Thursday, May 19, 2022

179. ప్రేమ కాలం లో పద భాసలు

 


ప్రేమ కాలం లో పద భాసలు


• రాత ఒక జీవం….రచన ఒక వేదం.

• రచించిన రాతలే నా జీవన వేదం.


• నోటి మాటలు మారుతు కాలంలో కరిగి'పోతే.

• చేతి రాతలు చెరగక కాలంతో కలిసి ఉన్నాయి.


• ఊసులన్ని ఊహలై కాలంలో ఆవిరై'పోతే'

• గుండె కోతలు వాతలై కాలంలో కలవకున్నాయి.



• రాత ఒక జీవం….రచన ఒక వేదం.

• రచించిన రాతలే నా జీవన వేదం.


• మనసు వాక్యానికి  ప్రేమ భాస అవుతుంటే

• ప్రియుని శ్రావ్యానికి  ప్రేయసి ఆశ అవుతుంది.


• ఆశే ఆలాపనై ప్రేమకు  నీరాజనం అవుతుంటే

• ఆకాంక్ష తోని ఆరాధన  ప్రియురాలి పై

• అమరం అవుతుంది….అజరామరమవుతుంది.



• రాత ఒక జీవం….రచన ఒక వేదం.

• రచించిన రాతలే నా జీవన వేదం.


• పదము పవనమై….కావ్యంలా వర్షిస్తుంటే.

• పద కావ్యం చందనమై పరిమళమవుతుంది.


• ప్రియుని పై మోహంతో…ప్రేయసి మైనమవుతుంటే

• ప్రేమ జల్లు లో శిల శిల్పమై

• కరుగుతు ఉంది…ఒదుగుతు ఉంది.



• రాత ఒక జీవం….రచన ఒక వేదం.

• రచించిన రాతలే నా జీవన వేదం.


• రక్షణ మైన మనసుకి

• లక్షణ మైన మనిషి తోడైతే

• సులక్షణ మైన జీవితంతో…

• సంరక్షణ భాగ్యమై

• జీవన పునాది పడుతుంది.

• సహజీవనం సంక్రాంతి అవుతుంది.


యడ్ల శ్రీనివాసరావు 19 May 2022 8:00 PM.






No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...