కవితా సంపెంగ
• పదమెరుగని కధనమునకు
• అలుపెరుగని ఆలోచనతో
• పూసింది ఈ కవితా పుష్పం.
• విరిసింది ఈ సంపెంగ రచన.
• కారుమబ్బులు కుమ్ముతుంటే
• కనురెప్పలు కలవరమైతే
• కమ్మని కోయిల కుహు కుహు అంటూ…రమ్మంటే
• చెలి చెంగు కప్పుకొని చెంగు చెంగున
• చెంగల్వ చెంతకు చేరగా
• మేఘములు రాగాలై ఉరుములు శ్రావ్యాలై
• మెరుపులు గీతాలై చినుకులు గానం చేస్తున్నాయి.
• స్వరాలు ఏరులై పారుతున్నాయి
• చెలి నాట్యం చేస్తుంది
• మయూరి మైమరచి చూస్తుంది.
• హరివిల్లు వర్ణాలను వలకపోస్తుంది.
• వర్షపు జల్లుల దారలు
• చెలి చెంపన ముత్యాలై జారుతూ ఉంటే
• తన దోసిలి చాలని చెలికాడు
• ముఖద్వారముతో నింపెను.
• చెలి శ్వాస నే రుచి చూసెను
• మేఘాల ఊహల్లో ఉరుములు జోలల్లో
• మెరుపులు కలలైతే చినుకులా తేలుతూ
• చెలి అడుగు”నే” చెలికాడు
• నడుము నొదలక నలుగుతున్నాడు.
యడ్ల శ్రీనివాసరావు 22 May 2022 11:30 PM.
No comments:
Post a Comment