Wednesday, May 25, 2022

186. Human Communication Nature Influence

 


Human Communication Nature Influence


• మన పూర్వీకులు, జ్ఞానులు, యోగులు, మునులు మానవాళి మనుగడకు అవసరమైన జీవన విధానాన్ని పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ భారత గ్రంధాల్లో పొందు పరిచారు. వారు భవిష్యత్తు ను మొత్తం దివ్య జ్ఞానం తో గ్రహించి లోక కళ్యాణం కోసం రాసారు. ఆ రోజుల్లో తాటాకు పత్రాలు సమాచార సాధనం లా వాడారు.


• అసలు సమాచారం ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయాలంటే మీడియం అనేది చాలా అవసరం. ఉదాహరణ కు సెల్ ఫోన్ లు. మానవుడు అభివృద్ధి అనేది సైన్స్ సాధనాల వలనే సాధ్యం అవుతుంది అనే భ్రమ లో ఉంటాడు. ఇది మనిషి లోని అజ్ఞానికి నిదర్శనం అనిపిస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో మునులు యోగ సాధన ద్వారా ఉన్న చోట నుంచి ఎంతో దూరంలో ఉన్న వారికి సమాచారం, కేవలం యోగశక్తి తో మనసులో తలుచుకుని పంపించేవారు. ఇది నేటికీ చాలా మంది లో కనిపిస్తుంది. ఎలా అంటే మనం అదే పనిగా గాని, లేదా అకస్మాత్తుగా ఎవరినైనా తలచుకుంటే వెంటనే రెండు మూడు రోజుల్లో వారే మనకు ఎదురు పడడం, లేదా మనకు వారే ఫోన్ చేయడం వంటివి జరుగుతుంది. దీనినే టెలీపతీ అంటారు. ఇది ఎక్కువగా meditation, sixth sense, intuitive power ఉన్నవారికి అనుభవం అవుతుంది. అంటే మనిషి ఆలోచన విద్యుత్ అయస్కాంత శక్తి. తరంగం వలె మారి ప్రకృతి లో కి ప్రవేశించి సంకల్పం సిద్ధి ద్వారా చేయవలసిన వారికి చేరి, వారి చేత మిమ్మల్ని ఏదో విధంగా తిరిగి సమాధానం ఇచ్చే లా చేస్తుంది. కాని మనిషి ఇది గ్రహించలేడు. ఎందుకంటే ఇదంతా కంటికి కనపడని చర్య.


• ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించ వలసింది ప్రకృతి గురించి. చాలా మంది ప్రకృతి అంటే ఆరుబయట కనిపించే ప్రపంచం అనుకుంటారు. ప్రకృతి అంటే పంచభూతాల సమ్మేళనం. ఈ సృష్టి ని నడిపించేందుకు దేవుడు తయారుచేసిన మీడియం. ఈ ప్రకృతి మీద ఆధారపడి ఈ సమస్త సృష్టి, జీవరాశులు మనుగడ సాధిస్తున్నాయి. కానీ అటువంటి ప్రకృతిని, నేటి కలి కాలంలో మనిషి చిన్నచూపు చూస్తు , అభివృద్ధి అనే ముసుగులో నాశనం చేస్తూ సృష్టి వినాశనం కోరుకుంటున్నాడు. చెట్లు నరకడం, మైనింగ్ గనులు తవ్వకం, పరిశ్రమల కాలుష్యం ఇలా ఎన్నో.


• ఒక మనిషి తనను ఎవరైనా బాధపడితే సహించలేక తిరిగబడతాడు. అటువంటిది ప్రకృతి ని నాశనం చెయ్యాలనుకున్నప్పడు, ప్రకృతి తిరిగిబడితే జీవి అనేదే మిగలదు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే మన చిన్నతనానికి ఇప్పటికీ ఈ 40, 50 సంవత్సరాల కాలంలో మనిషి చేసిన పొరపాట్ల వలన ప్రకృతి లో వాతావరణ మార్పులు చాలా వచ్చాయి. చూస్తూనే ఉన్నాం.


• ఏ మార్పు కైనా, మనిషి ఆలోచనా విధానం మూలకారణం. ఎలా అంటే ఒక మంచి ఆలోచన మనిషిని నిత్యం ఆనందంగా ఉంచుతుంది. అంటే పాజిటివ్ శక్తి ద్వారా వెలువడే తరంగాలు ప్రకృతి ఆమోదించి చైతన్యం అయి తిరిగి మనిషి కి సంతోషం ఇస్తుంది.

• ఈ రోజు వరకు కూడా సృష్టి లో మానవాళి ఎంతో కొంత ఇలా నడుస్తుంది అంటే కారణం కేవలం కేవలం కొంతమంది వలనే. వారు ఎవరో కాదు, యోగులు, ధ్యానులు, జ్ఞానులు వారు వెలువరించే పాజిటివ్ శక్తి ని ప్రకృతి తీసుకుని చైతన్యం అవుతుంది కాబట్టి నెగెటివ్ ఎనర్జీ ఉన్నవారు అంటే చెడు , దుష్ట ఆలోచనలను ప్రకృతి లో కి వెలువరించే వారు కూడా విర్రవీగుతూ ప్రశాంతంగా మనుగడ సాగిస్తున్నారు.


• నేటి కాలంలో మనిషి జీవన వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అందరికి తెలుసు. అనారోగ్యం, దుఃఖం, ఆహరకొరత ఇలా ఎన్నో సమస్యలు. దీనికి మనిషే స్వార్థం తో కూడిన ఆలోచనలు కారణం. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు, అని తెలిసినా పరిధి దాటి ఒక మంచి ఆలోచన ప్రకృతిలోకి విడవలేక పోతుంటారు.


• ఉదాహరణకు ఒక పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థం కలుషితమై ఆ చుట్టుపక్కల ప్రాంతం నివాసయోగ్యం కాకుండా పోతుంది. అలాగే మనిషి చేసే వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ ఆలోచనలు తెలియకుండానే ప్రకృతిని నిరంతరం కలుషితం చేస్తున్నాయి.


• ఒక చిన్న కుటుంబం లో ఎవరైనా సరిగా లేకపోయినా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయి నాశనం అవుతుంది. మరి అలాంటిది ఈ ప్రకృతి కుటుంబం లో ఉన్న ప్రతీ మనిషి సవ్యమైన, సక్రమమైన, హాని కలిగించని ఆలోచనలు కలిగి ఉంటేనే కదా ప్రకృతి సజీవమై చైతన్యం అవుతుంది , మనిషి జీవనం సుఖవంతం చేస్తుంది.


• దీనికి ప్రతీ మనిషి చేయవలసింది ఒకటే ధ్యానం, యోగం. ఖర్చు లేని దివ్యౌషధం. ప్రతీ రోజు ఒక అరగంట ధ్యానం యోగం చేస్తూ, మన మెదడు కి విశ్రాంతి కలిగించడం వలన ( electro magnetic system) కరెక్ట్ గా పనిచేస్తు మంచి ఆలోచనలు ఉద్భవించి మంచి శక్తి కలుగుతుంది. ప్రకృతి కూడా మనిషి కి సంహరిస్తుంది. లేకపోతే, తల్లి ప్రకృతి కి పిల్లలైన మనం వికృతం లా కనబడతాం. ఒక యంత్రం విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేయడం వలన కొంతకాలానికి సామర్థ్యం తగ్గిపోతుంది. అదే మధ్యలో విశ్రాంతి ఇవ్వడం వలన యంత్రం ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా నిత్యం లేచినా, పడుకొని ఉన్నా మనిషి మెదడు ఏదోక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. ధ్యానం చేయడం వలన వ్యర్ద ఆలోచనలు పోయి పూర్తిగా తాజా గా అవుతుంది.


• నిజం చెప్పాలంటే అభివృద్ధి అనే ముసుగులో అంధుడిలా నేటి మనిషి జీవనం గడుస్తుంది. ఎందుకంటే తనచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితి మరియు తన లో లో ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితి నేటి మనిషి దుస్థితి. ఇది మాయ యొక్క గొప్పతనం.


• ఒకసారి ఆలోచించండి చాలా మంది మనుషుల మధ్య, కుటుంబాలు మధ్య గొడవలు సమస్యలు చూస్తుంటాం. ఇవి ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించండి. కొందరు చెప్పేది అహం వలన అంటారు . అది సరికాదు. మనుషుల మధ్య సమన్వయం లోపించడం వలన, అంటే సరియైన మాట తీరువు లేక పోవడం వలన, లేదా చెప్పాలనుకున్నది ఎదుటి వారు అర్దం చేసుకోలేకపోవడం వలన పరస్పరం కమ్యూనికేషన్ లోపం ఏర్పడటం వలన సమస్యలు వస్తున్నాయి. మనిషి ఆలోచన లో బలం ఉంటే మాట స్పష్టంగా వస్తుంది. అప్పుడు అది ఇతరులు సరిగా అర్ధం చేసుకోగలరు. కమ్యూనికేషన్ సరిగా లేకపోతే అస్తవ్యస్తం అవుతుంది. ఇదే మనిషి దుఃఖానికి అతి పెద్ద సమస్య. ప్రతీరోజూ కొంత సమయం మంచి పుస్తకం చదవడం చాలా ఉన్నతిని కలిగిస్తుంది. ఇదంతా మనిషి తన కోసం, మన భావి తరాల సుందర జీవితం కోసం. నిజాన్ని అంగీకరించడం నేర్చు కోవాలి. సాటి మనిషికి ఉపయోగపడే తెలియని విషయాలను చెప్పి సహాయం చెయ్యాలి.


• రాను రాను మనిషి సాటి వారికి మంచిని పెంచడం లోను, పంచడం లోను చాలా శక్తి హీనుడు అవుతున్నాడు. అందుకు ఉదాహరణ నేటి కుటుంబ వ్యవస్థ లోని పిల్లల పెంపకం. మా వాడు నా మాట వినడు అని చాలా సహజం గా చెప్పుకునే పరిస్థితి వింటున్నాం. మరి మనం పిల్లలు గా ఉన్నప్పుడు అలాగే ఉన్నామా. ఏమైనా అంటే కాలం మారింది అని తెలివి తక్కువ సమాధానం చెప్పి తప్పించుకుంటాం. మారింది కాలంం కాదు, ఆ కాలాన్ని అర్దం చేసుకోలేక మనమే మారాం. ఎందుకంటే మనిషి తన ఓటమి తానుగా అంగీకరించడు.


• మనిషి ఇంకా ఈ భూమి కొన్నాళ్ళు సుభిక్షంగా ఉండాలంటే , ప్రతి మనిషి ఆలొచన స్పష్టం గా, అర్థవంతం గా, పారదర్శకంగా తనపట్ల మరియు ఇతరుల పట్ల ఉండాలి. అప్పుడు ప్రకృతి లో కమ్యూనికేషన్ వ్యవస్థ సారవంతం అయి, ఎన్నో విపత్తులను ఆపగలదు. ప్రతీరోజూ ధ్యానం చెయ్యాండి. మీ ఆరోగ్యం, కుటుంబం, సృష్టి ని కాపాడుకోండి.


యడ్ల శ్రీనివాసరావు 25 May 2022 4:00 pm.




No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...