హాసిత సింగారం
• ఏమని సెప్పేది చిన్నమ్మి….
• ఏమని సెప్పేది బుల్లమ్మి.
• నీ సిలిపి నవ్వులోన….
• సిలక పలుకుల గూర్సి ఏమని సెప్పేది..
• నీ మాట సొంపు లోన….
• ఓ… ఓ…. దీర్ఘ రాగాల గూర్సి ఏమని సెప్పేది.
• నీ కళ్ల సక్రాలతో….
• గిరగిర తిప్పే హొయల సిత్రాల గూర్సి ఏమని సెప్పెది.
• నీ వో... వో… అచ్చరాల్లో….
• నడుము అగుపడుతుంటే
సొగసు భాసల గూర్సి ఏమని సెప్పేది.
• ఏమని సెప్పేది చిన్నమ్మి….
• ఏమని సెప్పేది బుల్లమ్మి.
• సిలక పలుకులకు.…ఆ…నీ...సిలకపలకులకు…
• సిలకనై వచ్చి నీ ముక్కు కొరికి పోయేదని సెప్పలా.
• ఓ…ఓ…రాగం తీసే…
• నీ పెదవి సున్నాలను నే వచ్చి సరి సేసేదని సెప్పాలా.
• నీ కళ్ల గిరగిర లను….
• నా కంటి పాపతో జతగ సేర్సి సరిసేసేదని సెప్పాలా.
• ఏమని సెప్పేది చిన్నమ్మి…
• ఏమని సెప్పేది బుల్లమ్మి.
• నీ సొగసు భాసలను….
• నా కౌగిలాటతో సక్కంగా సేసేదని సెప్పలా.
• ఏమని సెప్పేది చిన్నమ్మి…
• ఏమని సెప్పేది బుల్లమ్మి.
యడ్ల శ్రీనివాసరావు 7 May 2022 , 10:30 AM.
No comments:
Post a Comment