పల్లె సొగసు
• పచ్చదనపు పైరు చేనులో
• పరువం నిండిన పరికిణీ లో
• గంతులేసే ఓ గడసరి పిల్ల
• దేనికోసం నీ చిర్రుబుర్రులు.
• ఎందుకో నీ ఎదురు చూపులు
• ఈ చల్లని గాలి లో
• నీ సుతిమెత్తని పాదాల కింద
• నే పొలము గట్టు గడ్డి నై
• మైమరచి నలుగుతు ఉన్నా.
• చూడు …ఓ సారి ఇటు చూడు.
• లేగదూడ వై గెంతుతూ ఉంటే
• పైట జారిన వైనం లో
• నీ కొంగు చాటు బంగారంపై
• నే తుమ్మెద నై వాలి ఉన్నా
• చూడు…ఓ సారి ఇటు చూడు.
• ఈ భానుడి తాపం లో
• వంగచేను లో వంగి ఉంటే
• నే స్వేదము నై నీ నాభి లో చేరి
• చల్లదనము నే ఇస్తున్నా
• చూడు…ఓ సారి ఇటు చూడు.
• పంట కాలువ దాటుతు ఉంటే
• నే సెలయేటి నీటినై
• నీ మోకాలిని సాకుతూ ,
• అందాలను ఆస్వాదిస్తున్నా
• చూడు…ఓ సారి ఇటు చూడు.
• పచ్చదనపు పైరు చేనులో
• పరువం నిండిన పరికిణీ లో
• గంతులేసే ఓ పడుచుపిల్ల
• దేనికోసం నీ చిర్రుబుర్రులు.
• ఎవరికోసం నీ ఎదురు చూపులు
• ఎందుకో ఏమో తెలియదు కానీ
• నిను తాకిన క్షణము నుండి
• నువ్వే నా సర్వస్వం…. నువ్వే నా సమస్తం.
యడ్ల శ్రీనివాసరావు 26 June 2022 , 4:00 pm.
No comments:
Post a Comment