మందాకిని
• ఓ సన్నజాజి నా అపరంజి.
ఇది యే కాలమో
ఇది యే రాగమో.
ఇది యే సంతమో
ఇది యే వసంతమో.
• ముసురు కమ్మిన ఈ వేళ
మసక బారని నీ అందం
మల్లె లా వికసిస్తుంది
మనసు మోహనం చేస్తుంది.
• ఓ సన్నజాజి నా అపరంజి.
ఇది యే కాలమో
ఇది యే రాగమో.
• ఈ పిల్ల తెరల జల్లుల లో
కేరింత లేస్తూ నే
ఆ నల్ల మబ్బుల మెరుపుల లో
వెలుగు నిస్తున్నావు .
• ఓ సన్నజాజి నా అపరంజి.
ఇది యే భావమో
ఇది యే మోహమో
• తుళ్లిపడే నీ కళ్ల చూపుల కు
దాసోహం.
ఎగసిపడే నీ ఎద బిగువు కి
సిద్ధం.
• ఓ సన్నజాజి నా అపరంజి.
ఇది యే సంతమో
ఇది యే వసంతమో
• నీ నడుము వీణను మీటగా
కుడి ఎడమ ఆడిన నాట్యం
చిరు జల్లులు చిమ్ముతూ
చిటపటలు ఆడాయి.
• ఇది యే భావమో
ఇది యే మోహమో
ఇది యే కాలమో
ఇది యే రాగమో
ఇది యే సంతమో
ఇది యే వసంతమో
• ఓ సన్నజాజి నా అపరంజి.
సంతము = సొంతము.
అపరంజి = బంగారు బొమ్మ
యడ్ల శ్రీనివాసరావు 4 Dec 2023 1:00 pm
No comments:
Post a Comment