Wednesday, June 1, 2022

193. ఎవరివి నీవు….ఎవరవు నువ్వు

 


ఎవరివి నీవు….ఎవరవు నువ్వు




• ఎవరివి నీవు…. ఎవరవు నువ్వు.

• నీకై వేచిన క్షణమంతా మరణించి ఉన్నాను.

• నీకై వచ్చిన క్షణము నే తిరిగి జన్మించాను.


• ఏమి మంత్ర మేసావో…. ఏమి మాయ చేసావో.

• నిను చూసిన క్షణమున  గతమంతా స్మృతి అయ్యింది.


• చిలికిన వెన్నలో వెలసిన ముత్యమా.

• చిలుక పలుకు రాగాల  ఓ  ఆణిముత్యామా.

• ఎవరివి నీవు….చెప్పవా…. ఎవరవు నువ్వు.


• నీ మాటల మధురం తో   మనసు తేలి ఆడింది.

• నీ చూపుల చందంతో   ఆశలు అలలు అయ్యాయి.


• తడిచిన మంచులో విరిసిన సన్నజాజి.

• *ఆమని సిగలో మెరిసిన  ఓ  విరజాజి.

• ఎవరివి నీవు….చెప్పవా…. ఎవరవు నువ్వు.


• ఏమి చూపు చూసావో….ఏమి నవ్వు నవ్వావో.

• నీ రూపమే నన్ను నాకు చూపింది.

• నీ నవ్వులే నాలో ఊపిరి నింపాయి.


• కవితలు *సవిత గ   చేసిన సాహితీ.

• పదములు *నదము ల  చేసిన   ఓ  *కమలిని.

• ఎవరివి నీవు….చెప్పవా…. ఎవరవు నువ్వు.


• నీ వెవరో…నేనెవరో..

• నీకు నేనెవరో…. నాకు నీవెవరో తెలియదు.


• గాలి నడగలలేను…. నీటి నడగలేను.

• నింగి నడగలేను…. నిప్పు నడగలేను.

• ఎందుకంటే నేనున్నది శూన్యం లో.


• శూన్యం కంటే బలమైనది మౌనం.

• ఎవరివి నీవు…. ఎవరవు నువ్వు.


ఆమని =  వసంత కాలం.

సవిత = సూర్యుడు

నదము = ప్రవహించే నీరు 

కమలిని = తామర తీగ.


యడ్ల శ్రీనివాసరావు 31 May 2022 , 11:00 PM.






No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...