లాహిరి లాహిరి లాహిరి లో
• ఏమిటో అసలేమిటో….
నీ మేని సౌందర్యమేమిటో.
• ఏమిటో అసలేమిటో….
నీ చూపు లావణ్యమేమిటో.
• ఏమిటో అసలేమిటో....
నీ నవ్వు సాహిత్యమేమిటో.
• నవ్వుల చూపుల వెనుక....
పువ్వుల మోమాటమేమిటో.
• ఎవరిని అడగాలి….ఏమని అడగాలి.
• నా మదిలో మెదిలే ప్రశ్నకి జవాబు….
ఎక్కడ వెతకాలి.
• ఏమిటో అసలేమిటో….
నీ మేని సౌందర్యమేమిటో.
• ఏమిటో అసలేమిటో….
నీ చూపు లావణ్యమేమిటో.
• అటుగా పోతున్న హరివిల్లునడిగితే
• దివి లోని తాను భువి లోని నీవేనని
• తన లోని వర్ణాలు నీ లోని సువర్ణాలనంటొంది.
• ఇటుగా వస్తున్న రాయంచనడిగితే
• కల లోని తాను ఇల లోని నీవేనని
• వలపైన చూపుకు నునుపైన రూపు నీవంటొంది.
• నీ కోసం అంటుంటే....నా మనసు వింటుంటే
• ఎప్పుడు చెప్పాలి...
ఏమని చెప్పాలి...
నీ తో ఎలా చెప్పాలి.
• ఎవరిని అడగాలి….ఏమని అడగాలి.
• నా మదిలో మెదిలే ప్రశ్నకి జవాబు...
ఎక్కడ వెతకాలి.
• ఏమిటో అసలేమిటో….
నీ నవ్వు సాహిత్యమేమిటో.
• నవ్వుల చూపుల వెనుక….
పువ్వుల మోమాటమేమిటో
• అటుగా దాగిన ముత్యమునడిగితే
• తన లోని శాంతం నీ లోని మౌనమని
• సొగసైన నవ్వుకు వెలుగై నీవే సాహితివంటొంది.
• అటు ఇటు నిండిన ప్రకృతినడిగితే
• తన లోని అందం నీ లోని చందమని
• పువ్వుల వర్షం నీ మేని చూపుకు హర్షమంటొంది.
• నీ కోసం అంటుంటే...నా మనసు వింటుంటే
• ఎప్పుడు చెప్పాలి...
ఏమని చెప్పాలి...
నీ తో ఎలా చెప్పాలి.
• రాయంచ = రాజహాంస
యడ్ల శ్రీనివాసరావు 19 ఏప్రిల్ 2022 3:00 pm.
No comments:
Post a Comment