Friday, May 27, 2022

188. ఊహలు ఊసులు

 

ఊహలు ఊసులు


ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• జపించిన జపము తో నిజమాయెను కలలు.

• కరుణించిన కాలము లో కలిసిపోయెను కవళికలు.


స్పర్శ కి స్పర్శ తోడైన  నీడంతా ఆయెను వెన్నెల వాడ.

• సిరి రాగము ల తోడ శృంగారము జాడై నిజమాయెను ఊహలు.




ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• ఆరేసిన అందంతో మెరిసెను మెరుపుల కాంతులు.

• ఆశల జల్లులతో తడిచెను తలంబ్రాల సొగసులు.


శ్వాస  కి  శ్వాస  జతైన  వేళన   ఊపిరులే  ఆయెను చిరు చెమటలు.

• కురులు తెరలుగా ఎగిరి ముఖమును తాకుతుంటే నిజమాయెను ఊసులు.




ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• ఇసుక తిన్నె చందముగా విరిసెను కాంతన కటి కనకము.

• ఒలికిన ఒయ్యారము ఒరిగెను నెలవంక లా


• ధ్యాస తో ధ్యాస లీనమైన ఊహలే  ఆయెను హేలలు.

• తారలు తమ ఉనికి కై వెతికినపుడు నిజమాయెను ఈ ఊహలు ఊసులు.


ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.



కవళికలు = మార్పులు

వాడ = ప్రదేశం.

హేలలు = విలాసాలు , శృంగార చేష్టలు


యడ్ల శ్రీనివాసరావు 27 May 2022 11:00 PM.





No comments:

Post a Comment

618. వెలుగు రేఖలు

  వెలుగు రేఖలు   • ఎన్నో   జన్మల    భాగ్యం   ఈ   వెలుగు   రేఖలు  . • అలసిన    వారే      తీరం    చేరును .   సొలసిన   వారికే    అమృతం   దొరక...