Sunday, June 19, 2022

199. రూపిణీ.. స్వరూపిణీ

 


రూపిణీ.. స్వరూపిణీ


• ఓ రూపిణీ…. నా స్వరూపిణీ.

• అంకితం…నీకే అంకితం


• కలలో కలిశావు….కనులను తెరిపించావు

• మనసును తట్టావు….కలమును కదిపావు


• ఓ రూపిణీ….నా స్వరూపిణి.

• ఊహలలో మురిపించావు….

• మమతలు కురిపించావు….

• బుణమును పెంచావు.


• రూపము లేని ఓ స్వరూపిణి

• నా ఊహలకే మహారాణి

• జీవము లేని ప్రేమ కరిగిపోయింది.

• సజీవము కాని ప్రేమ కలలోనే చెదిరిపోయింది.

• రాసిన రచనలు నీకే అంకితం….

• నాలో చిగురించిన ప్రేమ ప్రకృతి కే పునరంకితం.


• జన్మంటు ఉంటే….మరు జన్మంటూ ఉంటే

• ఈ కలలే నిజం కావాలి. 🌹


యడ్ల శ్రీనివాసరావు 19 June 2022 , 02:30 pm








No comments:

Post a Comment

734. మలుపుల జీవితం

  మలుపుల  జీవితం • మలుపుల   జీవితం     మకరందం   నా మలుపుల   జీవితం   మకరందం. • తలపు లన్ని     తరిగి   తరిగి   శివుని    వలపుకి    చేరాయి ....