చిరు జల్లులు
• జల్లులు జల్లులు జల్లులు…
• చిరు జల్లులు అల్లిన చినుకులు
• నా ప్రేయసి ముంగిట వలపులు.
• నా చెలి అందం చూసి
నీలి మబ్బుల ఆకాశం
• నల్లని మేఘమై వర్షిస్తూ
పలకరింపు కై వచ్చింది.
• కోయిల రాగాలు వర్షపు హోరు తో
శృతి కలుపుతూ ఉంటే
• కొలను లోని తామర వలే
నా చెలి వికసిస్తుంది.
• జల్లులు జల్లులు జల్లులు…
• చిరు జల్లులు అల్లిన చినుకులు
• నా ప్రేయసి ముంగిట వలపులు.
• ఆకుల జారిన చినుకులతో
పక్షులు ఆటలు ఆడుతూ ఉంటే
• నా చెలి వదనం
బుట్టబొమ్మలా ఊగుతూ ఉంది.
• తకదిమి తకదిమి అంటూ
కాలి గజ్జెను ఊపుతూ ఉంటే.
• చిటపట చినుకుల శ్రావ్యంతో
చిందులేస్తుంది నా చెలి పాదం.
• జల్లులు జల్లులు జల్లులు…
• చిరు జల్లులు అల్లిన చినుకులు.
• నా ప్రేయసి ముంగిట వలపులు.
• ఈ వర్షపు జోరు
కొత్త పులకింతయై అగాధాలను నింపుతుంటే
• నా చెలి మనసున మాత్రం
సుగంధాలను వెదజల్లుతూ ఉంది.
• ఈ తడిచిన నేల అమృతమై
మట్టి వాసనకు మది మైనమవుతుంటే
• నా చెలి కరుగుతూ ఉంది.
నా హృదయముపై మైమరచి నిదురవుతూ ఉంది.
• జల్లులు జల్లులు జల్లులు…
• చిరు జల్లులు అల్లిన చినుకులు.
• నా ప్రేయసి ముంగిట వలపులు.
యడ్ల శ్రీనివాసరావు 28 June 2022 10:00 AM.
No comments:
Post a Comment