Friday, April 1, 2022

156. ఉగాది ఉషోదయం

 

ఉగాది ఉషోదయం


• సుప్రభాత వేళ…

• జాబిల్లి అలసి ఉన్న వేళ.


• చిరునవ్వుల తో చీకటిని చీలుస్తూ….

• భానుడు  బంగారం లా మెరుస్తున్న వేళ.


• నల్లని కొకిల కంఠంలో.…

• సెలయేరు రాగమై జారుతు పాడుతు ఉంటే…


• ఊరందరికీ శ్రవణా ఆనందం…

• కానీ   నా  “నందిని"  మనసుకి...

• అంతకు మించిన సంతోషం.


• వేపపువ్వు వయ్యారం తో…

• మావిచిగురు సింగారం లా…

• చెరుకు లాంటి శృంగారం తో…

• కలబోసిన కాదంబరివి….

• నువ్వే నా…ఆ నువ్వేనా….

• నీ నవ్వేనా….ఆ నువ్వేనా…..

• నా జీవన ఉగాది కి తొలి కిరణం…..నువ్వేనా.


• ఉప్పు లాంటి ఉత్సాహంతో…

• పులుపు లోని లొట్టలు వేస్తూ…

• మిరప లాగ మిరుమిట్లు గా చూస్తూ…

• కేరింతలు వేస్తావు…

• నీ పట్టు పావడాని ఉక్కిరిబిక్కిరి చేస్తావు.


• నువ్వేనా…ఆ నువ్వేనా….

• నా జీవన కిరణం నువ్వేనా.


• ప్రకృతి లో అందాలకు….

• పట్టుగొమ్మవి నువ్వే అయితే.

• పల్లెలోని పక్షులు అన్నీ….

• నీకు దాసోహం అంటున్నాయి.


• కాలి పట్టీలను తాకిన నీ పట్టు పరికిణీ

• పదనిసలు పాడుతూ ఉంటే...


• నీ అడుగుల  సవ్వడి కి...

• ధరణి దరహాసం చిందుస్తూ ఉంది.


• నీ గాజుల సవ్వడి కి….

• గోరింకలు గుసగుసలాడుతూ ఉంటే...


• నీ చెంపను  తాకిన  స్వేదము  ను

• ఆవిరి చేసేందుకు చల్లని పైరు గాలి

• ఆరాటం పడుతూ ఉంది.


• నిను చూసిన ఆ నిమిషం

• నా లో ని  సంతోషానికి అర్దం తెలిసిందే.


• నువు నా ఎదురుగా  ఉంటే

• ఉగాదే….ప్రతి రోజూ ఉగాదే...

• ఈ జన్మంతా నాకు ఉగాదే...

• ఓ నందిని…నా నందిని…ఆనందిని.


యడ్ల శ్రీనివాసరావు 1 ఏప్రిల్ 2022 10:00 pm







No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...