శివుడే గురువు – ప్రభువు
• శివుడొక్కడే గురువు
శివుడొక్కడే ప్రభువు
• అష్ట భంగిమల సారంగుడు
ఆద మరచిన వారిని
మేల్కొల్పుతాడు.
• అష్ట సిద్ధుల సంభూతుడు
ఆశ లెరగని వారిని
చేర దీస్తాడు.
• శివుడొక్కడే గురువు
శివుడొక్కడే ప్రభువు
• బంధాలలో బాధలన్నీ
బ్రతుకు బాటలో ఆటలే
కానీ
రోదన లో మునిగే
శాపాలు కాదు.
• ఆటల లో అలసిన
తుదకు విజయమే
కానీ
అనారోగ్యము కాదు.
• శివుడొక్కడే గురువు
శివుడొక్కడే ప్రభువు
• ఆది అంతాల సారధుడు
ధీనులను మది పై
నిలుపు కుంటాడు.
• పంచ భూతాల మిళుతుడు
జీవులకు ఊపిరై
సాకుతూ ఉంటాడు.
• చుక్కాని లేని నావ
ఎటు పోయినా
కానీ
కడకు చేరాల్సింది
ఏదోక తీరమే.
• ఆత్మ బంధాలలో
ఎంత మునిగినా
కానీ
తుదకు చేరాల్సింది
పరమాత్మ సన్నిధి కే
• శివుడొక్కడే గురువు
శివుడొక్కడే ప్రభువు
సారంగుడు, సంభూతుడు, సారధుడు, మిళితుడు = శివుడు.
యడ్ల శ్రీనివాసరావు 27 Dec 2023, 6:00 pm.
No comments:
Post a Comment