Wednesday, May 18, 2022

178. ఎవరిని అడిగేది…ఏమని అడిగేది


ఎవరిని అడిగేది…ఏమని అడిగేది


• ఎవరిని అడిగేది….నే నెవరని అడిగేది.

• అందమైన లోకం లో అడుగులు వేస్తూ

• ఎవరిని అడిగేది…. నే నెవరిని అడిగేది.


• విధాత నడిగితే మౌనంగా చూస్తున్నాడు.

• విధిని అడిగితే వెకిలిగా నవ్వుతు ఉంది.


• కంట నీరు మాత్రమే చెపుతుంది నేనొక జీవమని.

• గుండె కోత మాత్రమే చెపుతుంది నేనొక జీవినని.


• ఎవరిని అడిగేది …. ఏమని అడిగేది.

• అందమైన లోకం లో అంధుడిలా తిరుగుతూ

• ఏమని అడిగేది …. నే నెవరిని అడిగేది.


• తల్లి భూమి నడిగితే తల్లడిల్లి చూస్తోంది.

• నీటి జాడ నడిగితే నా నీడే తెలియదంటుంది.


• రేయి పగలు మాత్రమే 

  చెపుతున్నాయి   నేనొక  స్పర్శనని.

• మూగ జీవాల రోదనతో 

  తెలుస్తోంది    నేనొక  ఆత్మనని.


• ఎవరిని అడిగేది …. నేనెవరని అడిగేది.

• అందమైన లోకం లో అడుగులు వేస్తూ

• ఎవరిని అడిగేది …. నేనెవరిని అడిగేది.


• అటుగా పోతుంటే 

  గులాబీల గుసగుసలు వినిపిస్తున్నాయి.

• ప్రేమకు ధైర్యం కావాలంట.

• ప్రేమిస్తే కలిసుండాలంట.

• ప్రేమిస్తే పిచ్చివారవకూడదంట.

• ప్రేమిస్తే చావకూడదంట.

• కానీ ... ఏమిటో ... ఆలస్యం అయింది.



యడ్ల శ్రీనివాసరావు 18 May 2022 , 7:00 pm










No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...