Wednesday, January 31, 2024

456. దేవతల్లి

 

దేవతల్లి



ఈ చోటి కర్మ   ఈ చోటే.

అణువు లాగ పుట్టి    ఆకాశమంతెదిగిన

అబ్బురపడు  నిను కన్న తల్లి,


ఆకుచాటు    పిందిలెక్క    

పైటకొంగులో  కప్పి   పెద్దచేయు   ఆ   చిట్టితల్లి.


ఇరుగుపొరుగు    లెల్ల  పొగడంగ

నీ  దిష్టి తీసేను   ఆ   పిచ్చితల్లి.

అడ్డంగా  ఎదిగినా    బిడ్డనే  పొదిగినే

కల్ల  కపటములు    లేని   కల్పవల్లి.


పసివానివే   నువు     ముసలైనా   గాని

మురిసిపోవు   ఆకళ్ల తో   చూసి   నీ తల్లి.

చచ్చినా   చావని   ప్రేమని    చూపేటి

అమరజ్యోతి   ఆ   అమృతవల్లి.


పట్టిడన్నము  చాలు   పరమాన్నమొద్దు

పెట్టింది తింటాను   లేకుంటే పస్తుంటాను.

చెంత పడి నుంటాను.

వదలకని  వేడింది     వెర్రి నా తల్లి.


కన్నోళ్ళ  బాధలు     కన్నీటి గాధలు

చెప్పుకొని పోతేను   చాట భారతాలు.

తిరిగి చూసేసరికి   మరల

తరుముకొచ్చు    మన  జీవితాలు.


ఓం నమః శివాయః🙏🔱🕉️

యడ్ల శ్రీనివాసరావు 31 Jan 2024 12:30 pm.



Thursday, January 25, 2024

455. అనంత గానం

 

అనంత గానం

Dedicated to my childhood friend for  singing talent.



• ఓ కోయిల   కూసెను   రాగం

  అది  మనసును    మీటిన  శ్రావ్యం.

• ఓ కోయిల    కూసెను  గానం

  అది  వయసుకు     చూపెను   బాల్యం.


• ఆ రాగం    ఆనంద రాగం

  ఆ గానం    సునంద భోగం.

• రాగాన       భోగం తో       పొందేను   పరవశం

  వయసు న   మనసు లో    చేరేను    పసితనం.

• ఆ కోయిల      పేరే    అనంత.

  తను పాడగా   కలిగే పులకింత.


• ఓ కోయిల    కూసెను   రాగం

  అది   మనసును    మీటిన  శ్రావ్యం.

• ఓ కోయిల    కూసెను    గానం

  అది    వయసుకు    చూపెను  బాల్యం.


• గత మెరిగిన    కోయిల    గమకాలు   పలికింది.

  శృతి తెలిసిన    పాపలా     లయమై    పాడింది.

• విశ్వానికి నాధుడే      వినువీధిన    విన్నాడు.

  పార్వతితో   ప్రీతుడై     పదనిసలు    కట్టాడు.


• ఓ కోయిల     కూసెను   రాగం

  అది  మనసును   మీటిన   శ్రావ్యం.

• ఓ కోయిల    కూసెను   గానం

  అది  వయసుకు   చూపెను  బాల్యం.


• ఇది జరిగిన   కాలం లే

  తిరిగి    జరుగుతుంది లే.

• ఇది జరిగిన     కాలం లే

  తిరిగి  జరిగి     తీరాలి లే.


యడ్ల శ్రీనివాసరావు 26 Jan 2024, 2:00 AM.


సునంద = సంతోషపరుచు

విశ్వానికి నాధుడు = శివుడు

వినువీధి = ఆకాశం


Monday, January 22, 2024

454. మనో శతకం - 5

 

మనో శతకం - 5


శ్రీరామ రామ  యని  

రంగరించె  రామనామము.

పూజ జేయుచు  మందిరంబునే  మననం జేసెన్.

భరతభూమిన   శివధర్మంబుకు  దార్శకమయ్యెను.

మనుధర్మమున  బీజరూపుడని  ఎందరు దలిచెను.

శ్రీరామ జీవితం మను  

జీవితంబని  ఎవ్వ రాచరించెన్.

సుందర గుణేశ్వరా!   సుగుణాల ఈశ్వరా!    |13|


భావం:


శ్రీ రామ అంటూ రాముని నామము పలుకుతారు.

నిత్యం రామాలయం కి వెళ్లి పూజలు చేస్తూ రామ నామం పలుకుతారు.

శివుడు సృష్టించిన ధర్మానికి భరత భూమిలో రాముడే మార్గం చూపించాడు.

మనిషి పాటించ వలసిన ధర్మానికి మూలం రాముడని ఎంత మందికి తెలుసు.

రాముని జీవిత విధానం మనిషి జీవన విధానం అని ఎంతమంది మనుషులు ఆచరిస్తుంటారు.

సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా!

సంపన్నుడైన ఈశ్వరా!.


🔱🔱🔱🔱🔱


రాచపుండు   సూక్ష్మంబైన

వృక్షంబై   కాయం   కబళించున్.

కామ వికారంబుతో   మస్తిష్కం

పలికెడు పలుకుల్   గోరంతయన్న

పాపకర్మంబై   మూలాలు  నాశనం  జేయున్.

సుందరగుణేశ్వరా!   సంపన్నేశ్వరా!         |14|


భావం:

రాచపుండు అనగా కాన్సర్ చిన్నదే కదా అనుకుంటే వృక్షమంత పెద్దది గా అయి శరీరాన్ని పూర్తిగా వినాశనం చేస్తుంది.

మెదడు లో చేరిన కామ వికారం తో తూలే మాటలు గోరంతే అని అనుకున్నా అది పాపపు కర్మ యై మూలాలు నాశనం చేయును.

సుందర గుణములు కలిగిన ఈశ్వరా!.

సంపన్నుడైన ఈశ్వరా!.


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


పశ్చాత్తాపంబు  లేనిచో  క్షమము   క్రొవ్విదము

పరివర్తన లేనిచో   క్షంతవ్యము   కాలఁ దన్ను

దప్పను  మిన్నకుండిన   సుగగమంబు గాదు

దేహం   వీడినా   కర్మ   నీడై  వచ్ఛున్.

సుందరగుణేశ్వరా!   సంపన్నేశ్వరా!         |15|


భావం:

పశ్చాతాపం లేని వారిని క్షమించడం అనేది పాపము తో సమానం.

పరివర్తన రాని వారిని క్షమించినా సరే అది  ప్రకృతి చే తిరస్కరించ  బడుతుంది .

చేసింది తప్పని తెలిసినా  మౌనం గా ఉంటే జీవన పయనం సరిగా ఉండదు.

శరీరం వదిలేసినా   కర్మ నీడలా  వస్తుంది.

సుందర గుణములు  కలిగిన ఈశ్వరా!.

సంపన్నుడైన  ఈశ్వరా!.


యడ్ల శ్రీనివాసరావు 22 Jan 2024 , 6:00 am


453. మనో శతకం - 4


మనో శతకం - 4



దైవంబెన్నడు   తొలగింపదు   చిక్కు్లన్ 

నంత ప్రార్దించగా  మార్గంబు  చూపున్ 

ముడి   నీ  దైనందున  విరియు  కర్మ  నీదగున్.

సుందరగుణేశ్వరా !  సంపన్నేశ్వరా!        |10|

భావం

భగవంతుడు ఏ నాడు నీ సమస్యలను తొలగించడు. కానీ భగవంతుని ప్రార్ధించగా సమస్యలు తొలిగే మార్గం మాత్రం కనిపించును. ఎందుకంటే సమస్యలు నీవే సృష్టించుకున్నందున పరిష్కారం చేసుకునే కర్మ భాధ్యత కూడా నీదే అగును. సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్న ఈశ్వరా!


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


సాత్వికుండై  నల్లూరి  రుద్రాభిషేక  యుక్తుడై 

పురుషార్ధంబు  చేయ  విభుడు  వీరత్వమే కర్మంబని

విధిన  దెల్పగ రామ  విల్లంబుతో దుష్ట  పోరుబట్టెన్.

మంచితనంబెన్నడు   అసమర్థత కాబోదు.

సుందరగుణేశ్వరా ! సంపన్నేశ్వరా!           |11|

భావం

జన్మతః  శాంతి గుణము  కలిగిన  అల్లూరి సీతారామరాజు నిత్యం లోక కల్యాణం కోసం శివుని కి రుద్రాభిషేకం చేస్తూ, ప్రజలకు సేవ చేసేవాడు.   కానీ మన్నెం లో స్త్రీలపై  జరుగుతున్న అఘాయిత్యాలకు , వీరత్వం  అవసర మైన  కర్మ అని శివుడు తెలియచేయగా రామ బాణం తో దుష్టులైన బ్రిటిష్ వారిపై పోరాటం చేసాడు. మంచితనం అనేది ఎప్పుడూ అసమర్థత కాదు. సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా!   సంపన్నుడైన ఈశ్వరా!


🔱 🔱 🔱 🔱 🔱


బంధము బలమగు ఆత్మీయతన

బంధము భంగపడు కపటత్వమున

బంధము బంధించు బానిసత్వమున

బంధము కర్మయగు భవిష్యజన్మమున

బంధం భారమగు కలతన.               |12|


భావం:

ఆత్మీయత ఉన్నచోట బంధాలు విడదీయలేనంత బలంగా ఉంటాయి. మోసం ఉన్నచోట బంధాలు నాశనం అవుతాయి. బానిసత్వం ఉన్నచోట బంధం చెరసాల అవుతుంది. తదుపరి జన్మకు బంధంలో కర్మ య మార్గం అవును. మనస్పర్థలున్నచోట బంధాలు చాలా భారం అవును.


యడ్ల శ్రీనివాసరావు 22 Jan 2024, 6:00 Am.




Tuesday, January 16, 2024

452. బాల్య పిపాసి (# 90's Web Series Observation)


బాల్య పిపాసి

( Observation from #90’s web series Title song)

పిపాసి = One Who Thirsty


• వయసు   పలుకుతోంది

  మనసు    జారుతుంది.

• సాగుతున్న   బాల్యం లో

  ఏదో     జరుగుతుంది

  అది ఎంతో   తికమకగా ఉంది.


• వయసు    పలుకుతోంది

  మనసు     జారుతుంది.

• కళ్లు    వెతుకుతున్నాయి   ఓ  స్వరం  కోసం.

  పెదవి  విచ్చుకుంటుంది     ఓ  రూపు   కోసం.


• అర్దం కాని భావమిది      ఆనందం కురిపిస్తుంది.

  వ్యర్థం కాని కాలమిది     అనుభవం చూపిస్తుంది.


• తాకిన ఈ గాలిలో     తనువు తేలుతుంది.

  తపనలు   తోడుగా   కలవరిస్తు  ఉన్నాయి.


• వయసు    పలుకుతోంది

  మనసు     జారుతుంది.

• సాగుతున్న    బాల్యం లో

  ఏదో    జరుగుతుంది

  అది ఎంతో    తికమకగా  ఉంది.


• పాదాలు   అడుగుల్లో     చప్పట్లు  చరిచాయి. 

  నిదుర లో    రాగాలు      మువ్వలా మోగాయి.


• మౌనం లో  నవ్వులు      జడగంటల  సవ్వడి లా. 

  కాటుక తో  టపటపలు   హృదయానికి  గారం లా.

• తేలుతున్న   వయసు కి 

  మనసు    తెలియ లేదు.

• ఎగురుతున్న   తూరీగ కి

  దిక్కులు   తెలియ రాదు.


• క్రాపుల   కేరింత లు    

  తుమ్మెదల కు    అలజడవుతూ ....

• సాగుతున్న    బాల్యం లో

  ఏదో    జరుగుతుంది

  అది ఎంతో   తికమకగా ఉంది.


యడ్ల శ్రీనివాసరావు 17 Jan 2024, 1:00 am.


Monday, January 15, 2024

451. మనో శతకం - 3

 

మనో శతకం - 3




దైవంబు  నెరిగినా   సత్యంబు  నెరుగున్.
సజ్జనుండెన్నడు    నిష్కల్మషంబున
ఖ్యాతి  నొసంగక   పురుషార్ధుడై 
నడుగులు  వేయు   స్వర్గ మార్గంబున.
మాయా లోలుడు   ఇంద్రియ  బానిసై
వికారంబులే   స్వర్గంబని   తలచెన్.
సుందరగుణేశ్వరా!     సంపన్నేశ్వరా!     |7|



భావం 
దైవాన్ని   తెలుసుకున్న వాడు,   సత్యాన్ని తెలుసుకుంటాడు .  ఇతరుల కు మంచి చేయువాడు , ఏ విధమైన కల్మషం లేకుండా,    కీర్తి ఆశించకుండా సేవ చేయుచు ,   అదే స్వర్గానికి దారి అనుకుంటూ నడుస్తాడు …. 
మాయకు వశమైన వాడు  కర్మేంద్రియాలకు  బానిస గా మారి ,  శారీరక వికారాలు  స్వర్గమని   తలుస్తూ ఉంటాడు.    సుందరమైన  గుణములు  కలిగిన ఈశ్వరా!    సంపన్నుడైన  ఈశ్వరా!


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️



కలుపు   దీయువాడెన్నడు    కబోది  కాడు
కండ్లు లేకున్నా   కడకు   పండ్లు  పండించున్.
నేల  విస్తారంబు    గాదు   సారంబెరిగినోడు
కబోదైతే    నేమి?    కాపైతే  నేమి?
సుందరగుణేశ్వరా!    సంపన్నేశ్వరా!      |8|


భావం

పంటలో కలుపు  మొక్కలు  తీయువాడు  ఎన్నడూ చూపు లేని  వాడు కాడు.   ఒకవేళ కళ్లు లేకపోయినా చివరికి  ఫలాలు  పండిస్తాడు.   నేల ఎంత ఎక్కువ ఉన్నది   అనే దాని కంటే    ఆ నేలలో  ఎంత సారం ఉన్నదో   తెలుసుకున్న వాడు,  గుడ్డివాడు అయితే ఏంటి?    పండించే    రైతు అయితే  ఏంటి?

అదే విధంగా…

సమాజం లో చెడును  రూపుమాపేవాడు  ఎన్నడూ ముందు  చూపు లేని  వాడు కాడు.   ఎవరూ తోడు లేకున్నా  చివరికి  మంచిని   నెలకొల్పుతాడు.  సమాజం ఎంత పెద్దది  అన్నది  ముఖ్యం కాదు. సమాజం నాడి  పట్టినోడు  ముందు చూపు   లేనోడైతే ఏంటి?  నాయకుడైతే   ఏంటి?   సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా!  సంపన్నుడైన ఈశ్వరా!


🔱 🔱 🔱 🔱 🔱 🔱



బుణపాశంబు  నొసంగక   వేషధారి  వేదికెక్కున్.
పోషణకై   క్షణమొక   వర్ణంబుతో    పాత్రనెక్కినా 
రక్తి గమనించు   దార్శనికుండు    బేరీజు తో
ఫలితంబిచ్చు   కర్మమే  సుఖదుఃఖఃబుల  ఆరా.
సుందరగుణేశ్వరా!   సంపన్నేశ్వరా!       |9|

భావం

బుణానుబంధం  అనేది  బిగిసిన తాడు  అని తెలియక    జీవితం అనే  నాటక  వేదిక పైకి   మనిషి పాత్ర తో వస్తాడు.   జీవితం గడపడం కోసం  ప్రతి క్షణం  రక రకాల  ఆలోచన లనే   రంగులు మారుస్తూ వేషధారణ తో   పాత్రలు  వేస్తుంటాడు.
….
మనిషి పాత్ర  యెక్క  రక్తిని   గమనించు వాడు  దర్శకుడైన శివుడు.   ఆయన ప్రతి క్షణం లెక్కలు వేస్తూ,  ఇచ్చే కర్మల ఫలితాలు   సుఖ దుఃఖాలు గా  మనిషి కి   వలయం  అవుతాయి.   సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా!    సంపన్నుడైన ఈశ్వరా!


యడ్ల శ్రీనివాసరావు 16 Jan 2024 9:00 am .


Sunday, January 14, 2024

450. మనో శతకం - 2

 

మనో శతకం - 2



తప్పని  చెప్పదు    సంఘము

నెప్పుడు  ఒప్పుల్.

ఇప్పటికిది    మేలుయని 

కల్ల మాటలు  ఆడిన …

ఎప్పటికీ వెంటాడు

సత్యము పాశము లెక్క.

సుందరగుణేశ్వరా!  సంపన్నేశ్వరా!      |4|


భావం 

మంచి పనులను ఎన్నడూ సమాజం తప్పు అని చెప్పదు. ఈ సమయానికి ఇదే ఉత్తమం అని అవసరం కోసం అబద్ధాలు మాట్లాడితే, సత్యం ఉరితాడై నిను వెంటాడుతూనే ఉంటుంది…సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


🔱   🔱  🔱  🔱  🔱


మాయనుచుండే   సకలం  బొక్కటని.

వలయంబున   రావణుడావహించ గా

దోషంబుతో   నిండెన్   సాంగత్యం.

హితంబు లేని చోట సాన్నిహిత్యంబెట్లుండున్.

సుందరగుణేశ్వరా! సంపన్నేశ్వరా!       |5|


భావం

మాయ ఎప్పుడూ మనమందరం ఒకటే అని అంటుంది. ఒక సమూహం లో రావణుడు వంటి వికారి గుణాలున్న వారు ఉంటే, ఆ సమూహం దోష పూరితం అవుతుంది. మంచి లేని చోట ఆత్మీయత ఎందుకు ఉండును? సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


🔱  🔱  🔱  🔱  🔱


మాయ జెప్పు  మాటలకు  మైకంబు కమ్మగా

బుద్ధి హీనమై  మస్తిష్కంబున   స్థితం కోల్పోవున్.

అంత మనుజ  మదిన  స్థాయి దిగజారున్.

సుందరగుణేశ్వరా!  సంపన్నేశ్వరా!        |6|


భావం

మాయ కు వశమైన వారు చెప్పే మాటల వలన , విన్న వారికి మత్తు ఆవహించి , వారి బుద్ధి నశించి ఆలోచనల లో  స్థిరత్వం పోగొట్టుకుంటారు. తద్వారా, ఇతరుల మనసులో అప్పటి వరకు ఉన్న స్థానం దిగజార్చు కుంటారు. సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


యడ్ల శ్రీనివాసరావు 15 Jan 2024 , 12:10 am.




449. మనో శతకం - 1

 

మనో శతకం - 1



నమ్మిన నాయందే

శివుడున్నాడనుచు విర్రవీగన్.

ఎప్పుడు నల్గురులో నొక్కడను

భావన కల్గజేయునది శివుడొక్కడే.

సుందరగుణేశ్వరా!  సంపన్నేశ్వరా!      |1|


భావం

శివుని పైన విశ్వాసం ఉన్నందున ఆయన నా తోనే ఉన్నాడని అహం తో విర్ర వీగను. అన్ని వేళలా నలుగురిలో ఒకడిని అనే భావన శివుడే కలిగించును. సుందరమైన గుణము లు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


పంచెడు ప్రేమమ్ శివభిక్షైనా

ఫలితంబు వికారు(రా)ల్ పై

దుందుభియే నీ కర్మంబన్న ముక్కంటిన్

శిరసావహించిక చేయు గతి ఏమీ.

సుందరగుణేశ్వరా! సంపన్నేశ్వరా!       |2|


భావం

 పంచుతున్న ప్రేమంతా శివుని దైనా సరే ఫలితం మాత్రం మాయా గుణా(దారు)ల పై పోరాటమే, నీ జీవిత కర్మ (పని) అని శివుడు తెలియచేస్తుంటే, అంగీకరించక ఏమి చేయాలి. సుందరమైన గుణము లు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


నువు వీడిన చెప్పుడు మాటలు

కొన్ని చెవులకు ఇంపే గానీ …

అవి చెరిపెడు బంధముల బిగియు.

ఎప్పటి కర్మలు అప్పటి ఫలములు

నివ్వెరపోదువు గానీ …

నిను వీడవు నీచేష్టల విధములు.

సుందరగుణేశ్వరా! సంపన్నేశ్వరా!       |3|


భావం  

నువ్వు విడిచిన తప్పుడు మాటలు, విన్న కొందరికి ఆనందమిచ్ఛినా,  అవి బిగిసు కొని బంధాలను చెరిపెస్తాయి. ఎప్పుడు చేసిన కర్మలు అప్పుడే ఫలితం ఇస్తాయి … నువ్వు ఊహించలేవు కానీ, నీ చేష్టలతో చేసిన పనులు నిన్ను ఎన్నటికి విడిచి పెట్టవు. సుందరమైన గుణము లు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


యడ్ల శ్రీనివాసరావు 14 Jan 2024 6:00 pm.



Wednesday, January 10, 2024

448. సీతాకోకచిలుక -2

 

సీతాకోకచిలుక -2



• కోకెందుకే   చిలుకా    నీకు   కోకెందుకే

  శీతలంలో   సిగ్గు లొలికే    సీతాకోకచిలుక.


• కోకలో   దాచిన    వర్ణాలు

  కోకిల    చూడకపోతే

  గానమే   సాగునా 

  ప్రకృతి  సరాగమే  ఆడునా.


• కోకెందుకే    చిలుకా    నీకు  కోకెందుకే

  శీతలంలో    సిగ్గు లొలికే    సీతాకోకచిలుక.


• చిలుకవు   కాదు  కానీ

  సిత్రాలు  నిండిన  సింగారివి.

• వధువువు   కాదు   కానీ

  మధువు ను   గ్రోలే   మహారాణి వి.


• కోకెందుకే    చిలుకా    నీకు  కోకెందుకే

  శీతలంలో   సిగ్గు లొలికే   సీతాకోకచిలుక.


• చిన్నారి    నీ రూపం

  చెంగున    ఎగురుతుంటే

  మలయం   ఎరుగదా 

  నీ   బాహు    సొంపులు.


• రెక్కల    సౌమ్యం తో

   రెప రెప లాడుతూ ఉంటే

   కనువిందు   కాదా 

   నా కమ్మని  కావ్యానికి.

  

• కోకెందుకే   చిలుకా    నీకు    కోకెందుకే

  శీతలంలో   సిగ్గు లొలికే     సీతాకోకచిలుక.

• కోకలో     దాచిన    వర్ణాలు

  కోకిల    చూడకపోతే

  గానమే    సాగునా

  ప్రకృతి   సరాగమే  ఆడునా.


మలయం = తోట, వనం.


యడ్ల శ్రీనివాసరావు 11 Jan 2024 , 1:00 pm.


Saturday, January 6, 2024

447. అమ్మ


అమ్మ 



• అమ్మ చేతి    ముద్ద  యే   అమృతం.

  అమ్మ లాలి   పాట   ఓ     హర్షితం.


• పాకులాడింది   పసితనం

  అమ్మ   స్పర్శ   కోసం.

• అమ్మ  పొత్తిళ్ళలో   దాగింది 

  నుని  వెచ్చని   స్వర్గం.


• అమ్మ చేతి      ముద్ద  యే    అమృతం

  అమ్మ లాలి     పాట     ఓ     హర్షితం.


• అమ్మ చేతి తో    సబ్బు రాసిన    

  వయసు సంబరం.

• బుగ్గలొత్తుతూ    పౌడరు  అద్ధిన   

  సమయం   సుందరం.

• అమ్మ చెంగు తో      చెమట నద్ధిన

  క్షణాలు    మధురం.

• చేయి పట్టి     బజారు    తిప్పిన

  రోజులు     అద్బుతం.

 

• అమ్మ చేతి     ముద్ద  యే   అమృతం

  అమ్మ లాలి     పాట   ఓ     హర్షితం.


• అమ్మ లోని    అందం

  అంతులేని   ఆనందం.

• ఆ  తీపి   బంధం

  ఈ జన్మకు   శుభకరం.


• వయసు   పెరిగింది     కానీ

  అమ్మ    మారలేదు.

• మనసు    అలసింది    కానీ

  అమ్మ  ప్రేమ    తరగలేదు.


• అమ్మ లోని    దైవం  శివం.

  అదే ఈ  జీవిత  భాగ్యం.


• అమ్మ చేతి   ముద్ద  యే    అమృతం

  అమ్మ లాలి   పాట   ఓ     హర్షితం.


యడ్ల శ్రీనివాసరావు  7 Jan 2024 ,12:30 AM .


Friday, January 5, 2024

446. అంతర్యుద్ధం

 

అంతర్యుద్ధం



• వేదన  కాదు    రోదన  కాదు

  శోధన  ఇది

  సాధన ఇది

  సత్యాన్వేషణ  ఇది.


• అజ్ఞానం లో    అంధకారంలో

  సాగే   జీవనానికి

  యజ్ఞం  ఇది

  అజ్ఞాతం ఇది.


• బ్రతుకు పంట లో    కలుపును

  ఏరి వేసే     శ్రమం ఇది.

• సాగే కాలంలో   ఎత్తు   పల్లాలను 

  సాగు   చేసే      శ్రామికం ఇది.


• వేదన  కాదు    రోదన  కాదు

  శోధన ఇది

  సాధన ఇది

 సత్యాన్వేషణ  ఇది.


• మరచిన    మూలాలకు

  విలువలు  తెరిచే    గమనం ఇది.

• అపజయాలను  ఆభరణం  చేసి

  విజయ కేతన   బావుటా   ఇది.


• ఆలోచన    జ్వాలల కు

  దైవ మనే   ఆజ్యం  పోసే   

  కాంతి ఇది.

• శాంతి కోసం    మాయతో   సమరం

  చేసే   అంతర్యుద్ధం  ఇది.


• వేదన  కాదు    రోదన  కాదు

  శోధన   ఇది

  సాధన  ఇది

  సత్యాన్వేషణ  ఇది.


• అజ్ఞానం లో    అంధకారంలో

  సాగే   జీవనానికి

  యజ్ఞం   ఇది

  అజ్ఞాతం  ఇది.


యడ్ల శ్రీనివాసరావు 6 Jan 2024 10:00 am.


Thursday, January 4, 2024

445. అంతర్ముఖ అందాలు

 

అంతర్ముఖ అందాలు



• కనులు   మూసినా

  మనసు    తెరిచినా

• కనిపించే   ఈ సుందరం

  అదే

  నా మనసు కి  అంబరం.


• సప్త   వర్ణాల   తేజం

  మెరిసింది

  ఇంద్ర   నీలాల  కన్నుల్లో.

• చందన   సుగంధ    భరితం

  తాకింది

  ఎద లయల    లోతుల్లో.


• జర జర   సెలయేరు   రాగం

  జారింది

  చెవి   వంపు    లోయల్లో.

• తార  సితారల   సౌందర్యం

  నిండింది

  అణు వణువు   సొంపుల్లో.


• కనులు   మూసినా

  మనసు   తెరిచినా

• కనిపించే  ఈ సుందరం

  అదే

  నా మనసు కి   అంబరం.


• ధ్యాస తో      ధ్యానం

  ప్రకృతి లో    మమేకం.

• శ్వాస తో     శ్రావ్యం

  విశ్వం తో    సంయోగం.


• హరిత వనాల   అందాలు

  నా మనసు కి    పొదరిల్లు .

• నవ గ్రహాల      చందాలు

  నా ఆరా కి        లోగిళ్లు.

 

• కనులు    మూసినా

  మనసు    తెరిచినా

• కనిపించే   ఈ సుందరం

  అదే

  నా మనసు కి   అంబరం.


యడ్ల శ్రీనివాసరావు  5 Jan 2024, 1:00 am.


Wednesday, January 3, 2024

444. రా … ఒక అడుగు ముందుకు వెయ్యి

 

రా … ఒక అడుగు ముందుకు వెయ్యి


• రా  …  ఒక అడుగు  ముందుకు  వెయ్యి

  అడగకనే   అడుగులో   చోటిస్తాను.

• దేహపు భ్రాంతి లో    కలకలం    కరుగును 

  నీ జీవన వేదానికి     అమరత్వం కలుగును.


• రా …  ఒక అడుగు   ముందుకు వెయ్యి

  అడగకనే    అడుగులో   చోటిస్తాను.


• మిణుగురు వై    ఎన్నాళ్లని    జీవిస్తావు

  ధృవతార గా    నాతో     నడిపిస్తాను.


• సంతోష  మనిపించే    బంధాలు   నీకు

  ఏమంత   శాంతి నిచ్చాయో    చూడు.

• తోడనుకున్న    మనుషులు

   నీ నీడ లో    ఉన్నారేమో ...

  వెను   తిరిగి  చూడు.


• రా  …  ఒక అడుగు   ముందుకు  వెయ్యి

  అడగకనే   అడుగులో   చోటిస్తాను.

• దేహపు భ్రాంతి లో    కలకలం    కరుగును

  నీ జీవన వేదానికి      అమరత్వం కలుగును.


• నా   స్మృతి   యాత్ర లో 

  తెలియును    నీకు    నీవెవరో.

• నీ తండ్రి నైన   నను    విడిచి వెళ్ళి

  దుఃఖం లో   ఎన్నాళ్ల ని    జీవిస్తావు.

• నీ మనసున    నాకు   చోటిచ్చా   వంటే

  నీ తనువు ను    నా తలపై    మోస్తుంటాను.


• రా  …  ఒక అడుగు   ముందుకు  వెయ్యి

  అడగకనే   అడుగులో   చోటిస్తాను.


జీవన వేదం = జీవించడానికి జ్ఞానం.

అమరత్వం= మరణం లేకుండుట.

మిణుగురు = దీపపు పురుగు.


ఓం నమఃశివాయ 🙏 

ఓం శాంతి 🙏


యడ్ల శ్రీనివాసరావు 4 Jan 2024 , 10:00 am.


443. శివుని ఒడి


శివుని ఒడి



• చేరాలి   నీ ఒడికి   శివయ్య

  శుద్ధమై   చేరి    సేద తీరాలి.

• నీ   ప్రేమ     లాలన తో

  నా  శ్వాస    పరిసమాప్తం.


• అజ్ఞానం తో    సాగుతోంది

  బ్రతుకు     పోరాటం.

• బుద్ధి హీనత లో   ఇమిడింది

  నేటి     జీవనం.

• వ్యర్థ సారం   తో    గడిచే

  జీవన    గమనం.

• తప్పుల   తడక    నడకే

  నేటి   రాచ  మార్గం.


• చేరాలి   నీ ఒడికి   శివయ్య

  శుద్ధమై  చేరి    సేద తీరాలి.

• నీ   ప్రేమ     లాలన తో

  నా  శ్వాస    పరి సమాప్తం.


• భక్తి    లో    లింగ రూపమే    కానీ

  నీ మనసు  ఎందరికి   తెలియును.

• పూజ  లో   శివ నామమే    కానీ

  నీ తత్వం    ఎందరికి   తెలియును.


• చేరాలి   నీ ఒడికి    శివయ్య

  శుద్ధమై   చేరి    సేద  తీరాలి.

• నీ   ప్రేమ   లాలన తో

  నా  శ్వాస   పరి సమాప్తం.


• సాంగత్య  దోషాలే     నేడు     ప్రీతి  పాత్రం.

  కామ వికారా లే         నేడు     సర్వ  సౌఖ్యం.

  స్వార్థ చింతన లే       నేడు      తరగని ఆస్తి.

  మాయ తో   చెలిమే   నేడు    భూ'తాల'   స్వర్గం.


• చేరాలి   నీ ఒడికి   శివయ్య

  శుద్ధమై   చేరి సేద   తీరాలి.

• నీ   ప్రేమ     లాలన తో

  నా  శ్వాస   పరి సమాప్తం.


• నీవు   కోరేది     భక్తి   కాదని

  మా   'శుద్ధమైన'   మనసని

  ఎందరికి   తెలుసు.

• నీవు   కోరేది   పాలాభిషేకం  కాదని

  మా    'అరిషడ్వర్గ'  వికారాలని 

  ఎందరికి తెలుసు.

 

• చేరాలి    నీ ఒడికి    శివయ్య

  శుద్ధమై    చేరి     సేద తీరాలి.

• నీ   ప్రేమ     లాలన తో

  నా  శ్వాస    పరి సమాప్తం.


అరిషడ్వర్గ = కామము, క్రోధము, లోభము, మోహము మదము, మాత్సర్యము.


యడ్ల శ్రీనివాసరావు 3 Jan 2024  7:30 pm.


Monday, January 1, 2024

442. శివ సన్నిధి పెన్నిధి

 

శివ సన్నిధి  పెన్నిధి 


• నిర్జీవమై  చేరాను    

  శివుని   సన్నిధికి

  సజీవమై   నిలిచాను    

  తండ్రి   పెన్నిధి తో.


• చీకటి   లోకం లో

  దిక్కులు   తెలియని  ధీనుడను.

• జీవిత  గమనం లో

  గమ్యం    ఎరుగని   అంధుడను.


• నిర్జీవమై   చేరాను 

  శివుని   సన్నిధికి

  సజీవమై   నిలిచాను 

  తండ్రి  పెన్నిధి తో.


• సూక్ష్మమై   చూశా    శివుని  రూపము.

  ఆశతో    మిగిలా    విభుని    నీడ కై .

• శివుని   ప్రేమ తో    దక్కింది    భాగ్యం.

  శివుని   స్మృతి లో   నడుస్తుంది  కాలం.


• కర్మల   శ్రావ్యం తో

  బుణాలను   శూన్యం  చేస్తాడు.

• బంధాల   బాధ్యత తో

  జీవన్ముక్తి ని     ఇస్తాడు.


• నిర్జీవమై  చేరాను    

  శివుని    సన్నిధికి

• సజీవమై  నిలిచాను 

  తండ్రి   పెన్నిధి తో.


• ఎన్ని    జన్మలెత్తినా

  శివుని    సేవించి   ఉంటాను.

• జ్ఞానమనే    వెలుగు తో

  శివుని     చేరుకుంటాను.


• నిర్జీవమై   చేరాను 

  శివుని   సన్నిధికి

• సజీవమై   నిలిచాను 

  తండ్రి   పెన్నిధి తో.


పెన్నిధి = తరగని నిధి.


యడ్ల శ్రీనివాసరావు 1 Jan 2024 , 8:00 pm.


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...