Saturday, April 30, 2022

163. కార్మికులం…మేం…శ్రామికులం

 

కార్మికులం…మేం…శ్రామికులం


• హైలేస్సో…హైలెస్సా....హైలేస్సో హైలెస్సా….

   అహు ఆహు ఆహు…

• కార్మికులం…. మేము కార్మికులం…

  మా కులమే కర్మ కులం.

• శ్రామికులం…. మేము శ్రామికులం….

  మా కులమే శ్రమ కులం.

• పుచ్చలపల్లి వారసులం….

  కంకి కొడవలి సాయుధులం.

• మన్నును నమ్మిన మనుషులం ….

  మోసం తెలియని మనసులం.


కోరస్: ఎన్ని మార్పులొచ్చి….ఎంతెంత మారినా.…

   మేము లేని చోట పనికి లోటాయెనే.

• ఆహు ఆహు ఆహు….

  హైలెస్సో హైలెస్సా హైలేస్సో హైలెస్సా


• కండనమ్ముకొని కట్టెలెత్తుతాం….

• కడుపు చంపుకొని నీరు తాగుతాం.

• ఆహు ఆహు ఆహు.


• కాలమెటు పోతే అటు పాకుతాం….

• నిలువలేక పోతే కూలి నాలై పోతాం.

• ఆహు ఆహు ఆహు.


• గంజి కూడు కోసం గునపాలు ఎత్తుతాం….

• గూడు నీడ కోసం గుడిసెలో నిదరవుతాం….

• ఆహు ఆహు ఆహు.


• నాణ్యం లేని బతుకుకి బానిసలవుతాం….

• నాణేల కోసం నరనరాలకు నరకం చూపిస్తాం.

• ఆహు ఆహు ఆహు.


• ఉన్నోల సేవలకు జై జై లు కొడతాం....

• శుంఠల వంచనకు ఛీ ఛీ లు పెడతాం

• ఆహు ఆహు ఆహు.


• చెప్పు లేని పాదాలు చిందులతో పరిగెడతాయి....

• చెప్ప లేని పదాలు కంఠంలో అడుగిడతాయి.

• ఆహు ఆహు ఆహు.


• కార్మికులం…. మేము కార్మికులం…

  మా కులమే కర్మ కులం.

• శ్రామికులం…. మేము శ్రామికులం….

  మా కులమే శ్రమ కులం.

• హైలేస్సో…హైలెస్సా....హైలేస్సో హైలెస్సా….

  అహు ఆహు ఆహు…


కోరస్ : ఎన్ని  మార్పులొచ్చి.. ఎంతెంత మారినా…

   మేము లేని చోట పనికి లోటాయెనే

• ఆహు ఆహు ఆహు….

   హైలెస్సో హైలెస్సా హైలేస్సో హైలెస్సా


యడ్ల శ్రీనివాసరావు 1 May 2022 , 11:30 AM.



No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...