Sunday, January 14, 2024

450. మనో శతకం - 2

 

మనో శతకం - 2



తప్పని  చెప్పదు    సంఘము

నెప్పుడు  ఒప్పుల్.

ఇప్పటికిది    మేలుయని 

కల్ల మాటలు  ఆడిన …

ఎప్పటికీ వెంటాడు

సత్యము పాశము లెక్క.

సుందరగుణేశ్వరా!  సంపన్నేశ్వరా!      |4|


భావం 

మంచి పనులను ఎన్నడూ సమాజం తప్పు అని చెప్పదు. ఈ సమయానికి ఇదే ఉత్తమం అని అవసరం కోసం అబద్ధాలు మాట్లాడితే, సత్యం ఉరితాడై నిను వెంటాడుతూనే ఉంటుంది…సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


🔱   🔱  🔱  🔱  🔱


మాయనుచుండే   సకలం  బొక్కటని.

వలయంబున   రావణుడావహించ గా

దోషంబుతో   నిండెన్   సాంగత్యం.

హితంబు లేని చోట సాన్నిహిత్యంబెట్లుండున్.

సుందరగుణేశ్వరా! సంపన్నేశ్వరా!       |5|


భావం

మాయ ఎప్పుడూ మనమందరం ఒకటే అని అంటుంది. ఒక సమూహం లో రావణుడు వంటి వికారి గుణాలున్న వారు ఉంటే, ఆ సమూహం దోష పూరితం అవుతుంది. మంచి లేని చోట ఆత్మీయత ఎందుకు ఉండును? సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


🔱  🔱  🔱  🔱  🔱


మాయ జెప్పు  మాటలకు  మైకంబు కమ్మగా

బుద్ధి హీనమై  మస్తిష్కంబున   స్థితం కోల్పోవున్.

అంత మనుజ  మదిన  స్థాయి దిగజారున్.

సుందరగుణేశ్వరా!  సంపన్నేశ్వరా!        |6|


భావం

మాయ కు వశమైన వారు చెప్పే మాటల వలన , విన్న వారికి మత్తు ఆవహించి , వారి బుద్ధి నశించి ఆలోచనల లో  స్థిరత్వం పోగొట్టుకుంటారు. తద్వారా, ఇతరుల మనసులో అప్పటి వరకు ఉన్న స్థానం దిగజార్చు కుంటారు. సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


యడ్ల శ్రీనివాసరావు 15 Jan 2024 , 12:10 am.




No comments:

Post a Comment

494. Failures Are Accurate Winners

  Failures Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పో...