యం…

• కనువిందున సొంపైన సౌభాగ్యం.


• ప్రకృతి సెలయేరుల సామ్రాజ్యం…

• మదితలపున పరవళ్లాడే ఉల్లాసం.


• ఎగిరే కొంగల సమూహం…

• అదిరే పెదవులకు దరహాసం.


• కిలకిల పక్షుల శ్రావ్యాలు…

• సన్నని నరముల నాట్యానికి తకదిమిలు.


• హరివిల్లు ను విరిసే రంగులు…

• మేని ఛాయన ప్రకాశించే కాంతులు.


• వనమున ఊగే ఊడలు…

• హొయలాడే చెలి జఘనములు.



యడ్ల శ్రీనివాసరావు 25 May 2022, 1:30 am.







Monday, May 23, 2022

184. నరుడా ఓ నరుడా

 

నరుడా ఓ నరుడా


• నరుడా ఓ నరుడా

  ఎత్తిన జన్మము ఎక్కడది …

  చేసిన కర్మము ఎప్పటిది.

• సుఖము సుఖమని వెతుకుతావు 

   దుఃఖం తోనే ఉంటావు.

• ధనము ధనమని పరుగెడుతావు 

  దీనుడివై దిక్కులు చూస్తుంటావు.

  చివరకు ఒత్తిడి తోనే చాలిస్తావు.


• నరుడా ఓ‌ నరుడా

  వచ్చిన మార్గము ఎన్నవది …

  చేసిన సంచితము ఎప్పటిది.

• ముక్తి ముక్తి అని అంటావు ...

  నీ మూలమేమిటో మననం చేయవు.

• భక్తి భక్తి అని దేవులాడుతావు ...

   కోరికల తోనే వ్యాపారం చేస్తావు.

  చివరికి దేవుడికి వాటాలు ఇస్తావు


• నరుడా ఓ‌ నరుడా

  ఇచ్చిన భోగం ఎక్కడిది …

  చెప్పిన జ్ఞానం ఎవరది.

• దేహము దేహము అంటావు ... 

  దేహభిమాని వై ఉంటావు.

• చివరకు నీ  ఆత్మనెరుగక ...

  దేహి దేహి అంటావు.


• నరుడా ఓ నరుడా

  చింతలు చింతలు అంటావు ...

  చితిలో చిందులు తొక్కుతు ఉంటావు.

• మౌనము లోనే చింతకు ...

   పరిష్కారం దాగి ఉందని తెలుసుకోలేవు.

• గూడు గూడు అని అంటావు ...

  మేడలు మిద్దెలు కడతావు.

  చివరికి నీ ఎముకల గూడు ను దాచుకోలేవు.


యడ్ల శ్రీనివాసరావు 23 May 2022 , 10:30 AM.





Sunday, May 22, 2022

183. కవితా సంపెంగ

 

కవితా సంపెంగ

• పదమెరుగని కధనమునకు

• అలుపెరుగని ఆలోచనతో

• పూసింది ఈ కవితా పుష్పం.

• విరిసింది ఈ సంపెంగ రచన.


• కారుమబ్బులు కుమ్ముతుంటే

• కనురెప్పలు కలవరమైతే

• కమ్మని కోయిల కుహు కుహు అంటూ…రమ్మంటే

• చెలి చెంగు కప్పుకొని చెంగు చెంగున

• చెంగల్వ చెంతకు చేరగా


మేఘములు రాగాలై ఉరుములు శ్రావ్యాలై

మెరుపులు గీతాలై చినుకులు గానం చేస్తున్నాయి.


• స్వరాలు ఏరులై పారుతున్నాయి

• చెలి నాట్యం చేస్తుంది

• మయూరి మైమరచి చూస్తుంది.

• హరివిల్లు వర్ణాలను వలకపోస్తుంది.


• వర్షపు జల్లుల దారలు

• చెలి చెంపన ముత్యాలై జారుతూ ఉంటే

• తన దోసిలి చాలని చెలికాడు

• ముఖద్వారముతో నింపెను.

• చెలి శ్వాస నే రుచి చూసెను


• మేఘాల ఊహల్లో ఉరుములు జోలల్లో

• మెరుపులు కలలైతే చినుకులా తేలుతూ

• చెలి అడుగు”నే” చెలికాడు

• నడుము నొదలక నలుగుతున్నాడు.


యడ్ల శ్రీనివాసరావు 22 May 2022 11:30 PM.


https://yedlathoughts.blogspot.com
yedlasrinivasrao@gmail.com
WhatsApp +91 9293926810
              📞  +91 8985786810








Saturday, May 21, 2022

182. రాజ మహేంద్ర వరము

 


రాజ మహేంద్ర వరము



• రాజ రాజ వాసము….రాజుల నివాసము

• నర ఇంద్రుని ధామము….నరేంద్రుని స్థానము


• రాజమహేంద్రవరము

• రాజ రాజ నరేంద్రుడి నీవ నీత శ్యామము


• మహనీయుల చరితకు మకరంద ప్రస్థానం.

• సంస్కృతి కళలకు సంపన్న సుస్థానం.

• వితంతు వివాహాలు వధించిన సంస్థానం.


• కుల జాడ్యాలను కడిగేసిన కందుకూరి స్వస్థానం.

• ప్రకృతి వరములకు గమ్యస్థానం.

• రాజమహేంద్రవరము.

• రాజ రాజ నరేంద్రుడి నీవ నీత శ్యామము.


• పుడమి తల్లి పడపున పవళించిన పుణ్యనది గోదావరి.

• హరిత వల్లి హరంగా జనియించిన మహానది గోదావరి


• నన్నయ్య తత్వాల సాహితీ పోషకుల నిలయం

• దామెర్ల చిత్రాల సకల కళల వలయం.


• రాజమహేంద్రవరము

• రాజ రాజ నరేంద్రుడి నీవ నీత శ్యామము


• గోదావరి పాయలు ప్రకృతి అందాలకు అద్దం

• కాటన్ దొర ఆనకట్ట పురాతన కట్టడాల చందం


• రాళ్లబండి మ్యూజియాన పురావస్తు సేకరణల తో

• గౌతమి గ్రంధాలయాన మేధావుల ఖజానాలు దాగెను.


• రాజమహేంద్రవరము

• రాజ రాజ నరేంద్రుడి నీవ నీత శ్యామము


• కోటి లింగాల కాంతులతో ఆధ్యాత్మిక నిదర్శనాలు.

• గోదావరి పుష్కరాలే అంగరంగా వైభవాలు.


• రాజ రాజ వాసము….రాజుల నివాసము

• నర ఇంద్రుని ధామము….నరేంద్రుని స్థానము


• రాజమహేంద్రవరము

• రాజ రాజ నరేంద్రుడి నీవ నీత శ్యామము

 

(భూమాత ద్వారా సంప్రాప్తించిన ప్రశాంతమైన పుణ్యనది గోదావరి

 నేలను పచ్చని మాలగా చేసిన శాంతమైన మహనది గోదావరి)


యడ్ల శ్రీనివాసరావు 21 May 2022 6:00 PM.





Friday, May 20, 2022

181. సర్వం ఈ స్వరం

 

సర్వం   ఈ స్వరం


• ఓం నమఃశివాయ….ఓం నమఃశివాయ

• ఓం నమఃశివాయ….ఓం నమఃశివాయ


• సర్వం శివాయ….సత్యం శివాయ….శ్రేష్టం శివాయ

• శాంతం శివాయ….శవం శివాయ….శుభం శివాయ

• సకలం శివాయ….సహనం శివాయ….శరణం శివాయ

• సరళం శివాయ….సఫలం శివాయ….సతతం శివాయ

• ఓం….


• ప్రకృతి పాలిట ప్రాణనాధుడివై

• వికృతి పాలిట విరుపాక్షుడివై

• తాండవమాడే ప్రళయ రుద్రుడు వి

• విశ్వ లయా నికి నటరాజస్వామి వి.

• నిను ఏడ చూసేది….నిను ఎలా చేరేది స్వామి.


• ఓం నమఃశివాయ….ఓం నమఃశివాయ

• ఓం నమఃశివాయ….ఓం నమఃశివాయ


• రుద్రం శివాయ….రౌద్రం శివాయ….రూపం శివాయ

• రంగం శివాయ….రాగం శివాయ….రమ్యం శివాయ

• రణం శివాయ….రమణీయం శివాయ….రగడం శివాయ

• రచనం శివాయ….రక్షణ శివాయ….రంజనం శివాయ

• ఓం


• దక్షయజ్ఞాన సతీ దహనమున

• జటాజూటముతో వీరభధ్రుడివై

• తాండవమాడగా దేవతలందరూ

• శరణువేడిన శాంతి కాముకుడివి

• నీ శక్తి ఎవరికెరుక…నీ యుక్తి ఎవరికెరుక స్వామి.


• ఓం నమఃశివాయ….ఓం నమఃశివాయ

• ఓం నమఃశివాయ….ఓం నమఃశివాయ


• భైరవ శివాయ….భస్మం శివాయ….భవ్యం శివాయ

• భోగం శివాయ….భావం శివాయ….భృగుం శివాయ

• భరణం శివాయ….భగణం శివాయ….భువనం శివాయ

• భవితం శివాయ….భగవత్ శివాయ….భజనం శివాయ

• ఓం


• మెండు జీవులకు పుణ్యకృతుడివై

• చండ జీవులకు చండవధనుడై

• అజ్ఞానులకు ఆది గురువు వై

• సృష్టి రక్షణకు సర్వేశ్వరుడివి

• నీ పాదమెట్ట తాకేది….నీ నీడనెట్ట చేరేది స్వామి.


• ఓం నమఃశివాయ….ఓం నమఃశివాయ

• ఓం నమఃశివాయ….ఓం నమఃశివాయ


• జీవం శివాయ….జననం శివాయ….జావళి శివాయ

• అమరం శివాయ….ఆత్మం శివాయ….అచలం శివాయ

• కాలం శివాయ….కారుణ్యం శివాయ….క్రోధం శివాయ

• తానం శివాయ….తమకం శివాయ….తపం శివాయ


యడ్ల శ్రీనివాసరావు 21 May 2022 5:00 AM.






Thursday, May 19, 2022

180. ప్రియమతి

 

ప్రియమతి



1. ప్రియా! నీ

• ఉలుకుల్ పలుకుల్ తళుకుల్

• కలనెరింగి కాగలిగెన్ మెరుపుల్

• కలకలిగి దాచెన్ వలపుల్

• ప్రియమతి సుందర సుమతి.


• ఓ ప్రియురాలా నీ

• సిగ్గరితనం, మాటలు, ఓరచూపులు

• మెరుపుల వలె కనిపించినవి కలలో.

• కోరికలన్నీ కలలోనే దాచితిని.

• ప్రియమైన అర్థాంగి సౌందర్య సుమతి.



2. ప్రియా ! నీ

• వాలుజడ విన్యాసంబున హొయలాడే జడగంటల్.

• శయనీయంబున నాధునికై గుసగుసలాడెన్ వక్షంబుల్.

• ప్రణయుని రాకట పడెన్ పాపిడిపిందె తొలకరి సిగ్గున్ .

• ప్రియమతి సుందర సుమతి.


• ఓ ప్రియురాలా నీ

• వాలుజడ ఒయ్యారంగా జడగంటలు ప్రదర్శిస్తున్నాయి.

• నిద్రపోవు సమయమున ప్రియుని కోసమై ఎద రొమ్ములు రహస్యముగా సంభాషించుకుంటున్నవి.

• ప్రియుడి రాకతో , తొలిసారి సిగ్గుతో నుదిటి పాపిడి పిందె జారి పడి పోయెను.

• ప్రియమైన అర్థాంగి సౌందర్య సుమతి.



3. ప్రియా ! నీ

• చిద్విలాసంబున చిట్టి చిలుక చెంగు చెంగున్ చెంగున చేరెన్.

• తడబడిన తనువు తరుణిమన్ తమకమున తల్లడిల్లెన్.

• పలకలేమిన పలుకుల్ పదిలముగా పవళించెన్

• ప్రియమతి సుందర సుమతి.


• ఓ ప్రియురాలా నీ

• మనసున సంతోషముతో చిన్ని చిలుక నీకై ఎగిరి వచ్చి చీర చెంగు లో చేరింది.

• చలించిన నీ శరీర యవ్వనం శృంగారముగా కలవర పడింది.

• మాటలు ఏమీ మాట్లాడకుండానే నీ ఒడిలో చిలుక పొందికగా నిద్రపోయింది.

• ప్రియమైన అర్థాంగి సౌందర్య సుమతి.


యడ్ల శ్రీనివాసరావు 20 May 2022 1:30 AM.



179. ప్రేమ కాలం లో పద భాసలు

 


ప్రేమ కాలం లో పద భాసలు


• రాత ఒక జీవం….రచన ఒక వేదం.

• రచించిన రాతలే నా జీవన వేదం.


• నోటి మాటలు మారుతు కాలంలో కరిగి'పోతే.

• చేతి రాతలు చెరగక కాలంతో కలిసి ఉన్నాయి.


• ఊసులన్ని ఊహలై కాలంలో ఆవిరై'పోతే'

• గుండె కోతలు వాతలై కాలంలో కలవకున్నాయి.



• రాత ఒక జీవం….రచన ఒక వేదం.

• రచించిన రాతలే నా జీవన వేదం.


• మనసు వాక్యానికి  ప్రేమ భాస అవుతుంటే

• ప్రియుని శ్రావ్యానికి  ప్రేయసి ఆశ అవుతుంది.


• ఆశే ఆలాపనై ప్రేమకు  నీరాజనం అవుతుంటే

• ఆకాంక్ష తోని ఆరాధన  ప్రియురాలి పై

• అమరం అవుతుంది….అజరామరమవుతుంది.



• రాత ఒక జీవం….రచన ఒక వేదం.

• రచించిన రాతలే నా జీవన వేదం.


• పదము పవనమై….కావ్యంలా వర్షిస్తుంటే.

• పద కావ్యం చందనమై పరిమళమవుతుంది.


• ప్రియుని పై మోహంతో…ప్రేయసి మైనమవుతుంటే

• ప్రేమ జల్లు లో శిల శిల్పమై

• కరుగుతు ఉంది…ఒదుగుతు ఉంది.



• రాత ఒక జీవం….రచన ఒక వేదం.

• రచించిన రాతలే నా జీవన వేదం.


• రక్షణ మైన మనసుకి

• లక్షణ మైన మనిషి తోడైతే

• సులక్షణ మైన జీవితంతో…

• సంరక్షణ భాగ్యమై

• జీవన పునాది పడుతుంది.

• సహజీవనం సంక్రాంతి అవుతుంది.


యడ్ల శ్రీనివాసరావు 19 May 2022 8:00 PM.






Wednesday, May 18, 2022

178. ఎవరిని అడిగేది…ఏమని అడిగేది


ఎవరిని అడిగేది…ఏమని అడిగేది


• ఎవరిని అడిగేది….నే నెవరని అడిగేది.

• అందమైన లోకం లో అడుగులు వేస్తూ

• ఎవరిని అడిగేది…. నే నెవరిని అడిగేది.


• విధాత నడిగితే మౌనంగా చూస్తున్నాడు.

• విధిని అడిగితే వెకిలిగా నవ్వుతు ఉంది.


• కంట నీరు మాత్రమే చెపుతుంది నేనొక జీవమని.

• గుండె కోత మాత్రమే చెపుతుంది నేనొక జీవినని.


• ఎవరిని అడిగేది …. ఏమని అడిగేది.

• అందమైన లోకం లో అంధుడిలా తిరుగుతూ

• ఏమని అడిగేది …. నే నెవరిని అడిగేది.


• తల్లి భూమి నడిగితే తల్లడిల్లి చూస్తోంది.

• నీటి జాడ నడిగితే నా నీడే తెలియదంటుంది.


• రేయి పగలు మాత్రమే 

  చెపుతున్నాయి   నేనొక  స్పర్శనని.

• మూగ జీవాల రోదనతో 

  తెలుస్తోంది    నేనొక  ఆత్మనని.


• ఎవరిని అడిగేది …. నేనెవరని అడిగేది.

• అందమైన లోకం లో అడుగులు వేస్తూ

• ఎవరిని అడిగేది …. నేనెవరిని అడిగేది.


• అటుగా పోతుంటే 

  గులాబీల గుసగుసలు వినిపిస్తున్నాయి.

• ప్రేమకు ధైర్యం కావాలంట.

• ప్రేమిస్తే కలిసుండాలంట.

• ప్రేమిస్తే పిచ్చివారవకూడదంట.

• ప్రేమిస్తే చావకూడదంట.

• కానీ ... ఏమిటో ... ఆలస్యం అయింది.



యడ్ల శ్రీనివాసరావు 18 May 2022 , 7:00 pm










Monday, May 16, 2022

177. దాగుడు మూతలు

 

దాగుడు మూతలు



• మనసా మనసా మనసెరిగిన మనసా.

• మనసా మనసా మనిషి ఎరిగిన మనసా.



• ఎందుకు….ఎందుకు

• చిక్కినా చిక్కని…. దొరికినా దొరికని

• ఆట ఎందుకు… పాట ఎందుకు

• ఎవరేమన్నారని…..ఎదురెవరున్నారని.



• మతి తెలిసిన మనసా

• గతి ఎరిగిన మనసా

• స్థితి కలిగిన మనసా

• మనసెరిగిన మనసా

• ఎందుకు….. ఎందుకు

• ఈ ఆట ఎందుకు…ఈ పాట ఎందుకు.



• మనసా ఏమి కావాలి నీకు….

• నీలో దాగిన మనిషి తో ఆట ఏల….

• నీలో ఒదిగిన మనసు తో  దాగుడు మూతలేల.



• కనిపించే మనిషి నై

• కనపడని  నీ  మనసు తో

• ముడిపడి ఉన్నా…జతపడి ఉన్నా…విడవను అన్నా.


• కనపడని మనిషి వై

• కనిపించే నా మనసు తో

• ఆట ఎందుకు…పాట ఎందుకు….


• దాగని మనసుకు దాపరికమెందుకు.

• ఆగని తపనకు నిరోధనమెందుకు.


• ఉన్నది నీ కోసమే….నేనున్నది నీ కోసమే

• అన్నది నీ కోసమే…..నేనన్నది మన కోసమే.


• ఈ మాట నీది…ఈ రాత నీది.

• ఈ భాస నీది…ఈ శ్వాస నీది.

• ఈ మనసు నీది…ఈ తనువు నీది.

• ఈ ప్రాణమే నీది.


• జగమున జన్మ జన్మల గా  జతనై  ఉన్నా….ఏకాకి జీవిని.

• ఈ జన్మకు ఇంతేనా….మరు జన్మకు వేచేనా.


యడ్ల శ్రీనివాసరావు 17 May 3:00 AM.





176. సఖి కుసుమం

 

సఖి కుసుమం


• చెలి చెలి…. నా కై విరిసిన కుసుమాంజలి.

• సఖి సఖి…. నా కై వెలసిన హృదయాంజలి.


• నీ అడుగు జాడలో నిను అడగక ‘నే’ అడుగేసినా.

• నా మనసు నీడలో నిను కొలవక ‘నే’ కొలువిచ్చినా.

• నీ అడుగుతో ‘ని’  ఆందం నాకు  విడువ లేని బంధం.

• నా మనసుతో ‘ని'  చందం నీకు  మరువ లేని నందం.


•  ఏమి మాయో…..ఇది ఏమి హయో.

    ఇది ఏమి మాయో…..ఇది ఏమి హయో.


• చెలి చెలి…. నా కై విరిసిన కుసుమాంజలి.

• సఖి సఖి…. నా కై వెలసిన హృదయాంజలి.


• నవ్వే నీ పెదవుల పై  గువ్వై   ‘నే’ వాలాలి.

• చాచే నీ చేతుల పై   లాలి     ‘నే' కావాలి.


• తీగంటి నీ నడుమున తేనేటీగ  ‘నై’  తిరగాలి.

• వెన్నంటి నీ పాదమున కుసుమమై  ‘నే'  విరియాలి.


•  ఏమి మాయో…..ఇది ఏమి హయో.

    ఇది ఏమి మాయో…..ఇది ఏమి హయో.


• తలపంతా నీ వైపు తరుముతూ ఉంది.

• తనువంతా నా లోన తికమకతో ఉంది.


• నీ కనులకు నాపై కనికరం ఏనాడు.

• నీ మనసుకు నాపై పరవశం ఏనాడు.


• చూస్తున్నాను....

• చెలి చెలి.... నా కై విరిసిన కుసుమాంజలి.

• ఎదురు చూస్తూ ఉన్నాను....

• సఖి సఖి.... నా కై వెలసిన హృదయాంజలి.


యడ్ల శ్రీనివాసరావు 16 May 2022 2:00 PM.


*కొలవక = నీ మనసు తెలియకుండా, Measure చేయకుండానే

*నందం = సంతోషం, ఆనందం.



Saturday, May 14, 2022

175. సాగర సౌశీల్యం

 

సాగర సౌశీల్యం

• సరదాగా ఈ ఉదయం….సాగర వలయంలో

• తొలకరి మాటలతో గడసరి ఆటలతో ఒకటయితే

• ఉదయం కోరుతుంది అరుణం.

• వలయం అవుతోంది కధనం.


సాగర వలయం లో సరదాగా ఈ ఉదయం….. తొలిసారిగా మాట్లాడుతూ , గడసరి గా ఆటలు ఆడుతూ ఒకటిగా అయితే……ఉదయం కోరుకొంటుంది నుదుటి సింధూరం….కంఠమాల అవుతుంది ఒక కధ వలె.



• సరదాగా ఈ సాయం…..సాగర తీరంలో

• సడివడి నడకలతో బుడి బుడి అడుగులు వేస్తుంటే

• సాయం కోరుతుంది సంధ్య.

• తీరం తాకుతుంది వింధ్య.


ఈ అందమైన సాగర తీరం లో సరదాగా ఈ సాయంత్రం ….. శ్రావ్యమైన శబ్ధం తో   చిరు వేగంగా  చిన్ని చిన్ని అడుగులు వేస్తుంటే……సాయం కోరుతుంది సంధ్య …. తీరం  తాకుతూ ఉంది వింధ్య(పర్వతం).



• సరదాగా ఈ సమయం….. సాగర అఖిలం లో

• తడిపొడి వలువలతో చెరిసరి చేతులు జతయైతే

• సమయం కోరుతోంది సంగమం.

• అఖిలం అవుతోంది సంయోగం.


సమస్తమైన ఈ సాగరమున సరదాగా ఈ సమయం లో…..తడి పొడి బట్టలతో , పరస్పర అన్యోన్యత తో చేతులు జతగా కలిసినపుడు……కాలం కోరుతుంది కలయిక….. సమస్తం అవుతుంది పరిపూర్ణం.



• సరదాగా ఈ రేయి….సాగర గమనం లో

• అలజడి వదనంతో సొగసరి మనసు మౌనమైతే

• రేయి కోరుతుంది వెన్నెల

• గమనం అవుతోంది సుగమము.


సాగర ప్రయాణం లో సరదాగా ఈ రాతిరి…. ఆందోళన కలిగిన ముఖమును , అందగాడి మనసు నిశ్శబ్దం గా చూస్తుంటే……రాత్రి కోరుకుంటుంది వెన్నెల…..ఆ ప్రయాణం అవుతుంది సుందరము.


యడ్ల శ్రీనివాసరావు 15 May 2022 12:30 AM.





Friday, May 13, 2022

174. వేదన-రోదన

 

వేదన-రోదన


• వేదనే జీవితమై….రేయి పగలు గడుస్తొంది.

• రోదనే జీవనమై....బ్రతుకు బాట సాగుతుంది.


• కంటి వెలుగుకు మంటలు పెడుతూ…

• దారులన్నీ చీకటి చేస్తూ.


• కంట నీరుకి ఆవిరి పెడుతూ…

• దారలన్ని జలధారలు చేస్తూ.


• స్థిరమైన జగతిలో.…అస్థిరమైన తోడు తో

• మతి లేని మనిషి తో ….గతి లేని మనసుతో


• వేదనే జీవితమై….రేయి పగలు గడుస్తొంది.

• రోదనే జీవనమై....బ్రతుకు బాట సాగుతుంది.


• అందమైన లోకంలో అంధుడైన చందాన

• రణగొణ ధ్వనులనే రమణీయం చేసుకుంటూ


• వేదనే జీవితమై….రేయి పగలు గడుస్తొంది.

• రోదనే జీవనమై....బ్రతుకు బాట సాగుతుంది.


• ఉయ్యాల జంపాల తో ఊపిరి ఆడుతుంది.

• లబదబ శబ్దాలతో హృదయం ఆడుతుంది.

• ఆటల కోసమే ఈ శరీరం మైదానమై ఉంది.


యడ్ల శ్రీనివాసరావు 14 May 2022 , 11:00 AM.






Thursday, May 12, 2022

173. గోరువంక


గోరువంక


• గోరువంక ….ఓ గోరువంక….

• చూడు వంక…ఇటు నా వంక.

• గోరువంక ….ఓ గోరువంక….

• చూడు వంక…ఇటు నా వంక.


• కొండంత ఎగిరినా   గోరంత గువ్వవు.

• రూపంత నలుపైనా   గొంతంతా గమకము.


• చూపెంత చినదైనా   మనసంత మధురము.

• చిలుక ఎంత దూరమైన   అవని అంత ఆశ నీది.


• గోరువంక ….ఓ గోరువంక….

• చూడు వంక…ఇటు నా వంక.


• ఆటలు చూస్తావు   మాటలు వింటావు.

• ఆటలు ఆడుతూ    మాటలు చెపుతావు.


• చిగురులు తింటావు   చిలిపిగా ఉంటావు.

• చిగురులు తింటూ   చిలిపిగా చిలకరిస్తావు.


• గోరువంక ….ఓ గోరువంక….

• చూడు వంక…ఇటు నా వంక.


• గోరువంక ….ఓ గోరువంక….

• చూడు వంక…ఇటు నా వంక.


• పంజరమున ఒదిగి ఉన్నా

  రంజనమున నీవు మిన్న.

• బంధీఖాన జీవి వైనా

  బంధనమున నీవు మిన్న.


• మనిషి జన్మ ఎత్తకున్న మనసు సొగసు నెరిగినావు

• వలపు ఊసు ఎరగకున్న తలపు లెన్నో ఎరిగినావు.


• గోరువంక ….ఓ గోరువంక….

• చూడు వంక…ఇటు నా వంక.


• గోరువంక ….ఓ గోరువంక….

• చూడు వంక…ఇటు నా వంక.


రంజనము = రాసక్రీడ

యడ్ల శ్రీనివాసరావు 13 May 2022 5:00 AM








Monday, May 9, 2022

172. శోభయాన తీగ


శోభయాన తీగ


• శ్రీ రంగవల్లి రతనాల లాలి

• నీ కన్నుల పై వాలి

• వెన్నెల వెన్నెను వన్నెగా నే పూసి

• కరతల నీ మోము చరచి

• అధర చుంబనకు ఆధారమున ఆనందవల్లి.

ఓ శ్రీలక్ష్మి రత్నము వంటి మురిపెమా….నీ కన్నుల పై వాలి.…వెన్నెలను వెన్నగా ఆభరణముగా నేను పూసి….అరచేతితో నీ ముఖము నిమురుతూ..... పెదవుల పై చుంబన మునకు ఆనంద మూలమైన ఓ తీగజాజి.



• మకరందవల్లి ముత్యాల లాలి

• నీ హృదయాన వాలి

• ఉచ్ఛ్వాస నిచ్చ్వాస లలో నే ఊయలగ ఊగి

• స్పందనల శ్రావ్యమున నే మైమరచి

• మనసు భాగ్యమున కనుమూయ మరకతవల్లి

ఓ తీయని తీగ, ముత్యము వంటి మురిపెమా….నీ ఎదపై వాలి.…నీ శ్వాస లయలతో నేను ఊయలగా ఊగుతూ….ఆ కదలికల మాధుర్యమున నన్ను నే మరచి….నీ మనసు సుకృతమున కన్నుమూయాలి పద్మిని.



• చంపకవల్లి శ్రీచందన లాలి

• నీ చరణముల వాలి

• గలగలలాడే గజ్జెల తడవన నే విస్మయమున

• సొగసు సురతికి నే వలచి

• సంవాహనమున  సేవ ధన్యము శోభనవల్లి.

ఓ సంపెంగి సిరి చందనము వంటి మురిపెమా…..నీ పాదముల పై వాలి…. గలగలలాడే గజ్జెల మాటున నేను వింత గా…. పారవశ్యమై అనురాగం తో నేను కోరి….. సుతిమెత్తగా ఒత్తుతూ చేసే సేవ చాలు సువర్ణ సుందరి.


యడ్ల శ్రీనివాసరావు 10 May 22 2:00 AM.






Sunday, May 8, 2022

171. నవరసాలు

 

నవరసాలు


1. శృంగారం : (రతి భావం)

• సంయోగ వియోగాల సౌందర్య మదనం

• మది భావమున మకరంద ఔషధీ.

• రతి లోకమున రస రాజ కేళి.

• ప్రకృతి పురుషుల సృష్టి యాగానికి బీజ యోగం.

• (కలియుట ఎడబాటుగా ఉండుట అనేది అందమైన కలవరం….. మనసు ఆలోచనకి తియ్యని ఔషధం…మన్మధ లోకం లో రసవత్తరమైన రాచ క్రీడ….. స్త్రీ పురుషుల ఆవిర్భావ యజ్ఞానికి శృంగారం అదృష్ట విత్తనం.)


2. హాస్యం : (హస భావం)

• హసిత విహసిత అతిహసిత

• వికృతి వికార వైఫల్య వికలముతో జనియించిన సకలము.

• అనుకరణ తో ఉదయించిన చిద్విలాస ఆహ్లాదము.

• శారీరక మానసిక గతుల కు అతీతము భావము.

• అష్టరసాల విఫలతను సఫలదాత హాస్యరసం.

• ( చిన్నగా, ఎరుపెక్కేలా, ఆనందబాష్పాలతో ఉండే నవ్వు…..సహజంగా పుట్టదు, ప్రయత్నపూర్వకంగా, వికార ఆకారములు, అంగ వైకల్యలను అనుకరించడం ద్వారా హాస్యం పుట్టింది. ఒకరిని హవ భావాలు, మాటలు, వేషధారణ అనుకరించడం తో మనసులో రసోత్పత్తి జరిగి హాయిని ఇస్తుంది. అదే హాస్యరసం. నటుడు ఏ రసం లో విఫలం అయినా, చివరిగా ఏదో ఒక పిచ్చి చేష్టలతో వీక్షకులను నవ్విస్తాడు.)


3. కరుణ : (శోక భావం)

• నష్టశోక దుఃఖవిషాదాల అనుభవ జననం .

• కారుణ్యము సృష్టి హరిత జీవన మూలం.

• కరుణ లేని నాట కాఠిన్యం విరియ

• మనసు ఆర్థృతకు మాధుర్యం కారుణ్యం.

• (కోల్ఫొయిన బాధ ఏడుపు అనుభవం లో నుండి పుట్టేది కరుణ రసం. దయ వలనే ఈ సృష్టిలో ఏ జీవియైన సంతోషంగా జీవించ గలదు. కనికరం లేనిచో కౄరత్వం ఏలును. మనసులోని చెమ్మకు మధుర రూపం కరుణ రసం.)


4. రౌద్రం : (క్రోధ భావం)

• అసత్య అసూయ అభిద్రోహ అవమాన భావ జననం.

• సంగ్రామ రాక్షస ప్రకృతుల వికార స్థితి.

• ప్రకృతి వికృతిని చేసే బీజరూపం.

• రుద్రవతారే లయకార రూపే.

• (అవమానం, ద్రోహం, మోసగింపబడటం వలన పుట్టిన భావం. యుద్దము నందు కలిగే రాక్షసత్వం ఈ భావం. ఏదైనా వినాశనం చేయాలంటే ఈ రసోత్పత్తియే కారణం.  శివుడు రుద్రుని అవతారంలో నే ఈ సృష్టి ని లయం చేస్తాడు.)


5. వీరత్వం : (ఉత్సాహ భావం)

• ఆధిపత్యం తో ప్రకృతి భావ జననం.

• అంగబల పరాక్రమ శక్తి.

• ప్రతాప ప్రభావాల చతురంగ బలం.

• కలతచెందక విగ్రహ నిగ్రహల పట్టుదల వీరత్వం.

• (అజమాయిషీ అనే సహజసిద్ధమైన ధైర్య భావం.శారీరక ధృడత్వం , సైన్యం కలిగి ఉండడం వలన కలిగే రసోత్పత్తి. మనోధైర్యం, నిబ్బరం, పట్టుదల కలిగి ఉండటం.)


6. భయానకం : (భయ భావం)

• స్వభావ సిద్ధమైన కృత్రిమ భావం జననం

• అపరాధ హింస మోస ప్రవృత్తి ల పరిణామం

• మనోవిఫల కుంచిత భావహః

• (మోసగింపబడటం, హింసించి బడటం, అపరాధ తత్వం వలన కృత్రిమ తత్వం తో కలిగేది భయం. మనోధైర్యం విఫలమై కుంచితతత్వం కలుగుతుంది.)


7. భీభత్సం : (జుగుప్స భావం)

• కృత్రిమమైన విరక్తి భావ జననం.

• అయిష్టం , అసహ్యం , విసుగుల రసోత్పత్తి.

• నాశనం ప్రతిఫలం.

• ( రౌద్రం వలన వినాశనం, భీభత్సం వలన నాశనం . ఏహ్యభావం తో మొదలై యే చర్య.)


8. అధ్బుతము : (విస్మయ భావం)

• మనోవాంఛ పరిపూర్ణత భావ జననం.

• ఆధ్యాత్మిక , ఇంద్రజాల, అతీత దర్శన అభినయం.

• (మనసులో అనుకున్నది జరగడం, ఊహించని ఆశ్చర్యం జరగడం వలన ఆనందంతో జరిగే రసోత్పత్తి. దైవపరమైన నిదర్శనాలు, ఇంద్రజాలం, మహానుభావుల సందర్శన వలన కలిగే భావన)


9. శాంతము : (శమ భావం)

• తత్వజ్ఞాన వైరాగ్య ఆశయసిద్ధి జననం

• ఓరిమి, కామక్రోధాది రాహిత్యం.

• మోక్షమునకు తొలి దశ.

• ( వైరాగ్యం, తత్వజ్ఞానము , ఓర్పు వలన పుట్టిన భావము.)


యడ్ల శ్రీనివాసరావు 9 May 2022, 7:00 AM.




Saturday, May 7, 2022

170. జగత్ జనని

 

జగత్ జనని


• దాక్షాయణి…. దాక్షాయణి….

  ధీనుల పాలిట దాక్షిణ్య రూపిణీ.

• నారాయణి…నారాయణి…‌

  నరుల పాలిట నీరజాక్షిణి.


• అంతరంగమున అవతరించిన కరుణ దాయిని.

• జీవుహితమునకు దారిచూపేటి జీవకారిణి.


• అంతర్యామి లో కొలువై యున్న ఆర్యాణి.

• విశ్వమంతట నెలవై యున్న విశ్వధారిణి.


• దాక్షాయణి…నారాయణి

• దాక్షాయణి…నారాయణి


• జీవుకోటికి భుక్తిదాయిని.

• భూతప్రాణులకు భద్రకాళివి.

• పుణ్యజీవుల మోక్షదాయిని.

• శ్రేష్టజీవులకు కల్పదాయిని.

• హీనజీవులకు శక్తి దాయిని

• నిర్భాగ్యులకు భాగ్యదాయిని


• దాక్షాయణి…. దాక్షాయణి….

  ధీనుల పాలిట దాక్షిణ్య రూపిణీ.

• నారాయణి…నారాయణి…‌

  నరుల పాలిట నీరజాక్షిణి.


• భం భం భజే ….భం భం భజే.

• ధం ధం భజే….ధం ధం భజే.

• ధంధంధ ధంధంధ ధమధంధ ధంధం.

• భంభంభ భంభంభ భమభంభ భంభం.


• లోక కళ్యాణంతో కమనీయం చేసే తిలకధారిణి.

• కావ్యకళలతో భోధను చేసే జ్ఞానధాయిని.

• మంగళకరముతో మగువను చూసే సూత్రధారిణీ.


• దాక్షాయణి…నారాయణి

• దాక్షాయణి…నారాయణి


• జగమంత శక్తి నిక్షిప్తమై యున్న జనని.

• జన్మనిచ్చిన తల్లిలో రూప అంతరమై యున్న జగజ్జనని.

• అండపిండబ్రహ్మండములను ఎరిగిన   సూక్ష్మదాయిని.


• దాక్షాయణి…. దాక్షాయణి….

  ధీనుల పాలిట దాక్షిణ్య రూపిణీ.

• నారాయణి…నారాయణి…‌

   నరుల పాలిట నీరజాక్షిణి.


యడ్ల శ్రీనివాసరావు 8 May 2022 9:00 AM.




Friday, May 6, 2022

169. హసిత సింగారం

 


హాసిత సింగారం


• ఏమని సెప్పేది చిన్నమ్మి….

• ఏమని సెప్పేది బుల్లమ్మి.


• నీ సిలిపి నవ్వులోన….

• సిలక పలుకుల గూర్సి ఏమని సెప్పేది..


• నీ మాట సొంపు లోన….

• ఓ… ఓ…. దీర్ఘ రాగాల గూర్సి ఏమని సెప్పేది.


• నీ కళ్ల సక్రాలతో….

• గిరగిర తిప్పే హొయల సిత్రాల గూర్సి ఏమని సెప్పెది.


• నీ   వో... వో… అచ్చరాల్లో….

• నడుము అగుపడుతుంటే 

  సొగసు భాసల గూర్సి ఏమని సెప్పేది.


• ఏమని సెప్పేది చిన్నమ్మి….

• ఏమని సెప్పేది బుల్లమ్మి.


• సిలక పలుకులకు.…ఆ…నీ...సిలకపలకులకు…

• సిలకనై  వచ్చి  నీ ముక్కు కొరికి పోయేదని  సెప్పలా.


• ఓ…ఓ…రాగం తీసే…

• నీ పెదవి సున్నాలను  నే వచ్చి సరి సేసేదని     సెప్పాలా.


• నీ కళ్ల గిరగిర లను….

• నా కంటి పాపతో జతగ సేర్సి సరిసేసేదని సెప్పాలా.


• ఏమని సెప్పేది చిన్నమ్మి…

• ఏమని సెప్పేది బుల్లమ్మి.


• నీ సొగసు భాసలను….

• నా కౌగిలాటతో సక్కంగా సేసేదని సెప్పలా.


• ఏమని సెప్పేది చిన్నమ్మి…

• ఏమని సెప్పేది బుల్లమ్మి.


యడ్ల శ్రీనివాసరావు 7 May 2022 , 10:30 AM.



Thursday, May 5, 2022

168. విధి ఆట

 

విధి ఆట

• అటు చూసిన నీవే…

• ఇటు చూసినా నీవే...

• ఎటు చూసినా నీవే.

• నీవే నీవే…..నాలోని నీవే.

• నర నరమున నీవే…. ప్రతి స్వరమున నీవే.


• ఎందుకీ ఈ కలవరం…..ఏమిటీ ఈ నవ జపం.

• మనసు కి ఏదో అవుతుంది…

• ముసిగా మహిమను చూస్తుంది.

• ఎందుకు…..నాకే తెలియని వింత అనుభవం


• వయసు ఉరకలేస్తుంటే….

• తనువు పులకరిస్తుంటే.

• వయసు తనువు పోరాటం లో

• ఆశలు ఆవిరవుతున్నాయి.

• ఎందుకీ ఈ కలవరం…. ఏమిటీ ఈ నవ జపం


• ప్రేమ వదలి పోతానంటే…

• భామ విడువ లేనంటే.

• భామ ప్రేమ కలకలంలో

• ఆవేదన ఆలింగనమవుతుంది.

• ఎందుకీ ఈ కలవరం…. ఏమిటీ ఈ నవ జపం


• రాత ఎరుగడా…తలరాత ఎరుగడా

• విధి రాసిన విధాత ఈ ఆట ఎరుగడా.


• అటు చూసిన నీవే…

• ఇటు చూసినా నీవే...

• ఎటు చూసినా నీవే.

• నీవే నీవే…..నాలోని నీవే.

• నర నరమున నీవే…. ప్రతి స్వరమున నీవే.


యడ్ల శ్రీనివాసరావు , 5 May 2022, 11:15 PM.




Wednesday, May 4, 2022

167. "లలిత" _ "కళ "లు

 

“లలిత” - “కళ” లు


1. కావ్యము :

• సునయన పాణి అక్షర వాణి.

• ఛందస్సు తో చంపక మాలను అల్లిన శార్వాణి.


 మీనాక్షి నీ చేతి అక్షర పలుకులు,  పద్యలక్షణాలతో     సంపెంగ మాలవలె అల్లినవి ఓంకార స్వరూపాలు.



2. సంగీతము :

• సుమధుర వేణి కళ్యాణి బాణి.

• రాగమాలికతో కీర్తన చేసే రాగిణి.


  రాగ స్వరాలను మాలగా అలవోకగా పాడే ఓ శ్రీలక్ష్మి.    మధురమైన నదీ ప్రవాహం వంటిది కళ్యాణి రాగం,



3. నృత్యము:

• సవరన మణి నర్తన రాణి.

• అక్షర కీర్తన ఆలింగనల నాట్య కారిణి.


  తేజోమయంగా నాట్యము చేయు అందమైన ఓ       రాణి, పాటల పదముల కౌగిలి నీ నృత్యము.



4. శిల్పము :

• సురదన హరిణి సౌందర్య రూపిణి.

• శిలలో వెలిసిన అజంతా శిల్ప వర్షిణి.


 లలితమైన బంగారు ప్రతిమ గల ఓ సౌందర్య         రూపిణి. వర్షం చినుకుల వలె, రాతిలో వెలసిన అనేక   రూపములు గల అజంతా శిల్పానివి.



5. చిత్రలేఖనం :

• సుయామున బోణి ప్రకృతి శివాణి.

• ఛాయాచిత్రాన సురభి కుంచె వైన రుక్మిణీ.


  యమునా నదికి ప్రియమైన తొలి ప్రకృతి ఓ పార్వతి    దేవి,  బంగారు కుంచె తో నీ చిత్రం వేసిన, బంగారు  కాంతి కలదాన.



యడ్ల శ్రీనివాసరావు 5 May 2022 12:30 AM.






Tuesday, May 3, 2022

166. మిత్ర సత్యాలు

 

 మిత్ర సత్యాలు


• మేలుకో  మిత్రమా  మేలుకో

  ఇకనైనా  మేలు కోరే   మిత్రుని  ఏలుకో.


• మంచిచెడులు   మరచి 

  అందరు   మానవారనుకుంటే

• చెడును  హారం గా  చేసి 

  నిను ఆహారం  చేసే వారుంటారు.


• మేక వన్నె పులులు  అడవిలో లేవురా.

  ఈర్ష్య   ద్వేషాల  ముసుగులో 

  మనతోనే   ఉన్నాయి  రా.


• మానవులందరి   రూపు    ఒకటే అయినా

  మనసునందలి    రేఖలు    వేరు  నాయినా.


• ఉనికి  కోసం   నీ చెంత    చేరిన వారే

  ఉనికి  మరచి    నిను   ఉరి  తీస్తారు.


• మేలుకో   మిత్రమా మేలుకో

  ఇకనైనా  మేలు కోరే   మిత్రుని  ఏలుకో.


• ఒకరికి  మంచి మిత్రుడి గా  నిలవాలంటే

  నీ  లో లోని   శత్రువులను   విడనాడు.


• జీవన  చదరంగం లో    చెదలా   ఉండకు

  నైతిక   నవరంగం తో    సుధలా  ఉండు.


• ప్రతి ఒక్కరు   నేర్పేది పాఠం.

  ఎరుగకపోతే  అదే నీకు  గుణపాఠం.


• మసిపూసిన  మనసులతో  మనిషిలెందరున్నా

  కన్నీటి మసక   తుడిచే    మనుషులే  మిన్న.


• నీ అవసరానికి 

  ఒకడు  మిత్రుడు కాడు … రాడు.

• ఒకరి అవసరానికే 

  నీవే   మిత్రుడివి  కావాలి.

• ఆచరించి   చూడు   అవసరాలను....

  మరిపించే   మిత్రులు   నీకే సొంతం.


• ప్రేమను   పంచడం   తెలుసుకో

  ప్రేమించడం  ఇతరులు  తెలుసు  కుంటారు.


• మేలుకో   మిత్రమా   మేలుకో

  ఇకనైనా  మేలు  కోరే  మిత్రుని   ఏలుకో.


• మిత్రుడంటే  మోహం కాదు  … 

  మిత్రుడంటే స్నేహం

• మిత్రుడంటే   ప్రేమే కాదు  … 

  మిత్రుడంటే  రక్ష.

• మిత్రుడంటే  సహాయమే  కాదు ... 

  మిత్రుడంటే  మనిషి.

• మిత్రుడంటే  బానిస  కాదు  ... 

  మిత్రుడంటే  హక్కు


• ఎవరికెవరు శాశ్వతం కాదు ...

  అనేది మరణం తరువాతే.


సుధ = అమృతం, పాలు, ఇటుక

యడ్ల శ్రీనివాసరావు 4 May 2022 , 12:30 AM.




Monday, May 2, 2022

165. శేషం…. సశేషం…విశేషం

 

శేషం…. సశేషం…విశేషం


• ఒకరికి ఒకరం ఒకటవుతుంటే…

  మాలో మేము సగమైయ్యాము‌.

• ఆటపాటలతో తోడవుతుంటే….

   నవజీవనవేదం నీడయ్యింది.


• మనసులు హర్షిస్తుంటే….

  మా మనువుని తిలకిస్తూ…

  పంచభూతాలు సాక్ష్యమయ్యాయి.


• ప్రేమని కురిపిస్తూ….

  మా జీవం సాగిస్తుంటే….

  వేదమంత్రాలు సిరులయ్యాయి.


• ప్రకృతి లాలిస్తూ…

  కాలం దీవిస్తుంటే….

  సుఖసంతోషాలు మా ఊపిరయ్యాయి.


• ఆహ ఏమి ఈ భాగ్యం…

  ఆహ ఏమి ఈ భోగం.

• ఆహ ఏమి ఈ బంధం…

  ఆహా ఏమి ఈ సంబంధం.


• కాలచక్రమే తిరిగింది….

  జీవన చరితం మార్చింది.

• మృత్యులోకమే పిలిచింది….

  మరు జన్మకు ద్వారం తెరిచింది.


• శేషం…సశేషం…విశేషం.


• ఎదలోని వధతో భగభగలాడుతూ….

  జీవించి ఉన్నా లేదు జీవం నాలో.


• మతిలోని ధ్యాసతో నిను వెతుకుతూ….

  శిలనై ఉన్నా లేదు చలనం నాలో.


• నీ దర్శన మైతే…సేవకుడినై….విశేషకుడినై

  బుణ విముక్తుడి నవుతా.


యడ్ల శ్రీనివాసరావు 3 May 2022 , 1:30 AM.





164. గాననాట్యం


గాననాట్యం


• పదనిసల అలలతో, సాయం గోదావరి ఉరకలేస్తుంటే.

• పరవశించు హృదయం లో పదము పులకరిస్తుంటే.


• పల్లవి కదలాడే….చరణము గుసగుసలాడే.

• ఊహలు మెదలాడే…కరములు కళకళలాడే.

• కలిసి మెలసి అలసి సొలసి

• పాటకు ప్రాణమాయే…..సాహితికి ఊపిరాయే.


• ఈ రాగం రస రంజ భోగం…

• అనురాగం చెలి చెంత గారం.


• ఈ గానం విన సొంపు యోగం…

• శృంగారం సఖి తోడ సౌఖ్యం.


• ఈ గీతం కృతి వర్ణ రూపం.

• సంగీతం సతి నుదుటి భాగ్యం.


• సత స్వర వాణి   నలువ రాణి  కళ్యాణి

• సుమధుర  బాణి   నీలవేణి  పూబోణీ.


• తకదిమిల తాళం మాలికకు మోహం….

• సరిగమల శ్రావ్యం శృతిలయల సంగమం.


యడ్ల శ్రీనివాసరావు 2 May 2022 6:00 PM.






490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...