ఏమవుతుందో ఏమో
• ఏమో…ఏమో…. ఏమవుతుందో ఏమో…
• ఏమో…ఏమో….నా లో ఏమవుతుందో ఏమో…
• ఈ చల్లని గాలులు తాకుతు ఉంటే
• ఏదో తెలియని వింతవుతుంది
• నాలో పులకింతకు తోడవుతుంది.
• వీచే ఈ గాలులు కనురెప్పల నే తాకుతూ
• సిగ్గులు కురిపిస్తున్నాయి.
• నాలో మెరుపులు కనిపిస్తున్నాయి.
• ఏమో…ఏమో…. ఏమవుతుందో ఏమో…
• ఏమో…ఏమో….నా లో ఏమవుతుందో ఏమో…
• ఏమిటో ఇలా….ఎందుకో ఇలా
• ఈ పిల్ల గాలి యే శ్వాస గ మారి
• తెలిసిన స్పర్శను స్మరణ కి తెస్తుంది
• నాలో పరిమళం నింపుతుంది.
• ఈ హాయి గాలి యే ఆరతి అవుతూ
• వెలుగు ను చూపిస్తుంది
• నా జీవన జ్యోతి ని తలపిస్తుంది.
• ఏమో…ఏమో…. ఏమవుతుందో ఏమో…
• ఏమో…ఏమో….నా లో ఏమవుతుందో ఏమో…
• ఏమిటో ఇలా….ఎందుకో ఇలా
• ఉండలేక నే గాలి ని అడిగా…
• చల్లగాలిని అడిగా
• ఈ తియ్యని గాలి చెవిలో చేరి
• గుసగుసలాడుతూ
• చెలి చిరునామా చెబుతొంది.
• చెలి నే తాకివచ్చి నాకు సందేశం వినిపిస్తుంది.
• నాలో పరవశాన్ని పులకరింపు చేస్తుంది.
• ఏమో…ఏమో…. ఏమవుతుందో ఏమో…
• ఏమో…ఏమో….నా లో ఏమవుతుందో ఏమో….
యడ్ల శ్రీనివాసరావు 13 June 6:00 pm.
No comments:
Post a Comment