చిత్రం….శివయ్య....విచిత్రం
• ఎంత దూరమయా….ఎంత భారమయా
ఎంత వేదనయా.…ఎంత రోదనయా…. శివా
• నీ జాడ కోసం ఏడేడో వెతికితి
నీ నీడ కోసం ఏడెడో సాకితి
నీ ఆన కోసం ఎన్నాళ్ళ వేచితి
నీ చూపు కోసం ఎన్నేళ్ళో చూసితి
• శివా ఇది యేమి చిత్రం….
ఇది యే నీ విచిత్రం హర.
• ఎంత దూరమయా….ఎంత భారమయా
ఎంత వేదనయా.…ఎంత రోదనయా…. శివా
• దూర భారము ఎరుగక
నా మనసు దివ్యమున
• కొలువు కాచిన నిన్ను
కానలేకున్నానయా శివా
• అల్పుడనై ఉన్నాను
హర…హర హర.
• వేద రోదనల నడుమ
నా బుద్ది తేజమున
• నిలిచిన నీడ వై ఉన్నా
స్పర్శలేకున్నానయా శివా….
• మందకోడి నై ఉన్నాను శివ…శివ శివ.
• ఎంత దూరమయా….ఎంత భారమయా
• ఎంత వేదనయా.…ఎంత రోదనయా…. శివా
• నీ జాడ కోసం ఏడేడో వెతికితి
నీ నీడ కోసం ఏడెడో సాకితి
• నీ జాడ కోసం
జగమంత వెతికితే
• జగమునే నా లోన లో లోన
జాగృతం చేసావయా.
• నీ నీడ కోసం
నేలంత సాకితే
• వెన్ను లో దన్ను యై
వెన్నంటి నెలవుగా నిలిచావయా.
• శివా ఇది యేమి చిత్రం….
ఇది యే నీ విచిత్రం హర.
• ఎంత దూరమయా….ఎంత భారమయా
• ఎంత వేదనయా.…ఎంత రోదనయా…. శివా
• నీ ఆన కోసం ఎన్నాళ్ళ వేచితి
నీ చూపు కోసం ఎన్నేళ్ళో చూసితి.
• నీ ఆన కోసం ఎన్నాళ్ళ వేచిన
ధ్యానము న భావనలు
నీ ఆనలే నని తెలియలేదయా.
• నీ చూపు కోసం ఎన్నేళ్ళో చూసినా
కనులు ముందే నీవు
నిలిచి ఉన్నావని తెలియలేదయా.
మాయ ముసుగులో కానలేదయా శివయ్య.
• శివా ఇది యేమి చిత్రం….
ఇది యే నీ విచిత్రం హర.
యడ్ల శ్రీనివాసరావు 28 May 2022 11:30 pm.
No comments:
Post a Comment