Monday, January 22, 2024

453. మనో శతకం - 4


మనో శతకం - 4



దైవంబెన్నడు   తొలగింపదు   చిక్కు్లన్ 

నంత ప్రార్దించగా  మార్గంబు  చూపున్ 

ముడి   నీ  దైనందున  విరియు  కర్మ  నీదగున్.

సుందరగుణేశ్వరా !  సంపన్నేశ్వరా!        |10|

భావం

భగవంతుడు ఏ నాడు నీ సమస్యలను తొలగించడు. కానీ భగవంతుని ప్రార్ధించగా సమస్యలు తొలిగే మార్గం మాత్రం కనిపించును. ఎందుకంటే సమస్యలు నీవే సృష్టించుకున్నందున పరిష్కారం చేసుకునే కర్మ భాధ్యత కూడా నీదే అగును. సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్న ఈశ్వరా!


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


సాత్వికుండై  నల్లూరి  రుద్రాభిషేక  యుక్తుడై 

పురుషార్ధంబు  చేయ  విభుడు  వీరత్వమే కర్మంబని

విధిన  దెల్పగ రామ  విల్లంబుతో దుష్ట  పోరుబట్టెన్.

మంచితనంబెన్నడు   అసమర్థత కాబోదు.

సుందరగుణేశ్వరా ! సంపన్నేశ్వరా!           |11|

భావం

జన్మతః  శాంతి గుణము  కలిగిన  అల్లూరి సీతారామరాజు నిత్యం లోక కల్యాణం కోసం శివుని కి రుద్రాభిషేకం చేస్తూ, ప్రజలకు సేవ చేసేవాడు.   కానీ మన్నెం లో స్త్రీలపై  జరుగుతున్న అఘాయిత్యాలకు , వీరత్వం  అవసర మైన  కర్మ అని శివుడు తెలియచేయగా రామ బాణం తో దుష్టులైన బ్రిటిష్ వారిపై పోరాటం చేసాడు. మంచితనం అనేది ఎప్పుడూ అసమర్థత కాదు. సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా!   సంపన్నుడైన ఈశ్వరా!


🔱 🔱 🔱 🔱 🔱


బంధము బలమగు ఆత్మీయతన

బంధము భంగపడు కపటత్వమున

బంధము బంధించు బానిసత్వమున

బంధము కర్మయగు భవిష్యజన్మమున

బంధం భారమగు కలతన.               |12|


భావం:

ఆత్మీయత ఉన్నచోట బంధాలు విడదీయలేనంత బలంగా ఉంటాయి. మోసం ఉన్నచోట బంధాలు నాశనం అవుతాయి. బానిసత్వం ఉన్నచోట బంధం చెరసాల అవుతుంది. తదుపరి జన్మకు బంధంలో కర్మ య మార్గం అవును. మనస్పర్థలున్నచోట బంధాలు చాలా భారం అవును.


యడ్ల శ్రీనివాసరావు 22 Jan 2024, 6:00 Am.




No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...