Saturday, April 16, 2022

159. ముక్కు పుడక

 

ముక్కు పుడక



• ముక్కెర…ఓ ముక్కెర…
• మనసును దోచిన ముక్కెర.
• చెలి ముఖమున చక్కని చుక్కలా
• ముక్కెర….ఓ ముక్కెర.

• కనుల ఎదుట కనకమా
• కోమలి చూపుకు కాంచనమా
• ఎగసిన శ్వాసకి కుసుమమా
• సొగసున మేనికి ఆభరణమా

• ముక్కెర…ఓ ముక్కెర
• మగువను వలచిన ముక్కెర
• మనసును దోచిన ముక్కెర

• తళ తళ మెరిసే తరుణికి
• మిల మిల మెరిసే పిందె వై
• ముఖమున ఛాయకు అందె వై
• చెక్కిలి చెంతన పులకింత వై

• చూపులకందని చురకత్తెవి….
• మాటలకందని గమ్మత్తువి…
• ముక్కెర…ఓ ముక్కెర
• మనసుకి మెచ్చిన ముక్కెర

• సూదంటి ముక్కు కి భరణమై
• వెలుగంటి మోము కి కిరణమై
• నాసిక సిగ కై బిగిసిన అక్కర
• చెలి ముక్కును తాకిన ముక్కెర

• ఉచ్ఛ్వాస నిచ్చ్వాసా ల నడుమ
• సువాసనలను స్వగతిస్తూ
• నిను మననం చేస్తుంటే…అయ్యింది చక్కెర
• మనసంతా అయ్యింది చక్కెర.
• తనువంతా అయ్యింది ఉక్కిరి బిక్కెర.

• ముక్కెర ఓ ముక్కెర
• మనసును దోచిన ముక్కెర
• మగువను వలచిన ముక్కెర
• చెలి చెక్కిలి చెంతన చుక్కలా
• ముక్కెర ఓ ముక్కెర.
• చెలికాడి మనసుకు కొక్కెర.



*అక్కర = సంగమం, కలయిక.
*కొక్కెర = కొంగ, వలపు ముడి.

యడ్ల శ్రీనివాసరావు, 15 ఏప్రిల్ 2022 11:00 pm












No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...