సఖి కుసుమం
• చెలి చెలి…. నా కై విరిసిన కుసుమాంజలి.
• సఖి సఖి…. నా కై వెలసిన హృదయాంజలి.
• నీ అడుగు జాడలో నిను అడగక ‘నే’ అడుగేసినా.
• నా మనసు నీడలో నిను కొలవక ‘నే’ కొలువిచ్చినా.
• నీ అడుగుతో ‘ని’ ఆందం నాకు విడువ లేని బంధం.
• నా మనసుతో ‘ని' చందం నీకు మరువ లేని నందం.
• ఏమి మాయో…..ఇది ఏమి హయో.
ఇది ఏమి మాయో…..ఇది ఏమి హయో.
• చెలి చెలి…. నా కై విరిసిన కుసుమాంజలి.
• సఖి సఖి…. నా కై వెలసిన హృదయాంజలి.
• నవ్వే నీ పెదవుల పై గువ్వై ‘నే’ వాలాలి.
• చాచే నీ చేతుల పై లాలి ‘నే' కావాలి.
• తీగంటి నీ నడుమున తేనేటీగ ‘నై’ తిరగాలి.
• వెన్నంటి నీ పాదమున కుసుమమై ‘నే' విరియాలి.
• ఏమి మాయో…..ఇది ఏమి హయో.
ఇది ఏమి మాయో…..ఇది ఏమి హయో.
• తలపంతా నీ వైపు తరుముతూ ఉంది.
• తనువంతా నా లోన తికమకతో ఉంది.
• నీ కనులకు నాపై కనికరం ఏనాడు.
• నీ మనసుకు నాపై పరవశం ఏనాడు.
• చూస్తున్నాను....
• చెలి చెలి.... నా కై విరిసిన కుసుమాంజలి.
• ఎదురు చూస్తూ ఉన్నాను....
• సఖి సఖి.... నా కై వెలసిన హృదయాంజలి.
యడ్ల శ్రీనివాసరావు 16 May 2022 2:00 PM.
*కొలవక = నీ మనసు తెలియకుండా, Measure చేయకుండానే
*నందం = సంతోషం, ఆనందం.
No comments:
Post a Comment