Wednesday, June 1, 2022

192. తల్లి తండ్రులు

 

తల్లి తండ్రులు


• తల్లి వి నీవు …. తండ్రి వి నీవు

• తల్లి తండ్రి లై పిల్లలను ప్రేమించే సృష్టి కర్తలు మీరు.

• సకల జనుల సుఖమును కోరేటి ఆలుమగలు మీరు.

• మనసున కొలువై మమతలు మేలు కొలిపే ఆది దంపతులు మీరు.


• తల్లి వి నీవు ….. తండ్రి వి నీవు

• తల్లి తండ్రి లై పిల్లలను ప్రేమించే సృష్టి కర్తలు మీరు.


• స్వార్థమనే సముద్రం లో మా బుద్ది నంతా లవణం చేసాము.

• ఈర్ష్య, ద్వేషాల నే ప్రమిదలు వెలిగించి మా కళ్లకు నైవేద్యంగా పెట్టాము.

• అసూయ, క్రోధాలను హారాలు గా మా దేహానికి అలంకరించాము.

• మానవ జన్మ అంటేనే మాయకు సోపానమనే జీవనం లో ఆరితేరాము.


• కన్ను మిన్ను కానకుండ సేవను మరచి సేవించడం నేర్చుకున్నాము…. ప్రగతి పథంలో పయనిస్తున్నాము.

• తల్లి తండ్రులైన మిమ్ము చూస్తూనే ఉన్నాము…ధనమును హుండీలో వేస్తూనే ఉన్నాము.

• పండుగ పబ్బాలకి మీకు సంబరాలు చేస్తున్నాము…మేము పబ్బుల్లో కేరింతలు కొడుతున్నాము.


• మీరు చేయలేని పనులెన్నో చేసి మేము చూపిస్తున్నాము….

• చావు చెంత చేరినాకే మీరు శివపార్వతుల ని తెలుసు కుంటున్నాము.


• తల్లి వి నీవు …. తండ్రి వి నీవు

• తల్లి తండ్రి లై పిల్లలను ప్రేమించే సృష్టి కర్తలు మీరు.

• జ్ఞాన అజ్ఞానములు ఎరుగక అంధకారమైన లోకంలో దిక్కు లేని పిల్లలం మేము.


యడ్ల శ్రీనివాసరావు 1 June 2022 , 12:30 pm






No comments:

Post a Comment

488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...