Monday, May 30, 2022

191. మధురమైన రోజు ….మరపు రాని రోజు

 

మధురమైన రోజు ….మరపు రాని రోజు



• మధురమైన రోజు 

  మరపు రాని రోజు

• జన్మకు ఒక రోజు

  అదే జీవితానికి అర్థం తెలిసిన రోజు.


• పడిలేచే బాల్యం 

  పలకలతో గడిచింది.

• కలలు కన్న కౌమారం 

  కలవరమై కరిగింది.

• ఉప్పొంగే యవ్వనం 

  ఉరకలతో పొర్లి పారింది.

• రంగుల జీవితం 

  ఆశల హరివిల్లు తో నిండింది.


• మధురమైన రోజు

  మరపు రాని రోజు.

• జన్మకు ఒక రోజు

  అదే జీవితానికి అర్థం తెలిసిన రోజు.


• పడిలేచే మనసులతో 

  జీవన పయనమే సాగింది.

• మనసులు మను‌షులు 

  ఒకటి కాదని కాలమే చెప్పింది.

• ఆటపాట లాశలన్ని 

  ఆటుపోటులు అయ్యాయి.

• దిశ లేని ఈ తార వెలుగు 

   అడవి పాలయ్యింది.


• మధురమైన రోజు రానే వచ్చింది.

• మరపురాని రోజు అవనే అయ్యింది.


• పరమాత్ముని అంశ 

  ఆ రోజు  ఈ తారనే తట్టింది.

• దిశ లేని తారకి 

  ఆ సుదర్శనమే  దశ  అయ్యింది.

• కర్మ బంధనాలు అన్నీ 

  బుణపాశములని చెప్పింది.

• నిదురించే ఆత్మను 

  మేలుకొలుపు చేసింది.

• చీకటి లో నీడను 

  చూసే భాగ్యమే కలిపించింది.




• మధురమైన రోజు 

  మరపు రాని రోజు

• జన్మానికి ఒక రోజు

  అదే జీవితానికి అర్థం తెలిసిన రోజు.


యడ్ల శ్రీనివాసరావు 30 May 2022 9:00 PM.




No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...