Monday, May 23, 2022

184. నరుడా ఓ నరుడా

 

నరుడా ఓ నరుడా


• నరుడా ఓ నరుడా

  ఎత్తిన జన్మము ఎక్కడది …

  చేసిన కర్మము ఎప్పటిది.

• సుఖము సుఖమని వెతుకుతావు 

   దుఃఖం తోనే ఉంటావు.

• ధనము ధనమని పరుగెడుతావు 

  దీనుడివై దిక్కులు చూస్తుంటావు.

  చివరకు ఒత్తిడి తోనే చాలిస్తావు.


• నరుడా ఓ‌ నరుడా

  వచ్చిన మార్గము ఎన్నవది …

  చేసిన సంచితము ఎప్పటిది.

• ముక్తి ముక్తి అని అంటావు ...

  నీ మూలమేమిటో మననం చేయవు.

• భక్తి భక్తి అని దేవులాడుతావు ...

   కోరికల తోనే వ్యాపారం చేస్తావు.

  చివరికి దేవుడికి వాటాలు ఇస్తావు


• నరుడా ఓ‌ నరుడా

  ఇచ్చిన భోగం ఎక్కడిది …

  చెప్పిన జ్ఞానం ఎవరది.

• దేహము దేహము అంటావు ... 

  దేహభిమాని వై ఉంటావు.

• చివరకు నీ  ఆత్మనెరుగక ...

  దేహి దేహి అంటావు.


• నరుడా ఓ నరుడా

  చింతలు చింతలు అంటావు ...

  చితిలో చిందులు తొక్కుతు ఉంటావు.

• మౌనము లోనే చింతకు ...

   పరిష్కారం దాగి ఉందని తెలుసుకోలేవు.

• గూడు గూడు అని అంటావు ...

  మేడలు మిద్దెలు కడతావు.

  చివరికి నీ ఎముకల గూడు ను దాచుకోలేవు.


యడ్ల శ్రీనివాసరావు 23 May 2022 , 10:30 AM.





No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...