“లలిత” - “కళ” లు
1. కావ్యము :
• సునయన పాణి అక్షర వాణి.
• ఛందస్సు తో చంపక మాలను అల్లిన శార్వాణి.
మీనాక్షి నీ చేతి అక్షర పలుకులు, పద్యలక్షణాలతో సంపెంగ మాలవలె అల్లినవి ఓంకార స్వరూపాలు.
2. సంగీతము :
• సుమధుర వేణి కళ్యాణి బాణి.
• రాగమాలికతో కీర్తన చేసే రాగిణి.
రాగ స్వరాలను మాలగా అలవోకగా పాడే ఓ శ్రీలక్ష్మి. మధురమైన నదీ ప్రవాహం వంటిది కళ్యాణి రాగం,
3. నృత్యము:
• సవరన మణి నర్తన రాణి.
• అక్షర కీర్తన ఆలింగనల నాట్య కారిణి.
తేజోమయంగా నాట్యము చేయు అందమైన ఓ రాణి, పాటల పదముల కౌగిలి నీ నృత్యము.
4. శిల్పము :
• సురదన హరిణి సౌందర్య రూపిణి.
• శిలలో వెలిసిన అజంతా శిల్ప వర్షిణి.
లలితమైన బంగారు ప్రతిమ గల ఓ సౌందర్య రూపిణి. వర్షం చినుకుల వలె, రాతిలో వెలసిన అనేక రూపములు గల అజంతా శిల్పానివి.
5. చిత్రలేఖనం :
• సుయామున బోణి ప్రకృతి శివాణి.
• ఛాయాచిత్రాన సురభి కుంచె వైన రుక్మిణీ.
యమునా నదికి ప్రియమైన తొలి ప్రకృతి ఓ పార్వతి దేవి, బంగారు కుంచె తో నీ చిత్రం వేసిన, బంగారు కాంతి కలదాన.
యడ్ల శ్రీనివాసరావు 5 May 2022 12:30 AM.
No comments:
Post a Comment