విశ్వం ఓ విమలం
• విశ్వం ఓ విమలం
ఆ విమలం లోని కమలం శివం .
• విశ్వం ఓ విమలం
ఆ విమలం లోని కమలం శివం .
• ఆ కమలం కలిగిఉంది మౌనం .
ఆ మౌనం లో పుట్టింది నాదం . . .
ఓం . . . ఓం . . . ఓం.
అదే ఈ సృష్టికి చైతన్యం .
• విశ్వం ఓ విమలం
ఆ విమలం లోని కమలం శివం .
• విశ్వం ఓ విమలం
ఆ విమలం లోని కమలం శివం .
• పసిడి కాంతుల పాలపుంతలు
సృష్టి నీరాజనాలు .
• నవ గ్రహాలు కృష్ణ బిలాలు
శక్తి మేళనలు .
• ఓం కారం శివుని నాదం
అదే సితారల శోభకు జీవం .
• మనిషి మౌనమేగి నాడు
తన లోనే వినిపించును ఓం కారం.
• విశ్వం ఓ విమలం
ఆ విమలం లోని కమలం శివం .
• విశ్వం ఓ విమలం
ఆ విమలం లోని కమలం శివం .
విమలం = నిర్మలం
సితారలు = ఆత్మలు
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 9 Oct 2026 10:30 AM.
