శివ సన్నిధి పెన్నిధి
• నిర్జీవమై చేరాను
శివుని సన్నిధికి
సజీవమై నిలిచాను
తండ్రి పెన్నిధి తో.
• చీకటి లోకం లో
దిక్కులు తెలియని ధీనుడను.
• జీవిత గమనం లో
గమ్యం ఎరుగని అంధుడను.
• నిర్జీవమై చేరాను
శివుని సన్నిధికి
సజీవమై నిలిచాను
తండ్రి పెన్నిధి తో.
• సూక్ష్మమై చూశా శివుని రూపము.
ఆశతో మిగిలా విభుని నీడ కై .
• శివుని ప్రేమ తో దక్కింది భాగ్యం.
శివుని స్మృతి లో నడుస్తుంది కాలం.
• కర్మల శ్రావ్యం తో
బుణాలను శూన్యం చేస్తాడు.
• బంధాల బాధ్యత తో
జీవన్ముక్తి ని ఇస్తాడు.
• నిర్జీవమై చేరాను
శివుని సన్నిధికి
• సజీవమై నిలిచాను
తండ్రి పెన్నిధి తో.
• ఎన్ని జన్మలెత్తినా
శివుని సేవించి ఉంటాను.
• జ్ఞానమనే వెలుగు తో
శివుని చేరుకుంటాను.
• నిర్జీవమై చేరాను
శివుని సన్నిధికి
• సజీవమై నిలిచాను
తండ్రి పెన్నిధి తో.
పెన్నిధి = తరగని నిధి.
యడ్ల శ్రీనివాసరావు 1 Jan 2024 , 8:00 pm.
No comments:
Post a Comment