Saturday, May 14, 2022

175. సాగర సౌశీల్యం

 

సాగర సౌశీల్యం

• సరదాగా ఈ ఉదయం….సాగర వలయంలో

• తొలకరి మాటలతో గడసరి ఆటలతో ఒకటయితే

• ఉదయం కోరుతుంది అరుణం.

• వలయం అవుతోంది కధనం.


సాగర వలయం లో సరదాగా ఈ ఉదయం….. తొలిసారిగా మాట్లాడుతూ , గడసరి గా ఆటలు ఆడుతూ ఒకటిగా అయితే……ఉదయం కోరుకొంటుంది నుదుటి సింధూరం….కంఠమాల అవుతుంది ఒక కధ వలె.



• సరదాగా ఈ సాయం…..సాగర తీరంలో

• సడివడి నడకలతో బుడి బుడి అడుగులు వేస్తుంటే

• సాయం కోరుతుంది సంధ్య.

• తీరం తాకుతుంది వింధ్య.


ఈ అందమైన సాగర తీరం లో సరదాగా ఈ సాయంత్రం ….. శ్రావ్యమైన శబ్ధం తో   చిరు వేగంగా  చిన్ని చిన్ని అడుగులు వేస్తుంటే……సాయం కోరుతుంది సంధ్య …. తీరం  తాకుతూ ఉంది వింధ్య(పర్వతం).



• సరదాగా ఈ సమయం….. సాగర అఖిలం లో

• తడిపొడి వలువలతో చెరిసరి చేతులు జతయైతే

• సమయం కోరుతోంది సంగమం.

• అఖిలం అవుతోంది సంయోగం.


సమస్తమైన ఈ సాగరమున సరదాగా ఈ సమయం లో…..తడి పొడి బట్టలతో , పరస్పర అన్యోన్యత తో చేతులు జతగా కలిసినపుడు……కాలం కోరుతుంది కలయిక….. సమస్తం అవుతుంది పరిపూర్ణం.



• సరదాగా ఈ రేయి….సాగర గమనం లో

• అలజడి వదనంతో సొగసరి మనసు మౌనమైతే

• రేయి కోరుతుంది వెన్నెల

• గమనం అవుతోంది సుగమము.


సాగర ప్రయాణం లో సరదాగా ఈ రాతిరి…. ఆందోళన కలిగిన ముఖమును , అందగాడి మనసు నిశ్శబ్దం గా చూస్తుంటే……రాత్రి కోరుకుంటుంది వెన్నెల…..ఆ ప్రయాణం అవుతుంది సుందరము.


యడ్ల శ్రీనివాసరావు 15 May 2022 12:30 AM.





No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...