పంచభూతాల పరమాత్మ
• బాబ…ఓ బ్రహ్మబాబ…. చూస్తున్నాను
• ఎదురు చూస్తూ నే ఉన్నాను.
• చూస్తున్నాను…
• చూపునే చరమగీతము గా చేసి
• ఎదురు చూస్తూ ఉన్నాను.
• నీ దర్శన భాగ్యానికై….
• మనసును తైలము చేసి…
• కనులను ప్రమిదలు గా చేసి
• ఎదురు చూస్తూ ఉన్నాను.
• నీ స్మరణ చైతన్యం..
• నాలో అణువణువును స్పృశి యిస్తూ ఉంటే…
• సెలయేటి నీటినై జారుతూ ఉన్నాను.
• నీ కారుణ్య వర్షానికి
• నా లోని క్రోధాగ్ని దహనం అవుతూ ఉంటే…
• నందనవనమున గాలినై తేలి ఆడుతూ ఉన్నాను.
• బాబ…చూస్తూ ఉన్నాను…
• నిను కనులారా చూడాలని….
• ఎదురు చూస్తూ ఉన్నాను.
• నీ సహనశీలత కి
• నా మనసు లోని చంచలనాలు ధృఢమైన మైనముగా మారి…
• స్థిరమైన భూమి గా ఓరిమి చలనమ తో ఉన్నాను.
• నీ జ్ఞాన భాగ్యానికి
• నా లోని ఇంద్రియాలు, వికర్మలను సకర్మలుగా చేస్తూ ఉంటే….
• సూర్యుడి వలె తేజం తో ఉదయిస్తూ ఉన్నాను.
• బాబ…చూస్తూ ఉన్నాను…
• నిను మనసారా పొందాలని….
• ఎదురు చూస్తూ ఉన్నాను.
• నీ రాజ యోగానికి
• నా ఆలోచనల కడలి ఆవిరై , మేఘాల వలె విహరిస్తూ ఉంటే…
• ఆకాశమను సామ్రాజ్యానికి రాజునై…రారాజు నై ఉన్నాను.
• బాబ….ఓ బ్రహ్మబాబ…
• నీ దర్శన భాగ్యానికై….
• మనసును తైలము చేసి…
• కనులను ప్రమిదలు గా చేసి
• ఎదురు చూస్తూ ఉన్నాను.
యడ్ల శ్రీనివాసరావు 9 ఏప్రిల్ 2022 , 10:30 pm.
No comments:
Post a Comment