Tuesday, May 3, 2022

166. మిత్ర సత్యాలు

 

 మిత్ర సత్యాలు


• మేలుకో  మిత్రమా  మేలుకో

  ఇకనైనా  మేలు కోరే   మిత్రుని  ఏలుకో.


• మంచిచెడులు   మరచి 

  అందరు   మానవారనుకుంటే

• చెడును  హారం గా  వేసి 

  నిను ఆహారం  చేసే వారుంటారు.


• మేక వన్నె పులులు  అడవిలో లేవురా.

  ఈర్ష్య   ద్వేషాల  ముసుగులో 

  మనతోనే   ఉన్నాయి  రా.


• మానవులందరి   రూపు    ఒకటే అయినా

  మనసునందలి    రేఖలు    వేరు  నాయినా.


• ఉనికి  కోసం   నీ చెంత    చేరిన వారే

  ఉనికి  మరచి    నిను   ఉరి  తీస్తారు.


• మేలుకో   మిత్రమా మేలుకో

  ఇకనైనా  మేలు కోరే   మిత్రుని  ఏలుకో.


• ఒకరికి  మంచి మిత్రుడి గా  నిలవాలంటే

  నీ  లో లోని   శత్రువులను   విడనాడు.


• జీవన  చదరంగం లో    చెదలా   ఉండకు

  నైతిక   నవరంగం తో    సుధలా  ఉండు.


• ప్రతి ఒక్కరు   నేర్పేది పాఠం.

  ఎరుగకపోతే  అదే నీకు  గుణపాఠం.


• మసిపూసిన  మనసులతో  మనిషిలెందరున్నా

  కన్నీటి మసక   తుడిచే    మనుషులే  మిన్న.


• నీ అవసరానికి 

  ఒకడు  మిత్రుడు కాడు … కాబోడు.

• ఒకరి అవసరానికే 

  నీవే   మిత్రుడివి  కావాలి.

• ఆచరించి   చూడు  నీ అవసరాలను....

  మరిపించే   మిత్రులు   నీకే సొంతం.


• ప్రేమను   పంచడం   తెలుసుకో

  ప్రేమించడం  ఇతరులు  తెలుసు  కుంటారు.


• మేలుకో   మిత్రమా   మేలుకో

  ఇకనైనా  మేలు  కోరే  మిత్రుని   ఏలుకో.


• మిత్రుడంటే  మోహం కాదు  … 

  మిత్రుడంటే   స్నేహం

• మిత్రుడంటే   ప్రేమే కాదు  … 

  మిత్రుడంటే    రక్ష.

• మిత్రుడంటే  సహాయమే  కాదు ... 

  మిత్రుడంటే   మనిషి.

• మిత్రుడంటే  బానిస  కాదు  ... 

  మిత్రుడంటే   హక్కు


• ఎవరికెవరు శాశ్వతం కాదు ...

  అనేది  మరణం  తరువాతే .


నీ మానసిక స్థితి  ఎన్నడూ మంచి స్నేహం పంచగలిగే లా ఉండాలే , కానీ స్నేహం ఆశించే స్థితి లో  ఉండరాదు.


సుధ = అమృతం, పాలు, ఇటుక

యడ్ల శ్రీనివాసరావు 4 May 2022 , 12:30 AM.




No comments:

Post a Comment

683. అందరిలో అందరూ కొందరు.

  అందరిలో అందరూ కొందరు • అందరికీ   ఉంటారు      ఎందరో    కొందరు .   ఆ   కొందరి లో   ఎందరో    కొందరే    ఆప్తులు . • కొందరికే   ఉంటారు       కో...