కళాశాల 1980
ఎపిసోడ్ -7
సీన్ -32
రాము రెండవ సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. విమల కి ఉత్తరం రాసాడు. కాలేజీ కి శెలవులు ఇంకో వారం లో ఇస్తారు. వచ్చేటప్పుటకి ఇల్లు కొంచెం శుభ్రం చేసి పెట్టమని అందులో రాసాడు.
రాజారాం రాము ను చూడడానికి వచ్చాడు.రాము : సర్ వచ్చే వారం, శెలవులు ఇచ్చాక ఇంటికి వెళతాను.
రాజారాం : రాము, ఆ ఊరిలో ఎవరు లేరు కదా…మా ఇంటికి రా…ఆంటీ కూడా నిన్ను తీసుకు రమ్మంది.
రాము : లేదు సార్….ఆ ఊరిలో ఎవరు లేకపోయినా …నా ప్రాణం ఆ ఊరిలో, ఆ ఇంటి లో నే ఉంది. తరువాత వస్తాను సార్
రాము, శైలజ సంఘటన జరిగిన దగ్గర నుండి రాజారాం ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి వెళ్ళడం లేదు. రాజారాం కి ఒకింత బాధ గా ఉన్న రాము మీద గౌరవం పెరుగుతుంది రోజు రోజుకు.
సెలవులకు రాము సిరిసిల్ల ఇంటికి బయలు దేరాడు. బస్ లో ప్రయాణం చేస్తున్నాడు గాని, సిరిసిల్ల లో విమల , పాత ఇల్లు తప్ప తనకు ఇక ఎవరు ఉన్నారు అని బాధపడుతున్నాడు. గతం గుర్తుకు చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.
సిరిసిల్ల ఇంటికి రాగానే, విమల ఇల్లు శుభ్రం చేసి ఉంచడం కొంచెం తేలికగా అనిపించింది. రాము ఆ సాయంత్రం ప్రిన్సిపాల్ గారి ని కలిసాడు.
ప్రిన్సిపాల్ గారు : రాము బాగున్నావా…పరిక్షలు బాగా రాశావా.
రాము : రాశాను సార్..
రాము : సార్…మా ఇల్లు ఎవరికైనా అమ్మి పెట్టుకున్నాను కదా…
ప్రిన్సిపాల్ గారు : రాము, పెద్దవాడిగా చెపుతున్నాను. ఆ ఇల్లు ఎందుకు అమ్మాలనుకుంటున్నావు.
రాము : నా చదువు కోసం అని.
ప్రిన్సిపాల్ గారు : వద్ధు రాము…నీకు ప్రభుత్వం ఇప్పుడు ఉచితం గా స్కాలర్షిప్ మీదే ఫీజు, హాస్టల్ వసతి కలిపించింది. నీకు మిగిలిన అవసరాలకు రాజారాం, నేను ఉన్నాం…. అంతకు అవసరం అయితే అప్పుడు అమ్ముదాం…. సరేనా అన్నారు.
రాము : చేసేది లేక సరే సార్ అన్నాడు.
ప్రిన్సిపాల్ గారు : రాము ఇక్కడ ఉన్న అన్ని రోజులు ఉదయం, రాత్రి ఇంటికి వచ్చి భోజనం చెయ్యి.
రాము : సరే సార్.
ఇంటికి వెళ్లేటప్పుడు విమల ను కలిసి ప్రిన్సిపాల్ గారి తో జరిగిన విషయం అంతా విమలకి చెప్పాడు.
రాము కి ఊరిలో ఉన్నాడు కానీ ఏదో వెలితిగా ఉంది. విమల రోజు ఏదోక సమయం లో ఇంటికి వచ్చేది. విమల తనతో సరదాగా మాట్లాడుతున్న తన జీవితం ఎటు వెళ్తుందో అర్దం అయ్యేది కాదు.
శెలవులు అయ్యాక హైదరాబాద్ బయలు దేరాడు రాము.
సీన్ - 33
మూడవ సంవత్సరం కాలేజీ మొదలైంది. రాము దృష్టి అంతా చదువు కి సంబంధించిన ప్రాజెక్టు లు, మీదే ఉంది. అన్ని పరీక్షల్లో టాప్ లో ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
ఒకరోజు రాము ప్రతిభను గుర్తించిన లెక్చరర్ విశ్వం , రాము ను పిలిచి
విశ్వం : రాము నీ అకాడమిక్స్ చాలా బాగున్నాయి. నువ్వు ఇప్పటి నుండి GRE ,TOEFFEL exams ప్రిపేర్ అయితే అమెరికా లో మంచి యూనివర్సిటీ లో MS చదవవచ్చు. నీకు మంచి score వస్తే free seat వస్తుంది.
రాము : నాకు అంత స్థోమత లేదు సార్.
విశ్వం : లేదు రాము…నువ్వు ముందు ప్రయత్నం చెయ్…. నేను నీకు సపోర్ట్ చేస్తాను. నీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో గైడ్ చేస్తాను.
రాము : సరే సార్.
రాము , లెక్చరర్ విశ్వం గారి శిష్యుడిలా, ఆయన చెప్పినట్లు చదవడం మెదలు పెట్టాడు.
శైలజ ది ఇంటర్ పూర్తి అయ్యి…డిగ్రీ జాయిన్ అయ్యింది. రాము వాళ్ళ ఇంటికి రావడం మానేసినా శైలజకి రాము పై ఇష్టం పోలేదు.
ఒకరోజు శైలజ ఇంటిలో తెలియకుండా, తన కాలేజీ మానేసి రాము ని కలవాలని యూనివర్సిటీ కి వెళ్లింది. అక్కడ రాము వివరాలు చెప్పి, రాముని పిలిపించింది.
రాము ఒక్కసారి శైలజని చూసి ఖంగు తిన్నాడు.
రాము : ఏంటి శైలజ బాగున్నావా…నాన్నగారు రాలేదా…. ఏంటి నువ్వు ఒక్కదానివే ఇలా వచ్చావు…అని వరుసగా ప్రశ్నలు వేసాడు.
శైలజ : నేను ఎవరో గుర్తు ఉన్నానా…నువ్వు ఇంటికి రాకపోతే నిన్ను చూడలేమనుకున్నావా…. జరిగింది మా నాన్న కి చెప్పి మంచి పని చేసావు….. ఏంటి రాము .. నేను నీకు చిన్న పిల్లలా కనిపిస్తున్నానా…. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకునేదే లేదు…అది నీకు తెలియదేమో…మా అమ్మా నాన్న కి బాగా తెలుసు.
రాము కి కాళ్ల కింద భూమి బద్దలు అయినట్లు అనిపిస్తుంది.
రాము : అది కాదు.. శైలజా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నానో నీకు అర్దం అవుతుందా…నేను మా ఊరిలో ఇంటర్ నుంచి ఒక అమ్మాయి ని ప్రేమిస్తున్నాను. తన వలనే నేను ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నాను. నా చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తరువాత మేము పెళ్లి చేసుకుంటాము.
శైలజ : వావ్…. సూపర్ స్టోరీ రాము. ఇంత తక్కువ టైం లో భలే చెప్పావు. నీ స్టోరీ లో నాకు నచ్చని పాయింట్ ఏంటో తెలుసా. నువ్వు ఇంటర్ లో ఒక అమ్మాయి ని ప్రేమించావు. అదే ఇంటర్ చదివే నేను ప్రేమిస్తే నీకు చిన్న పిల్ల లా కనిపిస్తున్నాను….. సూపర్..అని నవ్వుతూ అంది.
రాము చెప్పిన మాటలు శైలజ అర్దం చేసుకోకుండా లైట్ గా తీసుకుంటుంటే, రాము కి పిచ్చి పట్టినట్లు అవుతుంది.
శైలజ : ఈ సారి ఇంకో స్టోరీ రెడీ చేసుకో…నేను వచ్చినట్లు నాన్నతో చెప్పకు…. ప్లీజ్….చెప్పావంటే నీ కే రిస్క్…. ఇదిగో ఈ చాక్లెట్ లు, స్వీట్స్ నీ కోసం తెచ్చాను. తిను.
రాము కి అసలు శైలజ ని ఎలా వదిలించుకోవాలో తెలియక మౌనంగా ఉన్నాడు. కానీ మనసు లో చాలా సీరియస్ గా ఉన్నాడు.
కొన్ని రోజుల తర్వాత రాజారాం రాము ను కలవడానికి వచ్చాడు.
రాజారాం రామును కలిసి, వచ్చే ఆదివారం నా పుట్టిన రోజు , ఇంటికి రా రాము అన్నాడు.
రాము : సరే సార్
రాము : సార్… అని తనకు లెక్చరర్ విశ్వం ఇస్తున్న కోచింగ్ గురించి వివరంగా చెప్పాడు.
రాజారాం : వెరీ గుడ్…రాము మంచి విషయం చెప్పావు……తప్పకుండా ఇంటి కి రా…. అని చెప్పి వెళ్ళాడు.
రాము ఈ సారి వెళ్లాలి…శైలజకి సీరియస్ గా చెప్పాలి అనుకున్నాడు.
సీన్ - 34
రాము రాజారాం గారి ఇంటికి వెళ్లాడు.
రాజారాం, పావని చాలా సంతోషించారు. శైలజ చూసి కూడా కావాలనే పలకరించకుండా ముఖం తిప్పుకుంది.
రాజారాం గారి పుట్టిన రోజు వేడుకలా చేసుకున్నారు. రాము మేడ మీద ఉండడం చూసి శైలజ వెళ్లింది. రాము ఇదే మంచి సమయం శైలజ కి సీరియస్ గా విమలతో ఉన్న తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు.
శైలజ వస్తునే…
శైలజ : హాయ్ రాము….ఈ సారి ఏం స్టోరీ చెపుతున్నావు. కానీ నాకు తెలియదు నువ్వు కధలు బాగా చెపుతావని.
రాము కి శైలజ మాటలు వింటూనే నషానికి అంటుకుంటుంది. అసలు తినకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని మనసు లో అనుకుంటున్నాడు.
శైలజ : ఇదిగో నాన్న బర్త్ డే కేక్ అని …చిన్న కేక్ ముక్క రాము కి ఇచ్చి …తిను అంది.
రాము : తీసుకుని తింటుంటే…చాలు తిన్నది…తినమంటే మొత్తం తినెయ్యమని కాదు…అని సగం తిన్న కేక్ లాక్కుని, తాను గబుక్కున తినేసింది.
రాము కి చెయ్యి లేపి కొట్టాలని అనిపించింది. తన పరిస్థితిని గమనించి మౌనంగా ఊరుకున్నాడు.
విమల రాము ను ఆట పట్టించడం మానడం లేదు.
మరుసటిరోజు ఉదయమే రాము ను రాజారాం కాలేజీ లో వదిలి పెట్టాడు.
రాజారాం కి , పావని కి రాము రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఓ రోజు రాత్రి రాజారాం , తన భార్య పావని తో అంటున్నాడు.
రాజారాం : పావని…రాము మీద నీ అభిప్రాయం ఏమిటి.
పావని : మంచివాడు…అయినా ఎందుకు అడుగుతున్నారు.
రాజారాం : ఆ…ఏం.. లేదు అని నసుగుతున్నాడు…. పాపం తనకు తల్లి తండ్రి లేరు. నా అనే వాళ్లు లేరు. చాలా తెలివైన వాడు. భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయికి వెళతాడు. రాము ను మనం శాశ్వతం గా మనతో ఉంచేసుకుంటే…అన్నాడు.
పావని : అంటే మీ ఉద్దేశ్యం…
రాజారాం : మన శైలజ కి రాము అంటే ఇష్టమే కదా…వాళ్లకి పెళ్లి చేస్తే బాగుంటుంది…కదా.
పావని : తన మనసు లో మాట భర్త నోట విన్నందుకు సంతోషంగా…అవును…కానీ రాము ఉద్దేశ్యం తెలుసు కోవాలి కదండి. అంది.
రాజారాం : అవును…. ఇంకా రాము చదువు పూర్తి చెయ్యాలి. తను విదేశాల్లో చదవడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాడు.
పావని : అవునా….మన అదృష్టం బాగుండి అన్ని సజావుగా జరిగితే చాలు.
నెలలు గడుస్తున్నాయి….
రాము కి కాలేజీ లో, వాళ్లు బ్రాంచి విద్యార్థులు అందరికీ ఇండస్ట్రీయల్ టూర్ అని దేశం లో ని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ తో నడిచే పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా పని చేస్తాయో, చూపించడానికి ఒక నెల రోజులు కాలేజీ వారు ఏర్పాటు చేశారు.
రాము ఈ విషయం , ఊరిలో ఉన్న ప్రిన్సిపాల్ గారి కి, రాజారాం కి తెలియచేసీ టూర్ వెళ్లాడు.
సీన్ - 35
అదే సమయంలో విమల పరిస్థితి ఇంటిలో ఏం బాగోలేదు. తను ఇంటిలో తల్లి కి చెప్పినట్లు పెళ్లి కి తీసుకున్న రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. తల్లి ఈ సారి బాగా ఒత్తిడి చేస్తుంది. విమల కి ఏం చేయాలో తోచడం లేదు.
ఒకరోజు విమలకి తెలియకుండా, జగిత్యాల వెళ్లారు. ఇది వరకే దూరపు బంధువు విమలను ఒక పెళ్లి లో చూసి విమల తల్లి ని సంబంధం కోసం అడిగారు. వారి దగ్గరకు విమల తల్లి తండ్రులు వెళ్లి పెళ్లి కి అంగీకరించి వచ్చారు.
మరుసటిరోజు విమల తో తల్లి నీ పెళ్లి కి లగ్గాలు పెట్టేసాం, ఈ నెలలో నే పెళ్లి అనేటప్పటికీ విమల కి గుండె ఆగినంత పనైంది.
ఏం చేయాలో తోచడం లేదు. ఎవరికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. రాము కి విషయం ఎలా చెప్పాలి అని ఏడుస్తుంది.
విమల తల్లి , విమల ను బయటకు కూడా పంపడం మానేసింది.
విమల కి ఒక ఆలోచన వచ్చింది. ప్రిన్సిపాల్ గారి దగ్గర కి వెళ్లి రాము తో తన ప్రేమ, ఇంటి లో బలవంతపు పెళ్లి గురించి చెపితే పరిష్కారం దొరుకుతుంది అనుకుంది.
మూడు రోజుల తర్వాత విమల తల్లి ని అడిగి ప్రిన్సిపాల్ గారి ఇంటికి కి వెళ్తాను. పని ఉంది. సరే అని తండ్రి ని తోడు ఇచ్చి పంపింది. విమల ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళాకా తండ్రి ని బయట ఉండమని చెప్పి , లోపలికి వెళ్లింది.
విమల ను చూసి …ప్రిన్సిపాల్ గారు రా .. విమల కూర్చో అన్నారు.
ప్రిన్సిపాల్ గారు : విమల ముఖం చూసి ఏంటి విమల నీరసంగా, ఉన్నావు .... ఒంట్లో బాగాలేదా.
విమల : బాగానే ఉంది సార్…మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. రాము ….
అనగానే …వెంటనే అడ్డు తగిలి
ప్రిన్సిపాల్ గారు : ఆ…ఆ…ఆ... అదేనమ్మా రాము గురించి నేను నీకు ముఖ్య విషయం చెప్పాలి. నాకు నిన్న నే ఉత్తరం రాసాడు. ఒక నెలరోజుల పాటు కాలేజీ టూర్ దేశమంతా వెళ్తున్నారంట…బహుశా నిన్ననే బయలు దేరి ఉండవచ్చు. ఇంకో విషయం విమల, రాము ప్రతిభ, తెలివి తేటలు చూసి అమెరికా లో పై చదువులు చదివించడానికి, తన కాలేజీ లో లెక్చరర్ గారు ట్రైనింగ్ ఇస్తున్నారంట. మనం రాము తప్పకుండా అమెరికా లో చదివి చాలా గొప్ప వాడు అయిపోతాడమ్మ…. అని సంతోషంగా ఆయన పంథా లో చెప్పుకు పోతున్నారు.
అదంతా విని విమల కి కాసేపు శూన్యం లా అనిపించింది.
ప్రిన్సిపాల్ గారు : విమల…విమల… ఏంటి అదోలా ఉన్నావు…ఆ.. ఇందాక ఏదో చెప్పాలి అన్నావు…. రాము తో ఏమైనా చెప్పాలా…
విమల కి అంతా చీకటిగా కనిపిస్తుంది.
విమల : అవును సార్… నాకు పెళ్లి కుదిరింది. ఈ నెలలో నే, మీకు చెప్పుదామని వచ్చాను. వీలైతే రాము కి తెలియ పరచండి.
ప్రిన్సిపాల్ గారు : అలాగే విమల.
విమల తండ్రి తో తిరిగి ఇంటికి వస్తూ,.. మనసు లో అనుకుంటుంది. ఇప్పుడు ఎదిరించి రాము ను పెళ్లి చేసుకుంటే, రాము భవిష్యత్తు ఇక్కడి తో ఆగిపోతుంది. రాము ఇంకా విదేశాల్లో చదవాలి, పెద్ద స్థాయిలో కి రావాలి. ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఇంటిలో ఆగరు…. విమల కి ఆసమయంలో ఆత్మహత్య చేసుకుందామని అనిపించింది. మరలా కాసేపు ఆగి తాను అలా చేస్తే రాము బ్రతకడు అని తెలిసి , తన జీవితం త్యాగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లి తో పెళ్ళి కి ఒప్పుకుంది.
ఆ రోజు రాత్రి విమల రాము తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
విమలకి పరిణీతి గా ఆలొచిస్తుంది గాని, ఆ పరిణితి తోనే తన జీవితం త్యాగం అవుతుందని ఏనాడూ ఊహించుకోలేదు.
మిగిలినది ఎపిసోడ్ - 8 లో
యడ్ల శ్రీనివాసరావు 5 June 2022.
No comments:
Post a Comment