దిగులెందుకే తామర
• దిగులెందుకె తామర దిగులెందుకె
• నిన్నే చూస్తున్న గులాబీ గుబులవుతుంది.
• నీ కలువ కన్నులు కలవరముగ చూస్తుంటే
• మూగపోయిన నా మనసు మౌనంగా రోదిస్తుంది.
• దిగులెందుకె తామర దిగులెందుకె
• నిన్నే చూస్తున్న గులాబీ గుబులవుతుంది.
• నీ నగుమోము దీనంగా చూస్తుంటే
• నీ లోని తామర తళుకులు వెలవెల బోతున్నాయి.
• భయమెందుకు బాధెందుకు
• ఈ కౌగిలి విడవను … నిను వీడి పోను
• ఎందుకో ఈ కాలమంతా
వికాసం లేని ఆకాశం లా ఉంది
• నా మాట మరువను .... నీ చేయి వదలను.
• చూడు చూడు ఆవరించిన
ఈ రంగులు పేలవంగా చూస్తున్నాయి.
• కాలం పెట్టే పరిక్షలో కలకలమే కదా
కలిసి జీవించడానికి పునాది.
• దిగులెందుకె తామర దిగులెందుకె
• నా గుండె చప్పుడు వినిపిస్తుందా
• నా చేయి స్పర్శ తెలుస్తుందా
• ఈ కౌగిలి విడవను…. నిను వీడి పోను.
ఆవరించిన = చుట్టూ చేరి ఉన్న
యడ్ల శ్రీనివాసరావు 2 June 2022 , 3:00 PM.
No comments:
Post a Comment