మనో శతకం - 1
నమ్మిన నాయందే
శివుడున్నాడనుచు విర్రవీగన్.
ఎప్పుడు నల్గురులో నొక్కడను
భావన కల్గజేయునది శివుడొక్కడే.
సుందరగుణేశ్వరా! సంపన్నేశ్వరా! |1|
భావం
శివుని పైన విశ్వాసం ఉన్నందున ఆయన నా తోనే ఉన్నాడని అహం తో విర్ర వీగను. అన్ని వేళలా నలుగురిలో ఒకడిని అనే భావన శివుడే కలిగించును. సుందరమైన గుణము లు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
పంచెడు ప్రేమమ్ శివభిక్షైనా
ఫలితంబు వికారు(రా)ల్ పై
దుందుభియే నీ కర్మంబన్న ముక్కంటిన్
శిరసావహించిక చేయు గతి ఏమీ.
సుందరగుణేశ్వరా! సంపన్నేశ్వరా! |2|
భావం
పంచుతున్న ప్రేమంతా శివుని దైనా సరే ఫలితం మాత్రం మాయా గుణా(దారు)ల పై పోరాటమే, నీ జీవిత కర్మ (పని) అని శివుడు తెలియచేస్తుంటే, అంగీకరించక ఏమి చేయాలి. సుందరమైన గుణము లు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
నువు వీడిన చెప్పుడు మాటలు
కొన్ని చెవులకు ఇంపే గానీ …
అవి చెరిపెడు బంధముల బిగియు.
ఎప్పటి కర్మలు అప్పటి ఫలములు
నివ్వెరపోదువు గానీ …
నిను వీడవు నీచేష్టల విధములు.
సుందరగుణేశ్వరా! సంపన్నేశ్వరా! |3|
భావం
నువ్వు విడిచిన తప్పుడు మాటలు, విన్న కొందరికి ఆనందమిచ్ఛినా, అవి బిగిసు కొని బంధాలను చెరిపెస్తాయి. ఎప్పుడు చేసిన కర్మలు అప్పుడే ఫలితం ఇస్తాయి … నువ్వు ఊహించలేవు కానీ, నీ చేష్టలతో చేసిన పనులు నిన్ను ఎన్నటికి విడిచి పెట్టవు. సుందరమైన గుణము లు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!
యడ్ల శ్రీనివాసరావు 14 Jan 2024 6:00 pm.
No comments:
Post a Comment