Monday, May 9, 2022

172. శోభయాన తీగ


శోభయాన తీగ


• శ్రీ రంగవల్లి రతనాల లాలి

• నీ కన్నుల పై వాలి

• వెన్నెల వెన్నెను వన్నెగా నే పూసి

• కరతల నీ మోము చరచి

• అధర చుంబనకు ఆధారమున ఆనందవల్లి.

ఓ శ్రీలక్ష్మి రత్నము వంటి మురిపెమా….నీ కన్నుల పై వాలి.…వెన్నెలను వెన్నగా ఆభరణముగా నేను పూసి….అరచేతితో నీ ముఖము నిమురుతూ..... పెదవుల పై చుంబన మునకు ఆనంద మూలమైన ఓ తీగజాజి.



• మకరందవల్లి ముత్యాల లాలి

• నీ హృదయాన వాలి

• ఉచ్ఛ్వాస నిచ్చ్వాస లలో నే ఊయలగ ఊగి

• స్పందనల శ్రావ్యమున నే మైమరచి

• మనసు భాగ్యమున కనుమూయ మరకతవల్లి

ఓ తీయని తీగ, ముత్యము వంటి మురిపెమా….నీ ఎదపై వాలి.…నీ శ్వాస లయలతో నేను ఊయలగా ఊగుతూ….ఆ కదలికల మాధుర్యమున నన్ను నే మరచి….నీ మనసు సుకృతమున కన్నుమూయాలి పద్మిని.



• చంపకవల్లి శ్రీచందన లాలి

• నీ చరణముల వాలి

• గలగలలాడే గజ్జెల తడవన నే విస్మయమున

• సొగసు సురతికి నే వలచి

• సంవాహనమున  సేవ ధన్యము శోభనవల్లి.

ఓ సంపెంగి సిరి చందనము వంటి మురిపెమా…..నీ పాదముల పై వాలి…. గలగలలాడే గజ్జెల మాటున నేను వింత గా…. పారవశ్యమై అనురాగం తో నేను కోరి….. సుతిమెత్తగా ఒత్తుతూ చేసే సేవ చాలు సువర్ణ సుందరి.


యడ్ల శ్రీనివాసరావు 10 May 22 2:00 AM.






No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...