తపతిని…ఓ తపతిని
• తపతిని….ఓ తపతిని….నా తలపుల తరంగిణి.
• తపతిని….ఓ తపతిని….నా వలపుల వరూధిని.
• కలలోని కావ్యం కనులు దాటి…..
ఆయెను ఇలలోని నవ్యం.
• కలలో తోడు జాబిలి రాగా….
కమలం వికసించెను.
• ఇలలో నీడ నీవు కాగా....
సకలం సుందరమాయెను.
• తపతిని….ఓ తపతిని….నా తలపుల తరంగిణి.
• తపతిని….ఓ తపతిని….నా వలపుల వరూధిని.
• ఎదలోని భవ్యం అసువు దాటి….
ఆయెను మదిలోకి సవ్యం.
• అసువు తోడు అమరం కాగా….
బంధం సంతసించెను.
• మదికి నీడ నీవు రాగా....
నిఖిలం నందనమాయెను.
• తపతిని….ఓ తపతిని….నా తలపుల తరంగిణి.
• తపతిని….ఓ తపతిని….నా వలపుల వరూధిని.
• అందెల సందడి కలలో వెంబడి
• వసంత భోగము ఇలలో కనబడి
• నవ్వుల సవ్వడి ఎదలో వినపడి
• ఊహల ఒరవడి మదిలో తడబడి
• కల ఇలయై….
• జాబిలి నీవై….
• కావ్యమే నవ్యమవుతున్న వేళ….
• ఎద మదియై….
• అమరం నీవై....
• భవ్యమే సవ్యమవుతున్న వేళ….
• నా తపతికి నేనే వరుడుని….సంవరుడిని.
• నా వరూధికి నేనే వరుడిని….ప్రవరుడిని.
• తపతిని….ఓ తపతిని….నా తలపుల తరంగిణి.
• తపతిని….ఓ తపతిని….నా వలపుల వరూధిని.
యడ్ల శ్రీనివాసరావు 1 May 2022, 2:00 AM.
తపతి = సూర్యుని కుమార్తె, దేవత.
కావ్యం = కవికృత గ్రంథము
నవ్యం = రూపాంతరం, కనపడునది, కొత్తది.
భవ్యం = శుభము.
సవ్యం = అనుకూలము
అసువు = ప్రాణం.
అమరం = మరణం లేని
నిఖిలం = సమస్తం
నందనం = ఇంద్రుని ఉద్యానవనం.
అందెలు = గజ్జెలు.
సంవరుడు = తపతి భర్త.
ప్రవరుడు = వరూధిని భర్త.
No comments:
Post a Comment