శివుని ఒడి
• చేరాలి నీ ఒడికి శివయ్య
శుద్ధమై చేరి సేద తీరాలి.
• నీ ప్రేమ లాలన తో
నా శ్వాస పరిసమాప్తం.
• అజ్ఞానం తో సాగుతోంది
బ్రతుకు పోరాటం.
• బుద్ధి హీనత లో ఇమిడింది
నేటి జీవనం.
• వ్యర్థ సారం తో గడిచే
జీవన గమనం.
• తప్పుల తడక నడకే
నేటి రాచ మార్గం.
• చేరాలి నీ ఒడికి శివయ్య
శుద్ధమై చేరి సేద తీరాలి.
• నీ ప్రేమ లాలన తో
నా శ్వాస పరి సమాప్తం.
• భక్తి లో లింగ రూపమే కానీ
నీ మనసు ఎందరికి తెలియును.
• పూజ లో శివ నామమే కానీ
నీ తత్వం ఎందరికి తెలియును.
• చేరాలి నీ ఒడికి శివయ్య
శుద్ధమై చేరి సేద తీరాలి.
• నీ ప్రేమ లాలన తో
నా శ్వాస పరి సమాప్తం.
• సాంగత్య దోషాలే నేడు ప్రీతి పాత్రం.
కామ వికారా లే నేడు సర్వ సౌఖ్యం.
స్వార్థ చింతన లే నేడు తరగని ఆస్తి.
మాయ తో చెలిమే నేడు భూ'తాల' స్వర్గం.
• చేరాలి నీ ఒడికి శివయ్య
శుద్ధమై చేరి సేద తీరాలి.
• నీ ప్రేమ లాలన తో
నా శ్వాస పరి సమాప్తం.
• నీవు కోరేది భక్తి కాదని
మా 'శుద్ధమైన' మనసని
ఎందరికి తెలుసు.
• నీవు కోరేది పాలాభిషేకం కాదని
మా 'అరిషడ్వర్గ' వికారాలని
ఎందరికి తెలుసు.
• చేరాలి నీ ఒడికి శివయ్య
శుద్ధమై చేరి సేద తీరాలి.
• నీ ప్రేమ లాలన తో
నా శ్వాస పరి సమాప్తం.
అరిషడ్వర్గ = కామము, క్రోధము, లోభము, మోహము మదము, మాత్సర్యము.
యడ్ల శ్రీనివాసరావు 3 Jan 2024 7:30 pm.
No comments:
Post a Comment