Monday, January 22, 2024

454. మనో శతకం - 5

 

మనో శతకం - 5


శ్రీరామ రామ  యని  

రంగరించె  రామనామము.

పూజ జేయుచు  మందిరంబునే  మననం జేసెన్.

భరతభూమిన   శివధర్మంబుకు  దార్శకమయ్యెను.

మనుధర్మమున  బీజరూపుడని  ఎందరు దలిచెను.

శ్రీరామ జీవితం మను  

జీవితంబని  ఎవ్వ రాచరించెన్.

సుందర గుణేశ్వరా!   సుగుణాల ఈశ్వరా!    |13|


భావం:


శ్రీ రామ అంటూ రాముని నామము పలుకుతారు.

నిత్యం రామాలయం కి వెళ్లి పూజలు చేస్తూ రామ నామం పలుకుతారు.

శివుడు సృష్టించిన ధర్మానికి భరత భూమిలో రాముడే మార్గం చూపించాడు.

మనిషి పాటించ వలసిన ధర్మానికి మూలం రాముడని ఎంత మందికి తెలుసు.

రాముని జీవిత విధానం మనిషి జీవన విధానం అని ఎంతమంది మనుషులు ఆచరిస్తుంటారు.

సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా!

సంపన్నుడైన ఈశ్వరా!.


🔱🔱🔱🔱🔱


రాచపుండు   సూక్ష్మంబైన

వృక్షంబై   కాయం   కబళించున్.

కామ వికారంబుతో   మస్తిష్కం

పలికెడు పలుకుల్   గోరంతయన్న

పాపకర్మంబై   మూలాలు  నాశనం  జేయున్.

సుందరగుణేశ్వరా!   సంపన్నేశ్వరా!         |14|


భావం:

రాచపుండు అనగా కాన్సర్ చిన్నదే కదా అనుకుంటే వృక్షమంత పెద్దది గా అయి శరీరాన్ని పూర్తిగా వినాశనం చేస్తుంది.

మెదడు లో చేరిన కామ వికారం తో తూలే మాటలు గోరంతే అని అనుకున్నా అది పాపపు కర్మ యై మూలాలు నాశనం చేయును.

సుందర గుణములు కలిగిన ఈశ్వరా!.

సంపన్నుడైన ఈశ్వరా!.


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


పశ్చాత్తాపంబు  లేనిచో  క్షమము   క్రొవ్విదము

పరివర్తన లేనిచో   క్షంతవ్యము   కాలఁ దన్ను

దప్పను  మిన్నకుండిన   సుగగమంబు గాదు

దేహం   వీడినా   కర్మ   నీడై  వచ్ఛున్.

సుందరగుణేశ్వరా!   సంపన్నేశ్వరా!         |15|


భావం:

పశ్చాతాపం లేని వారిని క్షమించడం అనేది పాపము తో సమానం.

పరివర్తన రాని వారిని క్షమించినా సరే అది  ప్రకృతి చే తిరస్కరించ  బడుతుంది .

చేసింది తప్పని తెలిసినా  మౌనం గా ఉంటే జీవన పయనం సరిగా ఉండదు.

శరీరం వదిలేసినా   కర్మ నీడలా  వస్తుంది.

సుందర గుణములు  కలిగిన ఈశ్వరా!.

సంపన్నుడైన  ఈశ్వరా!.


యడ్ల శ్రీనివాసరావు 22 Jan 2024 , 6:00 am


No comments:

Post a Comment

494. Failures Are Accurate Winners

  Failures Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పో...