ఏడుకొండల వాడా... ఏమియు నిండని వాడ
• ఏడు కొండల వాడా… ఏమియు నిండని వాడ
• నిత్య సేవలతో
నీకు నిత్య కళ్యాణము
చేయ కమల కాంతుల వాడా.
• కనక కాంతల తోడ
పవళించి పాలించే పుడమిని
నీ పాదముల నీడ.
• ఏడు కొండల వాడా …. ఏమియు నిండని వాడ
• సిలుగు ముడుపు కట్టిన వారికి
సిరులు మదుపుగ పెట్టిన వాడ.
• కాలినడకన చేరు వారికి
కోటి అభయముల నిచ్చు వాడ ... కోదండ వాడ.
• ఏడు కొండల వాడా …. ఏమియు నిండని వాడ
• నిలువు దోపిడి నిచ్చినా
కుండ నిండని వాడ. ... ఏడుకొండల వాడ.
• నల్ల బంగారమై నల్లమల లో
వెలసిన నవనీత నీరజోదరుడా.
• ఏడు కొండల వాడా …. ఏమియు నిండని వాడ
• చంద్రకాంతుల చేత
పారిజాతములు పూయించి
నిత్య వైభోగము తో వెలిగే వైకుంఠ వాసా
శ్రీ నివాస శ్రీ శ్రీ నివాస.
• ఏకాదశి నాడు గరుత్మంతుని తోడ
ముక్కోటి దేవతలతో
భువికి చేరిన వాడ …. వైకుంఠ నాధ.
• ఏడు కొండల వాడా…ఏమియు నిండని వాడ.
• ఆది శేషమున శయనించి
చిబుకము చిన్న బుచ్చుకొని
చిలిపిగా చూసేవు
శ్రీమహాలక్ష్మిని .... శ్రీమంతుడా.
• గిల్లి కజ్జాల తో
గిరులు గిరులు తిప్పించి
గుజ్జను గుళ్లు ఆడించే
ఆనంద వాస శ్రీ శ్రీ నివాస.
• ఏడు కొండల వాడా …. ఏమియు నిండని వాడ
• భూదేవి భారమును
శ్రీదేవి సిరులతో తుల్యము చేసిన వాడ
తామర కనుల వాడ.
• మనువు మనసు కి కాదు మూలం
మనసు మనసుకే నన్న
కలి సత్యవాస శ్రీ శ్రీ నివాస.
• ఏడు కొండల వాడా… ఏమియు నిండని వాడ...
• శ్రీ నివాస …. శ్రీ శ్రీ నివాస ... శ్రీ వెంకటేశా.
సిలుగు = కష్టము, బాధ.
నీరజోదరుడు =ముత్యము వంటి వాడు.
తుల్యం = సరి సమానము
యడ్ల శ్రీనివాసరావు 29 May 2022 , 10:30 PM.
No comments:
Post a Comment