గాననాట్యం
• పదనిసల అలలతో, సాయం గోదావరి ఉరకలేస్తుంటే.
• పరవశించు హృదయం లో పదము పులకరిస్తుంటే.
• పల్లవి కదలాడే….చరణము గుసగుసలాడే.
• ఊహలు మెదలాడే…కరములు కళకళలాడే.
• కలిసి మెలసి అలసి సొలసి
• పాటకు ప్రాణమాయే…..సాహితికి ఊపిరాయే.
• ఈ రాగం రస రంజ భోగం…
• అనురాగం చెలి చెంత గారం.
• ఈ గానం విన సొంపు యోగం…
• శృంగారం సఖి తోడ సౌఖ్యం.
• ఈ గీతం కృతి వర్ణ రూపం.
• సంగీతం సతి నుదుటి భాగ్యం.
• సత స్వర వాణి నలువ రాణి కళ్యాణి
• సుమధుర బాణి నీలవేణి పూబోణీ.
• తకదిమిల తాళం మాలికకు మోహం….
• సరిగమల శ్రావ్యం శృతిలయల సంగమం.
యడ్ల శ్రీనివాసరావు 2 May 2022 6:00 PM.
No comments:
Post a Comment